MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • IPL 2026 : రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా..? ఈ-సిగరెట్ పై ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

IPL 2026 : రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా..? ఈ-సిగరెట్ పై ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి..?

మ్యాచ్ మధ్యలో ఏకంగా మైదానంలోనే ఈ-సిగరెట్ తాగిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఎలాంటి చర్యలుంటాయి..? ఐపిఎల్, బిసిసిఐ రూల్స్ తో పాటు ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి..? 

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 29 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపిఎల్ కెప్టెన్ అరెస్ట్..?
Image Credit : X/@CricCrazyJohns

ఐపిఎల్ కెప్టెన్ అరెస్ట్..?

E-Cigatette : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 రసవత్తరంగా సాగుతోంది... ఈ సీజన్ ఆరంభంనుండి రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆడుతోంది. యువ క్రికెటర్లతో నిండిన టీం ను చక్కగా నడిపిస్తున్నాడని కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యాటింగ్ లో పెద్దగా రాణించకపోయినా ఆర్ఆర్ టీం అతడి సారథ్యంలో వరుస విజయాలు అందుకుంది. తాజాగా అసలు ఓటమన్నదే ఎరగకుండా పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన పంజాబ్ కింగ్స్ ను ఓడించింది రాజస్థాన్.

అయితే పంజాబ్ పై రాజస్థాన్ విజయంతో పరాగ్ మరిన్ని ప్రశంసలు అందుకోవాల్సింది... కానీ అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు మైదానంలో అతడు వ్యవహరించిన తీరే కారణం. పంజాబ్ తో మ్యాచ్ సమయంలో పరాగ్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. దీంతో పరాగ్ పై ఐపిఎల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలేం జరిగింది...?
Image Credit : X/@RoshanKrRaii

అసలేం జరిగింది...?

ఐపిఎల్-2026 లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28, మంగళవారం) చండీగఢ్ లోని ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన స్థానిక జట్టు పంజాబ్ కింగ్స్ 222 పరుగులు చేసింది... దీంతో రాజస్థాన్ 223 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే అద్భుతమైన ఆరంభం అందించాడు. అయితే మిడిల్ ఓవర్స్ లో వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తంగా మారింది.

ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలక సమయంలో ఔట్ కావడంతో అతడు కాస్త అసహనంగానే పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే ఫెర్రీరా, శుభమ్ ధూబే బ్యాటింగ్ చేస్తుండగా 16 ఓవర్ సమయంలో కెమెరా ఒక్కసారిగా రాజస్థాన్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూం వైపు మళ్లింది. అక్కడ ఆర్ఆర్ కెప్టెన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) తాగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఔటైన కొద్దిసేపటికే ఈ సీన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ఈ పనిపై అభిమానులు మండిపడుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాళ్లకు కెప్టెన్‌గా ఏం సందేశం ఇస్తున్నావంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Riyan Parag Smoking VAPE in dressing room 🤯 pic.twitter.com/EbIMI5qHxK

— Liam Livingstone (@NightmareOP9) April 28, 2026

35
డ్రెస్సింగ్ రూంలో సిగరెట్ తాగవచ్చా..? ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Image Credit : ANI

డ్రెస్సింగ్ రూంలో సిగరెట్ తాగవచ్చా..? ఐపిఎల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఐపీఎల్ నిబంధనల్లో వేపింగ్‌పై ప్రత్యేకంగా రూల్స్ లేకపోయినా స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్‌లలో పొగాకు లేదా సంబంధిత ఉత్పత్తుల వాడకంపై బీసీసీఐ నిషేధం విధించింది. ఆటగాళ్ల ఆరోగ్య, భద్రతా నిబంధనల దృష్ట్యా బిసిసిఐ ఈ రూల్స్ పెట్టింది. ముఖ్యంగా మైదానంలో ఆటగాళ్లు సిగరెట్ తాగడం నిషేధం... డ్రెస్సింగ్ రూమ్ నాన్ స్మోకింగ్ జోన్.

బిసిసిఐ నిబంధనల ప్రకారం... క్రికెట్ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తే ఆటగాళ్లపై రిఫరీ చర్యలు తీసుకోవచ్చు. దీని ప్రకారం మ్యాచ్ ఫీజులో కోత విధించడం, ఫైన్ వేయడం లేదంటే తర్వాతి మ్యాచ్ లు ఆడకుండా సస్పెండ్ చేయవచ్చు. అంటే పరాగ్ వీటిలో ఏదో ఒక చర్య ఉండే అవకాశాలున్నాయి... అయితే అధికారికంగా ఈ వ్యవహారంపై ఐపిఎల్ మేనేజ్మెంట్ గానీ, బిసిసిఐ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

45
ఈ-సిగరెట్ తాగితే జైలు శిక్ష తప్పదా..?
Image Credit : Getty

ఈ-సిగరెట్ తాగితే జైలు శిక్ష తప్పదా..?

రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రీడా నిబంధనలే కాదు భారతీయ చట్టాలను సైతం అతిక్రమించాడు. ఇండియాలో Prohibition of Electronic Cigarettes Act (PECA) 2019 ప్రకారం ఈ-సిగరెట్ పై నిషేధం ఉంది. అంటే ఈ-సిగరెట్ తయారుచేయడం, ఎగుమతి లేదా దిగుమతి చేయడం, స్టోర్ చేయడం, ప్రోత్సహించేలా ప్రకటనలు ఇవ్వడం వంటి చర్యలను నేరంగా పరిగణిస్తారు. అంటే వీటిని ఉపయోగించడం కూడా చట్టరిత్యా నేరమే.

ఇలా చట్టాలను అతిక్రమించి మొదటిసారి ఈ-సిగరెట్ ను వాడితే ఏడాది జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇక రెగ్యులర్ గా చట్టాలను అతిక్రమిస్తే 3 ఏళ్లు జైలుశిక్ష, 5 లక్షల రూపాయల ఫైన్ ఉంటుంది. ఈ-సిగరెట్లు స్టోర్ చేసినా ఆరునెలల వరకు జైలుశిక్ష విధించవచ్చు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఈ-సిగరెట్ తాగితే మరింత కఠిన శిక్షలు ఉంటాయి.. పరాగ్ చేసింది ఇదే. కాబట్టి అతడికి జైలు శిక్ష, ఫైన్ పడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇదే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు మొబైల్ ఫోన్ వాడినందుకే రూ.1 లక్ష జరిమానా విధించారు. మరి కెప్టెన్ పరాగ్ ఏకంగా సిగరెట్ తాగాడు.. అతడిపై ఇంతకంటే కఠినమైన చర్యలు ఉండే అవకాశాలున్నాయి. ఐపిఎల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా..? బిసిసిఐ చర్యలు తీసుకుంటుందా..? లేదా పోలీసులు ఎంటరై అరెస్ట్ చేస్తారా..? అన్నది త్వరలోనే తేలనుంది.

55
కెప్టెన్ గా సక్సెస్... ప్లేయర్ గా ఫెయిల్..
Image Credit : X/Mufaddal Vohra

కెప్టెన్ గా సక్సెస్... ప్లేయర్ గా ఫెయిల్..

సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో, 24 ఏళ్ల పరాగ్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ దక్కింది. అయితే ఈ సీజన్‌లో అతను బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ కు ముందు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 81 పరుగులే చేశాడు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ-సిగరెట్ వివాదం అతనికి పెద్ద తలనొప్పిగా మారింది.

అయితే పరాగ్ వివాదం ఎలా ఉన్నా పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. పరాగ్ ఔటయ్యాక చివరి ఓవర్లలో డొనావన్ ఫెరీరా (52*), శుభమ్ దూబే (31) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
PBKS Vs RR: 15 ఏళ్ల బుడ్డోడి చేతుల్లో 3 జట్ల భవితవ్యం.. ఓడితే ఇక అస్సామే.. వివరాలు ఇవిగో
Recommended image2
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved