MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • WI vs SCO : వెస్టిండీస్ కొత్త బాస్ వచ్చేశాడు.. టీ20 వరల్డ్ కప్‌లో హెట్మెయర్ వరల్డ్ రికార్డ్

WI vs SCO : వెస్టిండీస్ కొత్త బాస్ వచ్చేశాడు.. టీ20 వరల్డ్ కప్‌లో హెట్మెయర్ వరల్డ్ రికార్డ్

West Indies vs Scotland : టీ20 వరల్డ్ కప్ 2026లో షిమ్రాన్ హెట్మెయర్ రికార్డు సృష్టించాడు. స్కాట్లాండ్‌పై కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విండీస్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 07 2026, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గేల్ రికార్డు ఖతం.. 22 బంతుల్లోనే ఊచకోత కోసిన హెట్మెయర్
Image Credit : Getty

గేల్ రికార్డు ఖతం.. 22 బంతుల్లోనే ఊచకోత కోసిన హెట్మెయర్

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో శనివారం ఒక చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన హెట్మెయర్, ఏకంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 17 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ తరపున టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెట్మెయర్ చరిత్ర సృష్టించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తడబడ్డ ఆరంభం.. ఆదుకున్న కింగ్
Image Credit : Getty

తడబడ్డ ఆరంభం.. ఆదుకున్న కింగ్

టాస్ గెలిచిన స్కాట్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, కేవలం రెండు వారాల ముందే స్కాట్లాండ్ ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టింది. అయినప్పటికీ, ఆరంభంలో వారు విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి వెస్టిండీస్ కేవలం 33 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది.

ఓపెనర్ బ్రాండన్ కింగ్ (35) ఏడో ఓవర్లో సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌లో వేగం పెంచాడు. అయితే, స్పిన్నర్ మైఖేల్ లీస్క్ కెప్టెన్ షాయ్ హోప్‌ను (19) అవుట్ చేయగా, డెబ్యూ స్పిన్నర్ ఆలివర్ డేవిడ్సన్ కింగ్‌ను పెవిలియన్ పంపి విండీస్‌ను దెబ్బతీశారు.

Related Articles

Related image1
T20 World Cup 2026: నెదర్లాండ్స్ దెబ్బకు వణికిపోయిన పాకిస్థాన్.. పరువు పోయేదే !
Related image2
T20 World Cup 2026 : ఇండియాను కొట్టకుండా కప్పు కొట్టలేరు బాసూ !
36
హెట్మెయర్ విధ్వంసం.. గేల్ రికార్డు క్లీన్ స్వీప్
Image Credit : Getty

హెట్మెయర్ విధ్వంసం.. గేల్ రికార్డు క్లీన్ స్వీప్

ఈ దశలో క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కాటిష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే ఒక భారీ సిక్సర్‌తో హెట్మెయర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

దీంతో 2009లో ఆస్ట్రేలియాపై క్రిస్ గేల్ సాధించిన 23 బంతుల హాఫ్ సెంచరీ రికార్డు కనుమరుగైంది. గత 17 ఏళ్లుగా అజేయంగా ఉన్న గేల్ రికార్డును హెట్మెయర్ తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో బద్దలు కొట్టాడు. అతను మొత్తం 36 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇందులో 6 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

46
పావెల్, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్ మెరుపులు
Image Credit : X/ICC

పావెల్, షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్ మెరుపులు

హెట్మెయర్ ఒక్కడే కాకుండా రోవ్ మాన్ పావెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ కేవలం 37 బంతుల్లోనే 81 పరుగులు జోడించి జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. పావెల్ 24 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, విండీస్ జోరు తగ్గలేదు. చివరి ఓవర్లలో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్ 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి 23 పరుగులకే 2 వికెట్లు తీశాడు.

56
రియల్ ట్రైనర్ నా భార్య.. హెట్మెయర్
Image Credit : X/BCCI

రియల్ ట్రైనర్ నా భార్య.. హెట్మెయర్

తన అద్భుత ఇన్నింగ్స్ అనంతరం హెట్మెయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలోని ఉక్కపోతలో బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదని చెప్పాడు. తన ఫిట్‌నెస్ గురించి స్పందిస్తూ.. "నేను ఫిట్‌గా ఉండటానికి ఇంట్లో చాలా కష్టపడ్డాను. మా ఆవిడ నాకు ట్రైనర్‌గా వ్యవహరిస్తుంది. ఆమె నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ, అదనపు శ్రమ చేసేలా చేస్తుంది. ఆ కృషి ఫలితమే ఈ రోజు కనిపిస్తోంది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని హెట్మెయర్ తెలిపాడు. అలాగే డాట్ బాల్స్ తగ్గించి సింగిల్స్ తీయడంపై తాము దృష్టి సారించామని చెప్పాడు.

66
స్కాట్లాండ్ పోరాటం.. విండీస్ ఆధిపత్యం
Image Credit : Getty

స్కాట్లాండ్ పోరాటం.. విండీస్ ఆధిపత్యం

బంగ్లాదేశ్ స్థానంలో అకస్మాత్తుగా టోర్నీలోకి వచ్చినప్పటికీ, స్కాట్లాండ్ ఫీల్డింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా బ్రాండన్ మెక్‌ముల్లన్ బౌండరీ లైన్ వద్ద హెట్మెయర్ క్యాచ్ పట్టిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే, విండీస్ పవర్ హిట్టర్ల ధాటికి స్కాట్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

డే-నైట్ మ్యాచ్ కావడంతో ఫ్లడ్ లైట్ల వెలుతురులో విండీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా రాణించడంతో 18.5 ఓవర్లలో స్కాట్లాండ్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. గ్రూప్ దశలో ఈ విజయం వెస్టిండీస్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
T20 World Cup 2026: నెదర్లాండ్స్ దెబ్బకు వణికిపోయిన పాకిస్థాన్.. పరువు పోయేదే !
Recommended image2
T20 World Cup 2026 : ఇండియాను కొట్టకుండా కప్పు కొట్టలేరు బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved