MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?

IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?

IPL 2026 : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి కరుణ్ నాయర్ క్యాచ్ డ్రాప్స్ కారణమని విమర్శలు వస్తుండగా,  అశ్విన్ భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. అసలు 264 పరుగులు కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు ఓడిపోయింది?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 26 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టాడు.. కానీ..
Image Credit : ANI

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టాడు.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంత పెద్ద లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభమని అందరూ భావించారు, కానీ పంజాబ్ కింగ్స్ రికార్డుల మోత మోగిస్తూ.. అద్భుతమైన రన్ ఛేజ్‌తో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమికి ప్రధాన కారణం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కరుణ్ నాయర్ కీలకమైన క్యాచ్‌లు వదిలేయడమేనని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ విషయంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. కరుణ్ నాయర్‌ను తప్పుబట్టడం సరికాదనీ, ఇది కెప్టెన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నాలుగు బంతుల్లో రెండు క్యాచ్‌లు డ్రాప్
Image Credit : Getty

నాలుగు బంతుల్లో రెండు క్యాచ్‌లు డ్రాప్

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిలో టర్నింగ్ పాయింట్ శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం. 15వ ఓవర్‌లో విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో అయ్యర్ ఒక భారీ షాట్‌కు ప్రయత్నించగా, అది లాంగ్ ఆఫ్ దిశగా వెళ్ళింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కరుణ్ నాయర్ ఆ సులభమైన క్యాచ్‌ను మిస్ చేశాడు.

ఆ తర్వాత 16వ ఓవర్ రెండో బంతికి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మరోసారి అయ్యర్ తప్పులో కాలేశాడు. ఈసారి బంతి గాలిలో లేచి లాంగ్ ఆన్ వైపు వెళ్ళింది. అక్కడ కూడా కరుణ్ నాయర్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ రెండు క్యాచ్‌లు ఢిల్లీకి శాపంగా మారాయి. శ్రేయాస్ అయ్యర్ కేవలం 36 బంతుల్లో 71 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Related Articles

Related image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Related image2
Mumbai Indians : హార్దిక్‌కు షాక్.. ముంబైకి మళ్లీ రోహితే బాస్? రేసులో ఉన్న ఆ నలుగురు వీరే !
36
కరుణ్ నాయర్‌ గురించి అశ్విన్ ఏమన్నారంటే?
Image Credit : Getty

కరుణ్ నాయర్‌ గురించి అశ్విన్ ఏమన్నారంటే?

అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ యాష్ కీ బాత్ లో మాట్లాడుతూ.. కరుణ్ నాయర్‌ను సమర్థించారు. ఒక ప్లేయర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేనప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో వివరించారు. "సాధారణంగా తుది జట్టులో లేని ఆటగాళ్లకు ఆ విషయం ఒక రోజు ముందే తెలుస్తుంది. అలాంటి వారు మ్యాచ్ రోజున జిమ్‌కు వెళ్లడం లేదా అదనపు శిక్షణ పొందడం వంటివి చేస్తారు. తర్వాతి రోజు ప్రయాణం ఉండవచ్చనీ, ప్రాక్టీస్‌కు సమయం ఉండదని వారు ముందే కష్టపడతారు. దీనివల్ల వారు శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంటుంది" అని అశ్విన్ పేర్కొన్నారు.

46
కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. కెప్టెన్ వ్యూహం దెబ్బకొట్టిందా?
Image Credit : Getty

కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. కెప్టెన్ వ్యూహం దెబ్బకొట్టిందా?

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 152 పరుగులు సాధించాడు. అయితే, ఫీల్డింగ్ సమయంలో ఆయన మైదానం వెలుపల ఉన్నాడు. రాహుల్ లేకపోవడంతో ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. "రాహుల్ లేనప్పుడు స్టబ్స్ కీపింగ్ చేశాడు. ఒకవేళ రాహుల్ అందుబాటులో ఉండి ఉంటే, స్టబ్స్ ఫీల్డింగ్‌లో ఉండేవాడు. స్టబ్స్ అత్యుత్తమ ఫీల్డర్, అతను కచ్చితంగా ఆ క్యాచ్‌లు పట్టేవాడు. కానీ మీరు అభిషేక్ పోరెల్ వంటి ప్లేయర్‌ను కీపింగ్‌కు ఎందుకు ఉపయోగించుకోలేదు? పోరెల్ కీపింగ్ చేస్తే స్టబ్స్ ఫీల్డింగ్‌లో ఉండేవాడు కదా" అని ప్రశ్నించారు.

56
సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ సవాళ్లు
Image Credit : Getty

సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ సవాళ్లు

ఫీల్డింగ్ అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, మానసిక ఏకాగ్రతతో కూడుకున్నదని అశ్విన్ వివరించారు. కరుణ్ నాయర్ బహుశా మానసిక అలసటతో ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. "నేను సాకులు చెప్పడం లేదు, కానీ ఒక సబ్‌స్టిట్యూట్ ఆటగాడు అకస్మాత్తుగా అంత తీవ్రత ఉన్న మ్యాచ్‌లోకి వచ్చి ఫీల్డింగ్ చేయడం అంత సులభం కాదు. కరుణ్ నాయర్ అద్భుతమైన ఫీల్డర్, గతంలో అతను ఇలాంటి తప్పులు చేయడం నేను చూడలేదు. బహుశా ఆ సమయానికి అతను మానసిక స్థితి సరిగ్గా లేకపోవచ్చు" అని అశ్విన్ అన్నారు.

66
ఢిల్లీ గుణపాఠం నేర్చుకుందా?
Image Credit : Getty

ఢిల్లీ గుణపాఠం నేర్చుకుందా?

మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ స్కోరు చేసినప్పటికీ, రక్షణ వ్యూహాల్లో విఫలమైంది. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఒత్తిడిని జయించి రికార్డు విజయాన్ని నమోదు చేశారు. క్యాచ్‌లు వదిలేయడం ఒక కారణమైతే, కీలక సమయంలో ఫీల్డింగ్ స్థానాలను సర్దుబాటు చేయడంలో కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్ మ్యాచ్‌ల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఢిల్లీ జట్టుకు ఎంతైనా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Related Stories
Recommended image1
IPL 2026: ఎవడ్రా బాబు వీడు.. గేల్ రికార్డ్ ఖతం.. బెంగళూరులో సాయి సుదర్శన్ శివతాండవం!
Recommended image2
Mumbai Indians : హార్దిక్‌కు షాక్.. ముంబైకి మళ్లీ రోహితే బాస్? రేసులో ఉన్న ఆ నలుగురు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved