MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?

IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?

Rishabh Pant Drone Crash Viral Video: భారత్, ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కొట్టిన షాట్‌కు డ్రోన్ కూలిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే పంత్ దెబ్బకు డ్రోన్ కూలిందా? అసలు ఏం జరిగింది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 07 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పంత్ భయ్యా కొట్టుడు.. డ్రోన్ కూలుడు.. నిజమేనా?
Image Credit : ANI

పంత్ భయ్యా కొట్టుడు.. డ్రోన్ కూలుడు.. నిజమేనా?

ముల్లాన్‌పూర్‌ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అది మ్యాచ్ స్కోర్ వల్ల కాదు.. ఒక విచిత్రమైన వీడియో వల్ల.. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ 28 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక భారీ షాట్ కొట్టాడని, ఆ బంతి వెళ్లి గాల్లో ఎగురుతున్న డ్రోన్ కెమెరాను బలంగా తాకడంతో అది కాస్తా గ్రౌండ్‌లో కూలిపోయిందనేది ఆ వీడియో సారాంశం.

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లో ఈ క్లిప్ చూసిన నెటిజన్లు "పంత్ పవర్‌కు డ్రోన్ కూడా షేక్ అయిపోయింది" అంటూ ఒక రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ వీడియోలో కనిపించేదంతా నిజం కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పంత్ వైరల్ డ్రోన్ వీడియో ఏఐ మాయాజాలం
Image Credit : X/BCCI

పంత్ వైరల్ డ్రోన్ వీడియో ఏఐ మాయాజాలం

వైరల్ అవుతున్న ఈ వీడియోను కొంచెం నిశితంగా, లాజికల్‌గా గమనిస్తే ఇది ముమ్మాటికీ నకిలీ వీడియో అని ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఉన్న అతిపెద్ద బ్లండర్ ఏంటంటే.. ప్రస్తుతం జరుగుతున్నది టెస్ట్ మ్యాచ్ కాబట్టి రూల్స్ ప్రకారం రెడ్ బాల్ వాడాలి. కానీ, ఈ వైరల్ క్లిప్‌లో బౌలర్ వేసేది, పంత్ కొట్టేది మాత్రం వైట్ బాల్. వన్డేలు, టీ20ల్లో మాత్రమే వైట్ బాల్ వాడతారనే చిన్న లాజిక్ ఇక్కడ ఫేక్ వీడియో మేకర్స్ మిస్ అయ్యారు. అంతేకాదు, ఆ వీడియోలో బంతి తగిలి డ్రోన్ కింద పడిన తర్వాత అక్కడ ఒక బంతి పక్కకు వెళ్లగా, అదే టైమ్‌లో డ్రోన్ లోపలి నుండి మరో బంతి అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. ఇలా ఒకే చోట రెండు బంతులు ప్రత్యక్షం కావడంతో ఇది పక్కా ఏఐతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో అని తేలిపోయింది.

Helicopter shot❌
Drone shot 💥😂
PANTastic💥#INDvsAFG pic.twitter.com/cfXZJqhdlm

— Wanderer (@vkyash18oz) June 7, 2026

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cric Madness TV (@cricmadnesstv)

34
సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దాటడం అంత ఈజీ కాదు
Image Credit : X/BCCI

సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దాటడం అంత ఈజీ కాదు

సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో స్టేడియంపై ఎగిరే స్పైడర్ క్యామ్‌లు లేదా డ్రోన్ కెమెరాలను క్రికెట్ బాల్ వెళ్లే గరిష్ఠ ఎత్తు కంటే చాలా పైనే ఉండేలా బీసీసీఐ మేనేజ్ చేస్తుంది. పంత్ తన మార్క్ అగ్రెసివ్ షాట్లు ఆడిన మాట వాస్తవమే కానీ, అవేవీ డ్రోన్‌ను తాకలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో పంత్ 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన చేరి సరికొత్త రికార్డులను సృష్టించాడు.

44
అప్రమత్తంగా ఉండాల్సిందే..
Image Credit : X/BCCI

అప్రమత్తంగా ఉండాల్సిందే..

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కత్తిమీద సాములా మారింది. కొంతమంది కావాలనే వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి వదులుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండుసార్లు నిజానిజాలు సరిచూసుకోవాలని క్రికెట్ లవర్స్ ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Recommended image2
Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved