MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్

Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్

Team India Cricket Schedule: ఐపీఎల్ 2026 ముగిశాక టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ను మొదలుపెట్టింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్, 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. భారత జట్టు బిజీ షెడ్యూల్ పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
WTC ఫైనల్ నుంచి వన్డే వరల్డ్ కప్ దాకా.. మనోళ్లు ఆడే మ్యాచ్‌ల లిస్ట్ ఇదే..
Image Credit : Getty

WTC ఫైనల్ నుంచి వన్డే వరల్డ్ కప్ దాకా.. మనోళ్లు ఆడే మ్యాచ్‌ల లిస్ట్ ఇదే..

ఐపీఎల్ 2026 ధనాధన్ హంగామా ముగిసింది. ఇప్పుడు టీమిండియా స్టార్స్ మళ్లీ ఇంటర్నేషనల్ ఫైట్‌కు రెడీ అయిపోయారు. ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన జోష్‌లో అభిమానులు ఉండగానే, టీమిండియా నెక్స్ట్ మిషన్స్ రెడీ అయింది. 

2026 జూన్ నుంచి 2027 అక్టోబర్ వరకు.. అంటే దాదాపు 18 నెలల పాటు భారత ప్లేయర్లకు అస్సలు రెస్ట్ దొరికేలా లేదు. ఒకవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంకోవైపు 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టడమే సింగిల్ ఎజెండాగా టీమిండియా రోడ్ మ్యాప్ సెట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అఫ్ఘాన్ సవాల్‌తో హోమ్ సీజన్ స్టార్ట్.. ఇంగ్లాండ్, లంక టూర్స్
Image Credit : Getty

అఫ్ఘాన్ సవాల్‌తో హోమ్ సీజన్ స్టార్ట్.. ఇంగ్లాండ్, లంక టూర్స్

ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం వారం రోజుల్లోనే టీమిండియా ప్లేయర్లు గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు సొంతగడ్డపై అఫ్ఘానిస్తాన్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్‌తో ఈ వేట మొదలవుతుంది. ఇది అవ్వగానే జూన్ లాస్ట్ వీక్‌లో ఐర్లాండ్‌ తో మూడు టీ20లు ఆడతారు. ఇక అసలైన కిక్ ఇచ్చే జులై నెలలో (జులై 1 నుంచి 19 వరకు) ఇంగ్లాండ్ పర్యటన ఉంది. అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలతో ఇంగ్లండ్‌తో బిగ్ ఫైట్ కు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకకు వెళ్లి రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది.

36
సెప్టెంబర్‌లో ఫుల్ బిజీ.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ టార్గెట్
Image Credit : Getty

సెప్టెంబర్‌లో ఫుల్ బిజీ.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ టార్గెట్

సెప్టెంబర్ నెల అయితే క్రికెట్ అవర్స్ కు పూనకాలే. సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు బంగ్లాదేశ్ టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడతారు. ఆ వెంటనే యూఏఈ లో అఫ్ఘానిస్తాన్‌తో మరో మూడు టీ20ల సిరీస్ ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఏషియన్ గేమ్స్‌లో మన భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగుతోంది. ఇక్కడ యువ ఆటగాళ్లు రంగంలోకి దిగే అవకాశముంది.

46
విండీస్, కివీస్ జట్లతో ఫైట్.. ఆపై జింబాబ్వే టూర్
Image Credit : Getty

విండీస్, కివీస్ జట్లతో ఫైట్.. ఆపై జింబాబ్వే టూర్

అక్టోబర్ రాగానే వెస్టిండీస్ టీమ్ భారత్‌కు వస్తుంది. మన హోమ్ గ్రౌండ్స్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. కివీస్ కండిషన్స్‌లో ఆడటం ఎప్పుడూ కష్టమే కాబట్టి అక్కడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల సుదీర్ఘ సిరీస్ మన బెంచ్ స్ట్రెంగ్త్‌కు అసలైన పరీక్ష. ఇక డిసెంబర్-జనవరి టైమ్‌లో లంక జట్టు భారత్‌కు రానుంది. ఆ తర్వాత జనవరి 3 నుంచి 7 వరకు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది.

56
బాప్ ఆఫ్ ఆల్ సిరీస్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
Image Credit : Getty

బాప్ ఆఫ్ ఆల్ సిరీస్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూసే సునామీ సిరీస్ వచ్చేస్తోంది. జనవరి-ఫిబ్రవరి 2027 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. 'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ'లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ భారత్‌కు లైఫ్ అండ్ డెత్ లాంటిది.

66
WTC ఫైనల్, ఆసియా కప్.. అల్టిమేట్ టార్గెట్ 2027 వరల్డ్ కప్
Image Credit : Getty

WTC ఫైనల్, ఆసియా కప్.. అల్టిమేట్ టార్గెట్ 2027 వరల్డ్ కప్

ఇక అసలైన క్లైమాక్స్ 2027 లోనే ఉంది. 2027 ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో ‘ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్’ (WTC) ఫైనల్ జరగనుంది. దీని తర్వాత జులైలో వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీకి బంగ్లాదేశ్ హోస్టింగ్ ఇవ్వనుంది. ఇవన్నీ ఒకెత్తయితే.. క్రికెట్‌కే బాస్ లాంటి 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలలో గ్రాండ్‌గా జరగనుంది. ఈ మెగా టోర్నీలో కప్ కొట్టి ప్రపంచాన్ని ఏలడమే టీమిండియా అల్టిమేట్ టార్గెట్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
IPL 2026 Records: ఐపీఎల్ 2026లో రికార్డుల సునామీ.. 27 వేలకు పైగా రన్స్, 1426 సిక్సర్లు
Recommended image2
IPL 2026 Most Runs: ఐపీఎల్ 2026లో అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 బ్యాటర్లు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved