MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Ishan Kishan : SRH ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే సెంచరీ.. సలామ్ కొట్టాల్సిందే !

Ishan Kishan : SRH ప్లేయర్ ఊచకోత.. 33 బంతుల్లోనే సెంచరీ.. సలామ్ కొట్టాల్సిందే !

SRH Ishan Kishan : విజయ్ హజారే ట్రోఫీలో SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లో సెంచరీతో దుమ్మురేపాడు. ఐపీఎల్‌లో కావ్య మారన్ టీమ్‌ కు ఎంపికైన ఈ స్టార్ ప్లేయర్, కర్ణాటకపై 14 సిక్సర్లతో విరుచుకుపడి టీ20 వరల్డ్ కప్ ఎంపికను ఘనంగా చాటుకున్నాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 24 2025, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వరల్డ్ కప్ ఎంపికైన వేళ.. ఇషాన్ కిషన్ పూనకం.. 14 సిక్సర్లతో రికార్డుల మోత
Image Credit : X@Akshatgoel1408

వరల్డ్ కప్ ఎంపికైన వేళ.. ఇషాన్ కిషన్ పూనకం.. 14 సిక్సర్లతో రికార్డుల మోత

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టుకు ఎంపికైన ఆనందంలో ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మైదానంలో పరుగుల వరద పారించాడు. బ్యాట్ తో సమాధానం చెప్పడమే కాదు, రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో పరుగుల వర్షం కురిసింది.

బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్రౌండ్ లో ఇషాన్ కిషన్ సిక్సర్ల సునామీ
Image Credit : Gemini

గ్రౌండ్ లో ఇషాన్ కిషన్ సిక్సర్ల సునామీ

కర్ణాటకతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో జార్ఖండ్ ఇన్నింగ్స్ చివరి దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్, మొదటి బంతి నుండే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విజయ్‌కుమార్ వైశాఖ్, శ్రేయాస్ గోపాల్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ, ఇషాన్ వారిని ధీటుటా ఎదుర్కొన్నాడు.

కేవలం 39 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఏకంగా 125 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు ఉండగా, ఏకంగా 14 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 320.15గా నమోదైంది. ఇషాన్ 39వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, జట్టు స్కోరును 412 పరుగుల భారీ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా తన ఇన్నింగ్స్ చివరి 19 బంతుల్లోనే 73 పరుగులు పిండుకున్నాడంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

36
ఒకే రోజు రెండు ప్రపంచ రికార్డులు
Image Credit : ANI

ఒకే రోజు రెండు ప్రపంచ రికార్డులు

విశేషమేమిటంటే, ఇషాన్ కిషన్ ఈ రికార్డు సృష్టించిన రోజే, బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కూడా చరిత్ర సృష్టించాడు. రాంచీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో భారతీయ ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నమోదైంది.

దీంతో ఇషాన్ కిషన్ 33 బంతుల సెంచరీ రెండో అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. ఇషాన్ కిషన్ ఈ క్రమంలో పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్, ఇటీవల రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో సెంచరీ) రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే రోజు, కొన్ని నిమిషాల వ్యవధిలో ఇద్దరు భారతీయ బ్యాటర్లు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులను బద్దలు కొట్టడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.

46
టీ20 వరల్డ్ కప్ ఎంపికకు సరైన న్యాయం
Image Credit : ANI

టీ20 వరల్డ్ కప్ ఎంపికకు సరైన న్యాయం

కొన్ని రోజుల క్రితమే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్, తన ఎంపిక సరైనదేనని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించుకున్నాడు. డిసెంబర్ 2023లో వ్యక్తిగత కారణాలతో బ్రేక్ తీసుకున్న తర్వాత, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, తన పట్టుదలతో తిరిగి జట్టులోకి వచ్చాడు.

ముఖ్యంగా ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లలో 517 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్‌లో హర్యానాపై 49 బంతుల్లో 101 పరుగులు చేసి జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. ఆ ఫామ్‌ను ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తూ, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

56
ఐపీఎల్‌లో కావ్య మారన్ ఫుల్ హ్యాపీ
Image Credit : ANI

ఐపీఎల్‌లో కావ్య మారన్ ఫుల్ హ్యాపీ

ఇషాన్ కిషన్ ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్, అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆరెంజ్ ఆర్మీకి శుభసూచకం.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన విలువేంటో చాటిచెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా భారీ స్కోరు సాధించాల్సినప్పుడు తను ఎంత ప్రమాదకరంగా మారగలడో ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి స్పష్టమైంది.

66
మ్యాచ్ హైలైట్స్
Image Credit : ANI

మ్యాచ్ హైలైట్స్

అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక బౌలింగ్ ఎంచుకుంది. అయితే జార్ఖండ్ బ్యాటర్లు వారి నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. నిర్ణీత 50 ఓవర్లలో జార్ఖండ్ 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (125) విధ్వంసానికి తోడు, విరాట్ సింగ్ (88), కుమార్ కుశాగ్రా (63) రాణించారు. కర్ణాటక బౌలర్లలో వైశాఖ్, శ్రేయాస్ గోపాల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కొట్టిన 14 సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇషాన్‌ను అసలైన ధురంధరుడు అంటూ ప్రశంసిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Rohit Sharma : 27 ఫోర్లు సిక్సర్లతో రఫ్ఫాడించిన రోహత్ శర్మ.. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ మ్యాన్ షో
Recommended image2
Virat Kohli : విరాట్ కోహ్లీ ఆస్తి వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఒక్క పోస్టుకు అన్ని కోట్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved