వన్డే అరంగేట్రంతో చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy : ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అలాగే, కొత్త చరిత్ర సృష్టించాడు. 1932 తర్వాత అరుదైన ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెర్త్ లో నితీశ్ కుమార్ రెడ్డి చారిత్రాత్మక అరంగేట్రం
తెలుగు ప్లేయర్, భారత యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన వన్డే కెరీర్‌ను పెర్త్ లో ప్రారంభించి చరిత్ర సృష్టించాడు. హార్దిక్ పాండ్యా గాయంతో అతని స్థానంలో భారత జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్, ఆదివారం (అక్టోబర్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో తన తొలి వన్డే మ్యాచ్ ను ఆడుతున్నాడు.
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆయనకు వన్డే క్యాప్ అందజేశారు. ఈ అరంగేట్రంతో నితీశ్ ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 1932లో భారత్ అంతర్జాతీయ క్రికెట్‌కి ప్రవేశించినప్పటి నుండి ఆసీస్ లో ఈ మైలురాయిని సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రలో నిలిచాడు. ఇప్పటివరకు ఆయన 9 టెస్ట్‌లు, 4 టీ20లు ఆడాడు.
A day he will never forget! ✨
It's a special moment for debutant Nitish Kumar Reddy, who receives his ODI cap from Rohit Sharma 🧢 🇮🇳
Updates ▶ https://t.co/O1RsjJTHhM#TeamIndia | #AUSvIND | @NKReddy07pic.twitter.com/ZpJUaiQqC5— BCCI (@BCCI) October 19, 2025
పెర్త్ లో రెండోసారి అరంగేట్రం చేసిన అరుదైన ఘనత నితీశ్ సొంతం
నితీశ్ కుమార్ రెడ్డి 2024–25 బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తన టెస్ట్ అరంగేట్రాన్ని కూడా పెర్త్ లోనే చేశాడు. ఆ సిరీస్‌లో భారత్ ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒకదానిలో మాత్రమే గెలిచింది. అదే నితీశ్ డెబ్యూ చేసిన మ్యాచ్. దాదాపు సంవత్సరం తర్వాత ఆయన మళ్లీ అదే వేదికపై తన వన్డే కెరీర్‌ను ప్రారంభించారు.
ఇంతకు ముందు పెర్త్ లో వన్డే అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లలో బరిందర్ స్రాన్, సుబ్రతో బెనర్జీ ఉన్నారు. టెస్ట్‌ల్లో మాత్రం ఆర్.వినయ్ కుమార్, హర్షిత్ రాణా, ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ వేదికపై తొలి టెస్ట్‌లు ఆడిన ప్లేయర్ గా నిలిచారు.
హార్దిక్ స్థానంలో నితీశ్‌కు అవకాశం
హార్దిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్ నుండి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి భారత జట్టులో స్థానం దక్కింది. ఆయనను ఎంపిక చేసిన వెంటనే, ఈ సిరీస్‌లో డెబ్యూ చేసే అవకాశం లభించనుందనే ఊహాగానాలు నిజమయ్యాయి.
భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో నితీశ్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గిల్ టాస్ సమయంలో మాట్లాడుతూ, “మేము కూడా టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునే వాళ్లమే. వాతావరణం దృష్ట్యా ఆట మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కానీ పిచ్ బాగుంది. స్కోర్‌బోర్డ్‌పై మంచి పరుగులు పెట్టాలనే లక్ష్యంతో ఆడతాం” అని చెప్పారు.
రోహిత్, కోహ్లీ తిరిగి వచ్చారు
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. వీరిద్దరూ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు.
2024 ప్రపంచకప్ విజయం తర్వాత ఇద్దరూ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 2025 మేలో టెస్ట్‌లను కూడా వీడారు. ఈ సిరీస్‌కు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుండి తప్పించారు. ఆయన ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో ఆడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ కొత్త వైస్-కెప్టెన్‌గా నియమితులయ్యారు.
ఆస్ట్రేలియా జట్టులో కొత్త ముఖాలు
మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టులో కూడా ఇద్దరు కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ దక్కింది. రెడ్ బాల్ స్పెషలిస్ట్ మ్యాట్ రెన్షా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తమ వన్డే కెరీర్‌ను పెర్త్ మ్యాచ్ తో ప్రారంభించారు.
ఓవెన్ గతంలో టీ20ల్లో 161 పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయంతో దూరం కావడంతో ఆయన స్థానంలో ఆడుతున్నారు. రెన్షాకు ఈ సిరీస్ కీలకం. మంచి ప్రదర్శనతో ఆయన యాషెస్ టెస్ట్ జట్టులో తిరిగి చేరే అవకాశాలు మెరుగుపడవచ్చు.
పెర్త్ లో వేదికగా ప్రారంభమైన భారత్ - ఆసీస్ సిరీస్
మిచెల్ మార్ష్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది భారత్‌కు వరుసగా 16వ టాస్ ఓటమి. చివరిసారిగా భారత జట్టు 2023 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో టాస్ గెలిచింది. భారత జట్టు ప్లేయింగ్ XIలో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో లేరు.
భారత్ (Playing XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
ఆస్ట్రేలియా (Playing XI): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్‌కీపర్), మ్యాట్ రెన్షా, కూపర్ కాన్నెల్లీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ హేజిల్‌వుడ్