MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL Qualifier 2, GT vs RR : గిల్ దెబ్బకు రాజస్థాన్ విలవిల... గుజరాత్ విజయానికి ప్రధాన కారణాలివే

IPL Qualifier 2, GT vs RR : గిల్ దెబ్బకు రాజస్థాన్ విలవిల... గుజరాత్ విజయానికి ప్రధాన కారణాలివే

GT vs RR : ఐపిఎల్ క్వాలిఫయర్-2 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్బుత విజయం సాధించింది… ఫైనల్ కు చేరింది. మరి జిటి గెలుపు వెనకున్న ప్రధాన కారణాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 29 2026, 11:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపిఎల్ 2026 ఫైనల్ కు గుజరాత్..
Image Credit : ANI

ఐపిఎల్ 2026 ఫైనల్ కు గుజరాత్..

RR vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో మరో ఉత్కంఠ పోరుకు న్యూ చండీగఢ్ స్టేడియం సాక్ష్యంగా నిలిచింది. అయితే ఈ కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచేసి గుజరాత్ టైటాన్ ఐపిఎల్ ఫైనల్ కి చేరింది. ఈ క్వాలిఫయర్-2 లో ఏకంగా 400+ పరుగులు నమోదయ్యాయి... ఇరుజట్లు 200 కి పైగా పరుగులు చేశారు. మొదట బ్యాటింగ్ చేసి గుజరాత్ 216 పరుగులు చేసింది... ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ మరో 9 బంతులు మిగిలుండగానే చేధించింది. 

అయితే గుజరాత్ అద్భుత విజయం వెనక అనేక కారణాలున్నాయి. గిల్ సూపర్ బ్యాటింగ్ నుండి హోల్డర్ బౌలింగ్ వరకు… గుజరాత్ టైటాన్స్ గెలుపు వెనకున్న ముఖ్యమైన రీజన్స్  గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ..
Image Credit : X

శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ..

215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ అలవోకగా చేధించిందంటే అందుకు ప్రధాన కారణం శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ. అతడు నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.. కేవలం 53 బంతుల్లో 104 పరుగులు (15 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. తీవ్ర ఒత్తిడిలోనూ గిల్ చేసిన సెంచరీ రాజస్థాన్ ఓటమిని శాసించింది... గుజరాత్ విజయానికి బాటలు వేసింది.

35
ఓపెనింగ్ జోడీ రికార్డు భాగస్వామ్యం
Image Credit : ANI

ఓపెనింగ్ జోడీ రికార్డు భాగస్వామ్యం

ఈ ఐపిఎల్ సీజన్లో సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ జోడీ తామేనని శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ మరోసారి నిరూపించుకున్నారు. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలకమైన క్వాలిఫయర్-2 లో అద్భుతంగా ఆడారు... కేవలం 77 బంతుల్లో 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం మ్యాచ్ మధ్యలోనే గుజరాత్ విజయాన్ని ఖాయం చేసింది.

45
సాయి సుదర్శన్ సూపర్ హాఫ్ సెంచరీ..
Image Credit : X

సాయి సుదర్శన్ సూపర్ హాఫ్ సెంచరీ..

కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు సాయి సుదర్శన చక్కటి సహకారం అందించాడు. ఓవైపు కెప్టెన్ దూకుడుగా ఆడుతుంటే చక్కటి సహకారం అందించాడు.. చాపకింద నీరులా సుదర్శన్ పరుగులు సాధించాడు. అతడు వేగంగా పరుగులు సాధించలేకపోవచ్చు... కానీ సమయోచితంగా ఆడాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 58 పరుగులు, 8 ఫోర్లు, 1 సిక్సర్) గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించింది.

55
హోల్డర్, రబాడ అద్భుతమైన బౌలింగ్
Image Credit : Getty

హోల్డర్, రబాడ అద్భుతమైన బౌలింగ్

కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ గుజరాత్ అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా కగిసో రబాడ 4 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో కీలకమైన వైభవ్ సూర్యవంశీ వికెట్ ఉంది. అలాగే ప్రమాదకమైన ద్రువ్ జురేల్ ను కట్టడి చేయడంలో రబాడా సక్సెస్ అయ్యాడు.

ఇక జేసన్ హోల్డర్ కూడా తక్కువ పరుగులిచ్చి కీలక వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కెప్టెన్ రియాగ్ పరాగ్, దసున్ శనక వికెట్లు తీశాడు. ఇలా రాజస్థాన్ ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
శుభ్‌మన్ గిల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
IPL 2026: పాకిస్థాన్‌లోనూ వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. మాములుగా లేదు మనోడి రచ్చ !
Recommended image2
Vaibhav Sooryavanshi :100 మిస్సైతేనేంరా బుడ్డోడా, 1000 కొట్టేశావుగా : శతకం కాదు వైభవ శకమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved