MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆ ఒక్కడి కోసం ఇద్దరిని తప్పించారా.? టీ20 ప్రపంచకప్ జట్టుపై అనుమానాలు.. వెనుక ఉన్నది ఆమెనా.!

ఆ ఒక్కడి కోసం ఇద్దరిని తప్పించారా.? టీ20 ప్రపంచకప్ జట్టుపై అనుమానాలు.. వెనుక ఉన్నది ఆమెనా.!

T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై చర్చ కొనసాగుతోంది. రింకూ సింగ్ కోసం శుభమాన్ గిల్, జితేష్ శర్మలను తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, రింకూ కాబోయే సతీమణి ప్రమేయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  

2 Min read
Author : Pavithra D
Published : Dec 30 2025, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ20 ప్రపంచకప్ జట్టుపై చర్చ..
Image Credit : Twitter

టీ20 ప్రపంచకప్ జట్టుపై చర్చ..

టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపిక ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెలెక్టర్లు ప్రకటించిన జట్టుపై విస్తృతంగా వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, రింకూ సింగ్ ఎంపిక వెనుక శుభమాన్ గిల్, జితేష్ శర్మలపై వేటు పడిందనే బలమైన వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న చర్చ కూడా సాగుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రింకూ కోసం ఆ ఇద్దరు..
Image Credit : Twitter

రింకూ కోసం ఆ ఇద్దరు..

రింకూ సింగ్ అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతను ఇప్పటికే ఫినిషర్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రింకూ సింగ్ జట్టులో లేకపోవడం, ఆ తర్వాత సడెన్‌గా ప్రపంచకప్ జట్టులోకి రావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రింకూ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉంటే, సౌత్ ఆఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదనేది అభిమానుల ప్రధాన సందేహం.

Related Articles

Related image1
Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
Related image2
Team India : గంభీర్ పదవికి ఎసరు? రేసులోకి తెలుగు స్టార్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ !
35
గిల్‌ను తప్పించారు..
Image Credit : Twitter

గిల్‌ను తప్పించారు..

గిల్ కొంతకాలంగా ఫామ్‌లో లేకపోవడంతో అతన్ని తప్పించడం సరైన నిర్ణయమే. కానీ, జితేష్ శర్మ చేసిన తప్పేంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఫినిషర్‌గా రింకూ సింగ్‌కు అవకాశం కల్పించడానికే జితేష్ శర్మను అన్యాయంగా తొలగించారని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్‌ను కూడా రింకూ కోసమే పక్కన పెట్టారని అంటున్నారు. సెలెక్టర్లు జట్టు కాంబినేషన్ కోసమే ఈ మార్పులు చేశామని చెబుతున్నప్పటికీ, అభిమానులు మాత్రం వారి వివరణ కరెక్ట్ కాదని అంటున్నారు.

45
రాజకీయ ఒత్తిళ్ళ వల్లే..
Image Credit : Twitter

రాజకీయ ఒత్తిళ్ళ వల్లే..

ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించినప్పటికీ, చాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యశస్వి జైస్వాల్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే వాదన కూడా ఉంది. దీనితో పాటు, రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక అతని కాబోయే సతీమణి ప్రమేయం కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. రింకూ సింగ్ కాబోయే సతీమణి పేరు ప్రియా సరోజ్. ఈమె సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్ల మీద ప్రియా సరోజ్ ఒత్తిడి పెంచారనే చర్చ జరుగుతోంది.

55
అతడి కోసం బ్యాకప్ వికెట్ కీపర్..
Image Credit : Twitter

అతడి కోసం బ్యాకప్ వికెట్ కీపర్..

అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఫినిషర్‌గా రింకూ కోసం జితేష్‌ను పక్కన పెట్టారని, అదే సమయంలో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇషాన్‌ను తీసుకోవాల్సి వచ్చిందని, దీంతో శుభమాన్ గిల్ పైన వేటు తప్పలేదని అంటున్నారు. అయితే, ఈ సోషల్ మీడియా చర్చలు ఎలా ఉన్నా, రింకు సింగ్ ఒక గొప్ప ఆటగాడు అని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ప్రస్తుతం అతను విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల రేసులోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 35 మ్యాచ్‌ల్లో 550 పరుగులు సాధించాడు. అతని యావరేజ్ 42.30 కాగా, స్ట్రైక్ రేట్ 161.76.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli: రిటైర్మెంట్ పై కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image2
‎Catch of IPL 2026: మనీష్ పాండే సూపర్ మ్యాన్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో!
Recommended image3
RCB vs KKR: కోహ్లీ విశ్వరూపం.. 10వ సెంచరీతో కేకేఆర్ పని ఫినిష్! పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ నెంబర్ వన్!
Related Stories
Recommended image1
Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
Recommended image2
Team India : గంభీర్ పదవికి ఎసరు? రేసులోకి తెలుగు స్టార్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved