MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే

IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే

IND vs PAK : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ విధ్వంసం, బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్ లో విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2026, 11:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కొలంబోలో పాక్ పనిపట్టిన భారత్.. సూపర్ విక్టరీ
Image Credit : Getty

కొలంబోలో పాక్ పనిపట్టిన భారత్.. సూపర్ విక్టరీ

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ జట్టు కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ గ్రూప్ ఏ లో 6 పాయింట్లు సాధించి సూపర్ 8 కు అర్హత సాధించింది. పాక్ పై అద్భుత విజయం వెనుక ఐదు కీలక కారణాలు ఉన్నాయి. వాటిని గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆరంభం
Image Credit : X/BCCI

ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆరంభం

భారత్ గెలుపులో అత్యంత కీలక పాత్ర ఇషాన్ కిషన్‌దే. తొలి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ అవుటైనా, ఇషాన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను దెబ్బతీశాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అతను చేసిన మెరుపు దాడి వల్ల భారత్ 9 ఓవర్లలోనే బలమైన స్థితికి చేరుకుంది. ఇషాన్ కిషన్ సృష్టించిన ఈ వేగమే భారత్ 175 పరుగుల భారీ స్కోరు సాధించడానికి పునాది వేసింది.

37
బుమ్రా పదునైన ఆరంభం.. పాక్ వెన్ను విరిచింది
Image Credit : Getty

బుమ్రా పదునైన ఆరంభం.. పాక్ వెన్ను విరిచింది

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను జస్ప్రీత్ బుమ్రా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రెండో ఓవర్‌లోనే వికెట్లు తీసి పాక్ టాప్ ఆర్డర్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా స్పెల్ వల్ల బాబర్ ఆజం వంటి కీలక ఆటగాళ్లు పరుగులు చేయడానికి తడబడ్డారు. బుమ్రా 2 వికెట్లు తీయడమే కాకుండా, అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి పాక్ రన్ రేట్‌ను కట్టడి చేశాడు.

47
తిలక్ వర్మ సమయోచిత పోరాటం
Image Credit : X@BCCI

తిలక్ వర్మ సమయోచిత పోరాటం

రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్‌తో కలిసి తిలక్ వర్మ నెలకొల్పిన 87 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ మలుపు తిప్పింది. ఒకవైపు ఇషాన్ ధాటిగా ఆడుతుంటే, తిలక్ వర్మ (25) మరోవైపు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీసి జట్టు విజయంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. తన బౌలింగ్ లో ఎక్కువ పరుగులు కూడా ఇవ్వకుండా పొదుపుగా వేశాడు.

57
మిడిల్ ఓవర్లలో మెరిసిన బౌలర్లు
Image Credit : X@BCCI

మిడిల్ ఓవర్లలో మెరిసిన బౌలర్లు

భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పేసర్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్లలో పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. హార్దిక్, అక్షర్, వరుణ్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లు ఉస్మాన్ ఖాన్ (44), షాహీన్ అఫ్రిదీ మినహా ఎవరూ రెండంకెల స్కోరు దాటలేకపోయారంటే మన బౌలర్ల ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

67
ఒత్తిడిని అధిగమించిన సూర్యకుమార్ కెప్టెన్సీ
Image Credit : X@BCCI

ఒత్తిడిని అధిగమించిన సూర్యకుమార్ కెప్టెన్సీ

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫీల్డ్ ప్లేస్‌మెంట్, బౌలింగ్ మార్పులతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బ్యాటింగ్‌లోనూ 32 పరుగులతో కీలక సహకారం అందించాడు. పాక్ ప్రధాని, పీసీబీ సృష్టించిన రాజకీయ డ్రామాల మధ్య, మైదానంలో ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించడం భారత్ విజయానికి మరో ప్రధాన కారణం.

77
భారత్ విజయానికి ఐదు కారణాలు
Image Credit : Getty

భారత్ విజయానికి ఐదు కారణాలు

  1. పవర్‌ప్లేలో ఇషాన్ కిషన్ బాదుడు: 40 బంతుల్లో 77 పరుగులు చేసి పాక్‌ను ఆత్మరక్షణలో పడేశాడు.
  2. బుమ్రా ఇనిషియల్ బ్రేక్ త్రూ: రెండో ఓవర్‌లోనే వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు.
  3. మెరుగైన భాగస్వామ్యాలు: రెండో వికెట్‌కు ఇషాన్-తిలక్ జోడించిన 87 పరుగులు కీలకం.
  4. బౌలింగ్: నలుగురు బౌలర్లు (హార్దిక్, బుమ్రా, అక్షర్, వరుణ్) తలో రెండు వికెట్లు తీయడం.
  5. పాక్ స్టార్ల వైఫల్యం: బాబర్ ఆజం (5), సామ్ అయూబ్ (6)లను తక్కువకే అవుట్ చేయడం. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన పాకిస్తాన్ మళ్లీ కోలుకోలేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
India vs Pakistan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లెజెండరీల 5 రికార్డులు బ్రేక్
Recommended image2
IND vs PAK : భారత్ దెబ్బకు చిత్తుగా ఓడిన పాకిస్థాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved