MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !

Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !

Tilak Varma : ఐపీఎల్ 2026లో తిలక్ వర్మ మెరుపు సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను తిలక్ చిత్తు చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 20 2026, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
45 బంతులు.. 101 పరుగులు.. తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే పూనకాలే!
Image Credit : X/IPL

45 బంతులు.. 101 పరుగులు.. తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే పూనకాలే!

ఐపీఎల్ 2026లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు చేసి, తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. మొదట నిదానంగా ఆడినా, చివర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో ఫోర్‌తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మ్యాచ్ ప్రారంభంలో తిలక్ వర్మ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒకానొక సమయంలో అతను 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, క్రీజులో కుదురుకున్నాక ఒక్కసారిగా గేర్ మార్చిన తిలక్ వర్మ, గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తర్వాతి కేవలం 23 బంతుల్లోనే అతను ఏకంగా 82 పరుగులు పిండుకోవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నమన్ ధీర్‌తో కీలక భాగస్వామ్యం
Image Credit : X/IPL

నమన్ ధీర్‌తో కీలక భాగస్వామ్యం

ముంబై ఇండియన్స్ పవర్‌ప్లేలో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నమన్ ధీర్‌తో (45 పరుగులు) కలిసి 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, తిలక్ మాత్రం తన ఏకాగ్రత కోల్పోకుండా భారీ షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

Related Articles

Related image1
Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం
Related image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
35
డెత్ ఓవర్లలో విధ్వంసం రేపిన తిలక్ వర్మ
Image Credit : X/IPL

డెత్ ఓవర్లలో విధ్వంసం రేపిన తిలక్ వర్మ

ముఖ్యంగా డెత్ ఓవర్లలో తిలక్ వర్మ ఆడిన తీరు అద్భుతం. ఈ ఐదు ఓవర్లలోనే అతను 65 పరుగులు రాబట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 15వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి 19 పరుగులు పిండుకున్నాడు. అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 6, 6 బాది మొత్తం 26 పరుగులు సాధించి మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు.

45
ముంబై ఇండియన్స్ రికార్డు సమం
Image Credit : X/IPL

ముంబై ఇండియన్స్ రికార్డు సమం

ఈ సెంచరీతో తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాళ్లలో సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. ఇద్దరూ కేవలం 45 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించారు. అలాగే నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి ఐపీఎల్‌లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు.

55
సెంచరీ వేళ ఎమోషనల్ సెలబ్రేషన్స్
Image Credit : X/IPL

సెంచరీ వేళ ఎమోషనల్ సెలబ్రేషన్స్

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన అజేయ సెంచరీని (101*) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తవగానే తన హెల్మెట్ తీసి పక్కన పెట్టి, ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి ఎమోషనల్ అయ్యాడు. డగౌట్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా తన సీటు నుంచి లేచి గంతులు వేస్తూ తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను అభినందించాడు. తిలక్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేయగలిగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved