MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • RCB అమ్మకానికి డేట్ ఫిక్స్.. కోహ్లీ టీమ్ కొత్త ఓనర్ ఎవరు?

RCB అమ్మకానికి డేట్ ఫిక్స్.. కోహ్లీ టీమ్ కొత్త ఓనర్ ఎవరు?

RCB : ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీ యాజమాన్య మార్పు తుది దశకు చేరింది. సుమారు 2 బిలియన్ డాలర్ల భారీ ధరకు విక్రయం జరగనుండగా, ఇద్దరు కొనుగోలు రేసులో నిలిచారు. ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 18 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆర్సీబీ : డిఫెండింగ్ ఛాంపియన్ల కొత్త ప్రయాణం
Image Credit : Getty

ఆర్సీబీ : డిఫెండింగ్ ఛాంపియన్ల కొత్త ప్రయాణం

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL)లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ, ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. అయితే మైదానంలో ఆట కంటే ముందే, బోర్డు రూముల్లో భారీ వ్యాపార ఒప్పందం తుది దశకు చేరుకుంది. ప్రస్తుత యజమాని డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్) ఈ ఫ్రాంచైజీని విక్రయించేందుకు సిద్ధమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆర్సీబీ అభిమానులకు షాక్
Image Credit : our own

ఆర్సీబీ అభిమానులకు షాక్

డయాజియో సంస్థ ఈ విక్రయ ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే సమయంలోనే ఈ భారీ డీల్ చర్చలు వేగం పుంజుకోవడం విశేషం.

Related Articles

Related image1
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
Related image2
CSK ధోనీ మాస్టర్ ప్లాన్: ఐపీఎల్ 2026లో సీఎస్కే తో ప్రత్యర్థులకు వణుకే !
36
రూ. 16,000 కోట్లకు అమ్ముడుపోతున్న బెంగళూరు టీమ్!
Image Credit : RCB\Instagram

రూ. 16,000 కోట్లకు అమ్ముడుపోతున్న బెంగళూరు టీమ్!

ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 16,600 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. 2021లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును రూ. 7,000 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఆర్సీబీ ధర అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఐపీఎల్ బ్రాండ్ విలువను చాటిచెబుతోంది. అయితే, భవిష్యత్తులో మీడియా హక్కుల ధరలపై ఉన్న అనిశ్చితి వల్ల కొంతమంది బిడ్డర్లు వెనకడుగు వేస్తున్నా, ఆర్సీబీకున్న ఫ్యాన్ బేస్ వల్ల భారీ ధర ఖాయమని తెలుస్తోంది.

ఆర్సీబీ కోనుగోలు రేసులో ఇద్దరు ప్రధాన బిడ్డర్లు

ప్రస్తుతం ఆర్సీబీని దక్కించుకోవడానికి ఇద్దరు ప్రధాన పోటీదారులు మిగిలారు.

1. రంజన్ పాయ్ కన్సార్టియం: మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ టెమాసెక్ తో కలిసి బిడ్ దాఖలు చేశారు.

2. ఈక్యూటీ (EQT): స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఒంటరిగా లేదా స్థానిక భారతీయ సంస్థతో కలిసి జట్టును కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది.

46
ఆర్సీబీ : తప్పుకున్న దిగ్గజాలు.. గ్లేజర్ ఫ్యామిలీ, పూనావాలా
Image Credit : RCB\Instagram

ఆర్సీబీ : తప్పుకున్న దిగ్గజాలు.. గ్లేజర్ ఫ్యామిలీ, పూనావాలా

ఈ కొనుగోలు రేసులో ప్రారంభంలో కనీసం ఐదు పార్టీలు ఆసక్తి చూపాయి. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ యజమానులైన గ్లేజర్ ఫ్యామిలీ, అదర్ పూనావాలా గ్రూప్ కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం వీరు ఈ రేసు నుండి తప్పుకున్నారు. 2 బిలియన్ డాలర్ల భారీ విలువను చెల్లించే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

56
బీసీసీఐ నిబంధనలు ఏమిటి?
Image Credit : Getty

బీసీసీఐ నిబంధనలు ఏమిటి?

ఒకసారి బిడ్డర్ ఖరారు అయిన తర్వాత, యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తి కావడానికి 45 నుండి 90 రోజులు పడుతుంది. ఈ డీల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. కాబట్టి, ప్రస్తుత మార్చి గడువు లోపు ఒప్పందం కుదిరినా, అధికారికంగా కొత్త యజమానులు సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026 నాటికి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

66
రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి?
Image Credit : RCB\Instagram

రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి?

కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికా ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ ఈ రేసులో ముందున్నారు. రాజస్థాన్ రాయల్స్ విలువ 1.1 బిలియన్ నుండి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఆదిత్య మిట్టల్ కుటుంబం కూడా ఈ జట్టుపై కన్నేసినట్లు సమాచారం.

వ్యాపార సామ్రాజ్యంగా ఐపీఎల్

ఐపీఎల్ జట్లు ఇప్పుడు కేవలం క్రికెట్ జట్లు మాత్రమే కాదు, అవి గ్లోబల్ స్పోర్ట్స్ బిజినెస్ అసెట్స్‌గా మారాయి. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ వ్యూయర్ షిప్ ద్వారా ఇవి బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాకముందే బోర్డు రూముల్లో జరుగుతున్న ఈ బిలియన్ డాలర్ల బేరసారాలు లీగ్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IPL 2026 : ఐపీఎల్ జట్లకు దడపుట్టిస్తున్న కేకేఆర్ మాస్టర్ ప్లాన్ !
Recommended image2
CSK ధోనీ మాస్టర్ ప్లాన్: ఐపీఎల్ 2026లో సీఎస్కే తో ప్రత్యర్థులకు వణుకే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved