- Home
- Sports
- Cricket
- IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
IPL 2026 Final: ఫైనల్‌కు వాన గండం.. మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసా?
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. అయితే, వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే విజేతను ఎలా తేలుస్తారు? ఆర్‌సీబీ, జీటీ రేసులో ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? ఐపీఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

IPL 2026 Final: కౌంట్‌డౌన్ షురూ.. మే 31న మహా సంగ్రామం
క్రికెట్ లవర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆ బిగ్ డే వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. మే 31న అంటే ఆదివారం ఈ 19వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ సారి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి.
క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక గుజరాత్ టైటాన్స్ మాత్రం క్వాలిఫైయర్-2లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి ఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పుడు అందరి కళ్లు ఈ మెగా ఫైట్‌పైనే ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందనే వార్త క్రికెట్ లవర్స్ ను టెన్షన్ పెడుతోంది.
ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటి? రిజర్వ్ డే రూల్స్ ఇవే
అభిమానుల అందరిలోనూ ఇప్పుడు ఒకటే డౌట్.. ఒకవేళ మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడితే విజేతను ఎలా డిసైడ్ చేస్తారు? ఐపీఎల్ అఫీషియల్ రూల్స్ ప్రకారం దీని కోసం స్టెప్ బై స్టెప్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ మే 31న వర్షం వల్ల మ్యాచ్ అస్సలు స్టార్ట్ కాకపోయినా, లేదా మధ్యలో ఆగిపోయినా ‘రిజర్వ్ డే’ రూల్ అప్లై అవుతుంది. అంటే మరుసటి రోజు జూన్ 1న మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో, అక్కడి నుంచే మళ్లీ కంటిన్యూ చేస్తారు.
ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి టైమ్ వేస్ట్ అయితే, అంపైర్లు మ్యాచ్ ఓవర్లను కుదించే ప్రయత్నం చేస్తారు. ఫలితం తేలాలంటే రెండు ఇన్నింగ్స్‌ల్లో కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ అయినా జరగాల్సిందే. డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) పద్ధతి ద్వారా 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమైనా సరే విజేత ఎవరో తేలుస్తారు.
అసలు మ్యాచ్ జరగకపోతే.. పాయింట్స్ టేబుల్ మ్యాజిక్ ఈక్వేషన్ ఇదే
ఒకవేళ మెయిన్ డే (మే 31), రిజర్వ్ డే (జూన్ 1) రెండు రోజులు కూడా వర్షం దంచికొట్టి, మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి? కనీసం 5 ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ వేసే ఛాన్స్ కూడా లేకపోతే ట్రోఫీని ఏం చేస్తారు?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం ట్రోఫీని ఇరు జట్లకు సమానంగా షేర్ చేయరు. ఇలాంటి వరస్ట్ టైమ్ లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ పాయింట్స్ టేబుల్ రూల్ వర్తిస్తుంది. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో నంబర్-1 ప్లేస్‌లో ఉన్న టీమ్‌నే ఛాంపియన్‌గా డిక్లేర్ చేస్తారు.
నెంబర్ వన్ ప్లేస్‌లో ఆర్‌సీబీ.. కప్ విరాట్ కోహ్లీదేనా?
ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ +0.783 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయిపోతే, పాయింట్స్ టేబుల్ మ్యాజిక్ ఈక్వేషన్ ప్రకారం ఆర్‌సీబీనే విజేతగా ప్రకటిస్తారు. ఐపీఎల్ 2026 ట్రోఫీ ఆర్‌సీబీ చేతికే దక్కుతుంది. ఈ రూల్ విన్నప్పటి నుంచి ఆర్‌సీబీ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎలాగైనా ఈసారి కప్ మనదే అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
గుజరాత్‌లో వాతావరణం ఎలా ఉంది? లేటెస్ట్ వెదర్ అప్‌డేట్
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్‌లో మే 30 నుంచి జూన్ 2 వరకు ప్రీ-మాన్‌సూన్ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండే ఛాన్స్ ఉంది. మే 30 నాటికి తూర్పు రాజస్థాన్, తూర్పు గుజరాత్‌లలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. మే 31 నాటికి ఈ వర్షాల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్కైమెట్ వెదర్ ప్రకారం.. సబర్కాంత, మెహసానా, గాంధీనగర్, మహిసాగర్, ఖేడా, దాహోద్, పంచమహల్, ఆనంద్, అహ్మదాబాద్, వడోదర జిల్లాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కానీ క్రికెట్ లవర్స్ కు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. మే 31 సాయంత్రం అహ్మదాబాద్‌లో వాతావరణం క్లియర్‌గా, ప్రెజెంట్‌గా ఉంటుందని అంచనా. సాయంత్రం పూట ఆకాశంలో మేఘాలు కేవలం 28% మాత్రమే ఉంటాయని, వర్షం పడే ఛాన్స్ కేవలం 2% మాత్రమే ఉందని అంచనా వేస్తున్నారు. అంటే మ్యాచ్ సజావుగా సాగడానికి వాతావరణం ఫుల్ సపోర్ట్ ఉంటుంది.

