MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?

సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?

Kavya Maran’s Sunrisers : సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే భారత్‌లో ఆ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. పాక్ ప్లేయర్ కోసం కోసం రూ. 2.34 కోట్లు పోసి కావ్య మారన్ చిక్కుల్లో పడ్డారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 13 2026, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sunrisers : కావ్యా మారన్ కొంపముంచిన పాక్ ప్లేయర్.. సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్ !
Image Credit : Getty + X/@CricketopiaCom

Sunrisers : కావ్యా మారన్ కొంపముంచిన పాక్ ప్లేయర్.. సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్ !

ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో సంచలనం నమోదైంది. భారత ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సోదర సంస్థ సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా భారత్‌లో సస్పెండ్ అయింది. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను వేలంలో కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాను నిలిపివేసినట్లు స్క్రీన్ పై కనిపిస్తోంది. అయితే ఏ నిబంధనలు ఉల్లంఘించారనే దానిపై స్పష్టత లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అబ్రార్ అహ్మద్‌ ఎంపికపై వెల్లువెత్తిన నిరసన
Image Credit : Getty

అబ్రార్ అహ్మద్‌ ఎంపికపై వెల్లువెత్తిన నిరసన

గురువారం జరిగిన ది హండ్రెడ్ ప్లేయర్ల వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అబ్రార్ అహ్మద్ కోసం ఆమె పట్టుబట్టి రూ. 2.34 కోట్లు వెచ్చించారు.

గతంలో భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా ఐపీఎల్ అనుబంధ జట్లు పాక్ ప్లేయర్లను దూరం పెడతాయని వార్తలు వచ్చాయి. కానీ కావ్య మారన్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అబ్రార్‌ను సైన్ చేశారు. దీంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత ఉన్న ప్లేయర్‌ను ఎలా కొంటారని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

35
గతంలో భారత విమాన దళాన్ని అవమానించిన అబ్రార్
Image Credit : Getty

గతంలో భారత విమాన దళాన్ని అవమానించిన అబ్రార్

అబ్రార్ అహ్మద్‌పై ఇంతలా ఆగ్రహం రావడానికి ప్రధాన కారణం అతని పాత సోషల్ మీడియా పోస్టులే. 2019లో పాక్ సరిహద్దులో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చిక్కుకున్నప్పుడు, పాక్ ఆర్మీ ఇచ్చిన టీని తాగుతూ ఆయన టీ చాలా బాగుంది" అని చెప్పారు. ఆ పదాన్ని వాడుతూ భారత్‌ను ఎగతాళి చేస్తూ అబ్రార్ గతంలో వీడియోలు, పోస్టులు పెట్టారు. రంజాన్ ముందు "చివరి కప్పు ఫెంటాస్టిక్ టీ" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని వెక్కిరించినట్లు ఉన్నాయని అభిమానులు గుర్తు చేస్తున్నారు. భారత్ పై ఇలా విషం కక్కే పాక్ ప్లేయర్ కు కావ్య మారన్ ఎలా అవకాశం ఇస్తారని ఫైర్ అవుతున్నారు.

45
కావ్య పాప నిర్ణయంపై అభిమానుల అల్టిమేటం
Image Credit : Getty

కావ్య పాప నిర్ణయంపై అభిమానుల అల్టిమేటం

వేలం టేబుల్ వద్ద కావ్య మారన్ వరుసగా బిడ్ వేస్తున్నప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. "ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొన్నప్పుడు షారుఖ్ ఖాన్‌ను విమర్శించినట్లే, ఇప్పుడు కావ్యా మారన్‌ను కూడా విమర్శించాలి. ముస్తాఫిజుర్ ఎప్పుడూ భారత్‌ను అవమానించలేదు, కానీ అబ్రార్ భారత్ అంటేనే విషం కక్కుతాడు" అని ఒక అభిమాని రాసుకొచ్చారు. మరికొందరు అయితే "అబ్రార్ కనుక జట్టులోకి వస్తే, ఇదే సన్‌రైజర్స్‌కు అభిమానిగా నా చివరి రోజు" అంటూ అల్టిమేటం జారీ చేశారు.

55
గతంలోనూ ఇతర ఫ్రాంచైజీల కొనుగోళ్లు
Image Credit : Getty

గతంలోనూ ఇతర ఫ్రాంచైజీల కొనుగోళ్లు

అయితే పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ అనుబంధ జట్లు కొనడం ఇదే మొదటిసారి కాదు. 2023 నుంచి పలు జట్లు ఈ పని చేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (CPL) కోసం మహ్మద్ అమీర్, ఉస్మాన్ తారిక్ ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాటా ఉన్న సీటెల్ ఓర్కాస్ కోసం ఇమాద్ వసీమ్, జమాన్ ఖాన్ ఆడారు. అలాగే ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ కోసం ఉస్మాన్ ఖాన్ ఆడారు. కానీ అబ్రార్ అహ్మద్ విషయంలో ఉన్న రాజకీయ వివాదం కారణంగా ఇప్పుడు సన్‌రైజర్స్ గ్రూప్ టార్గెట్ అయింది. ఈ వివాదం సన్‌రైజర్స్ లీడ్స్ డిజిటల్ ఉనికిపై గట్టి దెబ్బే కొట్టింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Hardik Pandya : హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. జైలుకు వెళ్లే ఛాన్స్? అసలు మ్యాటర్ ఇదే !
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved