MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం

Team India Captain: సూర్యకుమార్ ఔట్.. శ్రేయాస్ అయ్యర్ ఇన్! పంజాబ్ హీరోకు పట్టాభిషేకం

Team India Captain : భారత టీ20 జట్టు పగ్గాలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తుండటంతో ఈ కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమైందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 19 2026, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్? సూర్యకుమార్ యాదవ్‌కు పొగ పడ్డట్టేనా
Image Credit : Getty

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్? సూర్యకుమార్ యాదవ్‌కు పొగ పడ్డట్టేనా

భారత క్రికెట్‌లో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. టీ20 ఫార్మాట్‌లో టీమ్ ఇండియా పగ్గాలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించే దిశగా సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళనకరంగా ఉండటం, అలాగే భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా అయ్యర్‌ను కెప్టెన్సీ రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో అయ్యర్ అద్భుత ప్రదర్శన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం కానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సూర్యకుమార్ యాదవ్‌కు గడ్డుకాలం?
Image Credit : Getty

సూర్యకుమార్ యాదవ్‌కు గడ్డుకాలం?

ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ బీసీసీఐ సెలెక్టర్లను కలవరపెడుతోంది. అటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున, ఇటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఆశించిన రీతిలో రాణించలేకపోతుండటంతో ఆయన కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక నమ్మకమైన నాయకుడిని ఎంచుకోవాలని బోర్డు భావిస్తోంది. సూర్యకుమార్ స్థానంలో న్యూబ్లడ్ కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Related image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
36
ఐపీఎల్‌లో శ్రేయాస్ అయ్యర్ ప్రభంజనం
Image Credit : Getty

ఐపీఎల్‌లో శ్రేయాస్ అయ్యర్ ప్రభంజనం

పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిని గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పంజాబ్ ఓటమి ఎరుగకుండా దూసుకుపోవడంలో అయ్యర్ కెప్టెన్సీ, బ్యాటింగ్ కీలక పాత్ర పోషించాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టి, కేకేఆర్‌కు 2024లో టైటిల్ అందించిన ఘనత ఆయనది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్ వరకు తీసుకువెళ్లి తన నాయకత్వ పటిమను మరోసారి నిరూపించుకున్నారు.

46
రిక్కీ పాంటింగ్ - అయ్యర్ మ్యాజిక్
Image Credit : Shreyas Iyer\BCCI

రిక్కీ పాంటింగ్ - అయ్యర్ మ్యాజిక్

పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్‌తో శ్రేయాస్ అయ్యర్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ జట్టుకు అద్భుత ఫలితాలను ఇస్తోంది. అయ్యర్ కెప్టెన్సీలో బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని కోచింగ్ స్టాఫ్ అభిప్రాయపడుతున్నారు. "అతను తన బలహీనతలను అధిగమించి ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయ్యర్ ప్రణాళికాబద్ధంగా ఉండటమే కాకుండా, మైదానంలో తన అంతరాత్మ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది జట్టుకు కలిసొస్తోంది" అని పంజాబ్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ప్రశంసించారు.

56
2023 తర్వాత రీఎంట్రీ దిశగా..
Image Credit : Getty

2023 తర్వాత రీఎంట్రీ దిశగా..

శ్రేయాస్ అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. "చాలా కాలంగా టీ20 జట్టులో లేని ఆటగాడిని నేరుగా తీసుకొచ్చి కెప్టెన్సీ అప్పగించడం పెద్ద నిర్ణయమే. అయితే, ప్రస్తుతం అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్‌పై ఉంది. దీంతో టీ20 నాయకత్వ మార్పు విషయంలో సెలెక్టర్లకు తగినంత సమయం దొరికింది" అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్, త్వరలోనే టీ20 బాధ్యతలు చేపడతారని గట్టిగా వినిపిస్తోంది.

66
అయ్యర్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు
Image Credit : ANI

అయ్యర్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసలు

అయ్యర్ నాయకత్వ శైలిపై జేమ్స్ హోప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిక్కీ పాంటింగ్ వంటి దిగ్గజ కోచ్ ముందు కూడా తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్థాయికి అయ్యర్ ఎదిగాడని ఆయన పేర్కొన్నారు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, ఫీల్డ్ సెట్టింగ్‌లు, బౌలింగ్ మార్పులలో అయ్యర్ చూపిస్తున్న చొరవ అతడిని రేసులో ముందుంచింది. 31 ఏళ్ల వయసులో ఉన్న అయ్యర్, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండటం భారత్‌కు సానుకూల అంశం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
Rinku Singh: కేకేఆర్‌కు అతిపెద్ద సమస్యగా మారాడు ! ఏమైంది రింకూ భయ్యా
Recommended image2
Team India : రోహిత్ కంటే డేంజర్.. టీమిండియా ఓపెనర్లుగా ఆ నలుగురు కుర్రాళ్లు రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved