MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !

IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !

Rohit Sharma : ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు రోహిత్ శర్మ బంపర్ ప్రామిస్ ఇచ్చారు. ఈసారి ఆరో ట్రోఫీ గెలిచి తీరుతామని ముంబై మిక్స్ ఈవెంట్ లో ధీమా వ్యక్తం చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 23 2026, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈసారి నంబర్ 6 మనదే.. ముంబై ఇండియన్స్ అభిమానులకు రోహిత్ శర్మ హామీ
Image Credit : Facebook/Mumbai Indians

ఈసారి నంబర్ 6 మనదే.. ముంబై ఇండియన్స్ అభిమానులకు రోహిత్ శర్మ హామీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక పంపారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు, ఈసారి ఆరో టైటిల్‌ను ముద్దాడటం ఖాయమని అభిమానులకు రోహిత్ భారీ ప్రామిస్ చేశారు. ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అట్టహాసంగా ముంబై మిక్స్ వేడుక
Image Credit : X/mipaltan

అట్టహాసంగా ముంబై మిక్స్ వేడుక

ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న తరుణంలో, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్‌లో 'MI Mix' పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య ఒక వారధిలా నిలిచింది. ఈ వేడుకలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ పాల్గొన్నారు. ఆటగాళ్లను దగ్గరగా చూసిన అభిమానుల కోలాహలంతో జియో గార్డెన్ హోరెత్తిపోయింది.

35
రోహిత్ గర్జన
Image Credit : Getty

రోహిత్ గర్జన

కార్యక్రమం ప్రారంభంలో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ స్టేజ్ మీద సందడి చేశారు. అయితే స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు మాత్రం రోహిత్ శర్మ ఎప్పుడు వస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానులు 'రోహిత్.. రోహిత్..' అంటూ హోరెత్తించారు. ఈ నినాదాల నడుమ హార్దిక్, సూర్య కలిసి రోహిత్‌ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. రోహిత్ రాకతో అభిమానుల కేరింతలు మిన్నంటాయి. ఆ సమయంలో రోహిత్ మాట్లాడుతూ.. "ప్రతి ఏటా మీరు మాకు ఇచ్చే సపోర్టు అద్భుతం. నా టీమ్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే సపోర్టును ముందు కూడా ఉండాలి. దానికి ప్రతిఫలంగా ఈసారి ఆరో ఐపీఎల్ ట్రోఫీని మీ ముందుకు తీసుకువస్తాం" అని రోహిత్ అన్నారు.

Rohit + Hardik + Surya = Maximum damage on field, maximum vibes off field. The MIX proving why MI is forever 💙🔥 #MumbaiIndians #RohitSharma #TheMIXperience #IPL2026 

pic.twitter.com/4AVwxFyObo

— Hariom kamad (@Harrykamad264) March 21, 2026

45
కుటుంబ సభ్యులతో సరదాగా..
Image Credit : Facebook/Mumbai Indians

కుటుంబ సభ్యులతో సరదాగా..

క్రికెట్ కబుర్లతో పాటు ఈ సాయంత్రం వినోదభరితంగా సాగింది. రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాతో కలిసి స్టేజ్ వెనుక హిప్-హాప్ మ్యూజిక్‌కు డాన్స్ చేస్తూ కనిపించారు. తండ్రీకూతుళ్ల ముచ్చటైన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి ఈవెంట్‌లో సందడి చేశారు. అలాగే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తన భార్య జయతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఈ ఈవెంట్‌ను మరింత హోరెత్తించాయి.

HITMAN AT "MIX". 💙

- Rohit Sharma enjoying the colourful event of Mumbai Indians. pic.twitter.com/XbgsBeS5hJ

— Johns. (@CricCrazyJohns) March 21, 2026

55
తిరిగి ఫామ్‌లోకి ముంబై
Image Credit : Getty

తిరిగి ఫామ్‌లోకి ముంబై

గత కొన్ని సీజన్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ముంబై ఇండియన్స్, 2026లో మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించాలని పట్టుదలతో ఉంది. రోహిత్ శర్మ ఇచ్చిన ఈ 'నంబర్ 6' హామీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రోహిత్ అనుభవానికి హార్దిక్ నాయకత్వం, సూర్యకుమార్ విధ్వంసం తోడైతే ముంబైని అడ్డుకోవడం ఎవరి తరము కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 'MI Mix' ఈవెంట్ క్రికెట్, వినోదం, ఎమోషన్స్ కలగలిసిన ఒక మెమరబుల్ నైట్‌గా నిలిచిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రోహిత్ శర్మ
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IPL 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్?
Recommended image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved