MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?

IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?

IPL 2027: ఐపీఎల్ 2027 ఎడిషన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టులో సంచలన మార్పులు జరిగే అవకాశం ఉంది. మళ్లీ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంగతేంటి? టీమ్ మారబోతున్నాడా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 14 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్ బిగ్ ప్లాన్
Image Credit : chatgpt

ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్ బిగ్ ప్లాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీకి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ (MI) క్యాంప్‌లో సంచలన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని సీజన్లుగా జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మరోసారి తెరపైకి వస్తోంది. అభిమానుల్లోనూ, క్రికెట్ వర్గాల్లోనూ ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోహిత్ శర్మకు మళ్లీ ముంబై టీమ్ పగ్గాలు ఎందుకు?
Image Credit : ANI

రోహిత్ శర్మకు మళ్లీ ముంబై టీమ్ పగ్గాలు ఎందుకు?

రోహిత్ శర్మ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత నుంచి ముంబై ఇండియన్స్ ప్రదర్శన గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. 2024 సీజన్‌కు ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు సడన్‌గా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే హార్దిక్ నాయకత్వంలో జట్టు ఫలితాలు పూర్తిగా నిరాశపరిచాయి. 2024లో ముంబై జట్టు పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2025లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లినా ట్రోఫీ మాత్రం గెలవలేకపోయింది. మరోవైపు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, ఆటగాళ్ల మధ్య సమన్వయంపైనా అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. దీంతో మేనేజ్‌మెంట్ మళ్లీ రోహిత్ అనుభవంపై నమ్మకం ఉంచాలని చూస్తోంది.

35
మరి హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ ఏంటి?
Image Credit : ANI

మరి హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ ఏంటి?

రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ రేసులోకి వస్తుండటంతో హార్దిక్ పాండ్యా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హార్దిక్‌ను వేరే ఫ్రాంచైజీకి ట్రేడ్ చేసే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ముంబై మేనేజ్‌మెంట్ హార్దిక్‌ను కేవలం సాధారణ ఆటగాడిగా జట్టులోనే అట్టిపెట్టుకోవాలని భావిస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు వయసురీత్యా రోహిత్ కెప్టెన్సీకి మళ్లీ అంగీకరిస్తాడా లేదా అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ రోహిత్ కాదంటే తిలక్ వర్మ లేదా జస్ప్రీత్ బుమ్రా పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

45
యశస్వి జైస్వాల్ ఎంట్రీపై చర్చలు
Image Credit : Getty

యశస్వి జైస్వాల్ ఎంట్రీపై చర్చలు

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా క్రికెట్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య హార్దిక్ పాండ్యా మార్పిడికి సంబంధించి యశస్వి జైస్వాల్ పేరు చర్చకు వచ్చిందనే టాక్ వినిపించింది. రోహిత్ శర్మ వయసును దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు కోసం ఒక పవర్‌ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్‌ను జట్టులోకి తెచ్చుకోవాలని ముంబై భావిస్తోందని టాక్. అయితే ఈ ట్రేడ్ డీల్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రానున్న రోజుల్లో ఈ వార్తపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

55
ఐపీఎల్ 2027 సీజన్‌పై భారీ అంచనాలు
Image Credit : Facebook/Mumbai Indians

ఐపీఎల్ 2027 సీజన్‌పై భారీ అంచనాలు

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అన్ని జట్లు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద జట్టులో ఇలాంటి మార్పులు జరగడం సర్వసాధారణమే అయినా, రోహిత్ - హార్దిక్ అంశం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తోంది. జట్టులో సమతుల్యతను తీసుకురావడానికి, పాత వైభవాన్ని మళ్లీ దక్కించుకోవడానికి మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్‌గా వస్తే చూడాలని కోరుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Related Stories
Recommended image1
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Recommended image2
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved