MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup : టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ షేక్.. స్టార్ ప్లేయర్ల కెరీర్ ఖతం

T20 World Cup : టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ షేక్.. స్టార్ ప్లేయర్ల కెరీర్ ఖతం

Pakistan Cricket : టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో ఘోర పరాజయం తర్వాత పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నమీబియాతో జరిగే కీలక మ్యాచ్‌లో బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదిలను తప్పించనుంది. మొత్తంగా భారత్ దెబ్బకు పాక్ షేక్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 16 2026, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు: నమీబియాతో మ్యాచ్‌కు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది దూరం
Image Credit : Getty

పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు: నమీబియాతో మ్యాచ్‌కు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది దూరం

టీమిండియా దెబ్బతో పాకిస్థాన్ లో క్రికెట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టులో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. బుధవారం నమీబియాతో జరగనున్న నిర్ణయాత్మక పోరులో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిలను తుది జట్టు నుంచి తప్పించాలని పాక్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ఇది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

26
భారత్‌తో ఓటమి సెగ: పాక్ క్రికెట్ మేనేజ్‌మెంట్ ఆగ్రహం
Image Credit : Getty

భారత్‌తో ఓటమి సెగ: పాక్ క్రికెట్ మేనేజ్‌మెంట్ ఆగ్రహం

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజం కేవలం 5 పరుగులకే వెనుదిరగగా, షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాక్ ఓటమి ఖాయమని తెలియగానే ఆయన స్టేడియం నుంచి మధ్యలోనే నిష్క్రమించినట్లు సమాచారం. కీలక మ్యాచ్‌ల్లో ఇటువంటి ప్రదర్శనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన జట్టు మేనేజర్‌కు స్పష్టం చేశారు.

Related Articles

Related image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Related image2
Rohit Sharma : రోహిత్‌తో దోస్తీ.. వసీం అక్రమ్‌పై దాడి.. అసలు కథ ఇదే
36
మధ్యరాత్రి నిర్ణయం.. పాక్ సీనియర్లపై వేటు
Image Credit : ANI

మధ్యరాత్రి నిర్ణయం.. పాక్ సీనియర్లపై వేటు

నమీబియాతో మ్యాచ్ పాకిస్థాన్‌కు చావోరేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్ టోర్నీ నుంచి అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే మేనేజ్‌మెంట్ సోమవారం అర్థరాత్రి సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదిలను బెంచ్‌కు పరిమితం చేసి, వారి స్థానంలో యువ ఆటగాళ్లు సల్మాన్ మీర్జా లేదా నశీమ్ షా, ఫఖర్ జమాన్‌లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ మార్పులు సత్ఫలితాలనిస్తే, బాబర్, షాహీన్‌ల వరల్డ్ కప్ ప్రయాణం ఇక్కడితో ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

46
షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు
Image Credit : X@ICC

షాహిద్ అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు

భారత్‌తో ఓటమి తర్వాత పాక్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఆటగాళ్లపై నిప్పులు చెరిగారు. "నా చేతుల్లో నిర్ణయం ఉంటే బాబర్, షాహీన్, షాదాబ్‌లను వెంటనే జట్టు నుంచి తప్పిస్తాను. వారిని బెంచ్‌కే పరిమితం చేసి కొత్త యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి. ఏళ్ల తరబడి వీరు ఆడుతున్నా కనీసం పోరాట పటిమ చూపడం లేదు. భారత్ చేతిలో ఇలా ఏకపక్షంగా ఓడిపోవడం సిగ్గుచేటు" అని అఫ్రిది విమర్శించారు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నిర్ణయాలను కూడా ఆయన తప్పుబట్టారు. స్వయంగా కెప్టెనే బాధ్యతారాహిత్యంగా వికెట్ పారేసుకోవడం జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

56
గణాంకాల్లో వైఫల్యం.. ఆందోళనలో అభిమానులు
Image Credit : Getty

గణాంకాల్లో వైఫల్యం.. ఆందోళనలో అభిమానులు

ప్రస్తుత టోర్నీలో బాబర్ ఆజం మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా 115.78 వద్ద ఉంది. మరోవైపు షాహీన్ అఫ్రిది మూడు మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లోనూ గ్రూప్ దశలోనే అవుట్ అయిన పాక్, ఇప్పుడు 2026లోనూ అదే పరిస్థితి ఎదుర్కోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. నమీబియాపై గెలిస్తేనే సూపర్-8 ఆశలు సజీవంగా ఉంటాయి, లేదంటే అమెరికా కంటే తక్కువ నెట్ రన్ రేట్ ఉండటం వల్ల పాక్ ఇంటిముఖం పట్టాల్సి వస్తుంది.

66
యువ రక్తం వైపు పాకిస్థాన్ మొగ్గు
Image Credit : Getty

యువ రక్తం వైపు పాకిస్థాన్ మొగ్గు

సీనియర్ల వైఫల్యంతో విసిగిపోయిన కోచ్ మైక్ హెసన్, మేనేజ్‌మెంట్ ఇప్పుడు యువ ఆటగాడు ఖవాజా నఫీని మిడిల్ ఆర్డర్‌లో పరీక్షించాలని చూస్తున్నారు. జట్టులో సమూల మార్పులు చేయడం ద్వారా నమీబియాపై భారీ విజయం సాధించి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాలని పాక్ లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా తక్కువ ర్యాంకు జట్లైన అమెరికా, నెదర్లాండ్స్‌పై గెలిచినప్పటికీ, భారత్‌తో జరిగిన ఓటమి పాకిస్థాన్ అసలు బలహీనతలను బయటపెట్టింది. ఇప్పుడు సీనియర్లను తప్పించి జట్టును గాడిలో పెట్టాలనే సాహసోపేత నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Rohit Sharma : రోహిత్‌తో దోస్తీ.. వసీం అక్రమ్‌పై దాడి.. అసలు కథ ఇదే
Recommended image2
ఓడిన పాక్‌కు మరో గట్టి దెబ్బ.. ఒకే జట్టుపై ఇంత చెత్త రికార్డా.?
Recommended image3
7 మ్యాచ్‌లలో 4 డకౌట్‌లు.. కోహ్లీ చెత్త రికార్డు దాటేసిన అభిషేక్.. అదేంటంటే
Related Stories
Recommended image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Recommended image2
Rohit Sharma : రోహిత్‌తో దోస్తీ.. వసీం అక్రమ్‌పై దాడి.. అసలు కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved