MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?

CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?

Chennai Super Kings: 36 బంతుల్లో సెంచరీతో అదరగొట్టిన ముంబై యువ సంచలనం ఆయుష్ వర్తక్ కు చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్ కోసం పిలుపునిచ్చింది. ధోని మరో మాస్టర్ ప్లాన్ వేసినట్టు దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఎవరీ ఆయుష్ వర్తక్?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 28 2026, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధోనీ మాస్టర్ ప్లాన్.. ముంబై కుర్రాడికి చెన్నై ట్రయల్స్.. ఇక రచ్చే!
Image Credit : x

ధోనీ మాస్టర్ ప్లాన్.. ముంబై కుర్రాడికి చెన్నై ట్రయల్స్.. ఇక రచ్చే!

ఐపీఎల్ మినీ వేలంలో ఎవరూ పట్టించుకోని ఒక యువ ఆటగాడికి అదృష్టం తలుపు తట్టింది. ముంబైకి చెందిన 21 ఏళ్ల యువ యంగ్ ఆయుష్ వర్తక్ ను ట్రయల్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పిలిచింది. అండర్-23 క్రికెట్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నా వేలంలో అమ్ముడుపోని ఈ యువ సంచలనానికి, ఇప్పుడు ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేలో చేరే అవకాశం దక్కింది.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన తర్వాత, తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేయాలని చెన్నై భావిస్తోంది. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో ఇప్పటికే ఆకాష్ మధ్వాల్‌ను తీసుకున్న సీఎస్కే, మరో ఖాళీ ఉన్న స్లాట్ కోసం ఆయుష్ వర్తక్ వైపు మొగ్గు చూపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అశ్విన్ ప్రశంసలు.. స్కౌటింగ్ టీమ్ ప్లాన్!
Image Credit : ANI

అశ్విన్ ప్రశంసలు.. స్కౌటింగ్ టీమ్ ప్లాన్!

టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. సీఎస్కే స్కౌటింగ్ బృందం పనితీరును ఆయన కొనియాడారు. "భవిష్యత్తు కోసం మంచి కోర్ టీమ్‌ను నిర్మించడంలో సీఎస్కే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వేలాల మధ్యలో ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడం జట్టును బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గం. మహారాష్ట్రకు చెందిన యంగ్ ప్లేయర్ ఆయుష్ వర్తక్ కు శుభాకాంక్షలు" అని అశ్విన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

నిజానికి ఆయుష్ వర్తక్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ముఖ్యంగా ముంబై జూనియర్ టీమ్ తరపున ఆడుతూ కాంగా లీగ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఏడాది క్రితం కాలికి గాయమై రక్తం కారుతున్నా లెక్కచేయకుండా బ్యాటింగ్ చేసి తన పట్టుదలను చాటుకున్నాడు.

Related Articles

Related image1
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!
Related image2
RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
34
పరుగుల వరద.. సిక్సర్ల సునామీ
Image Credit : ANI

పరుగుల వరద.. సిక్సర్ల సునామీ

స్టేట్ ఏ ట్రోఫీ 2025లో ఆయుష్ వర్తక్ ఫామ్ అద్భుతం అని చెప్పాలి. కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 363 పరుగులు చేశాడు. ఇందులో 26 సిక్సర్లు ఉన్నాయి. ఎల్‌ఎస్‌జీ భారీ ధరకు కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఇతనే. ఈ టోర్నీలో 132, 92 నాటౌట్, 75 వంటి కీలక ఇన్నింగ్స్‌లతో ముంబై తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అంతేకాకుండా, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ (2024-26)లో 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 770 పరుగులు సాధించాడు. ఇందులో 192, 102, 105 వంటి భారీ సెంచరీలు ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి 2024 సీజన్‌కు 'అండర్-23 అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్' అవార్డును కూడా అందుకున్నాడు.

44
ముంబై ఇండియన్స్‌తో తదుపరి పోరు!
Image Credit : ANI

ముంబై ఇండియన్స్‌తో తదుపరి పోరు!

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో స్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి, నెగటివ్ రన్ రేట్‌తో ఇబ్బంది పడుతోంది. తదుపరి మ్యాచ్ మే 2న సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరగనుంది. ఈ లోపే ఆయుష్ వర్తక్ ట్రయల్స్‌లో మెప్పిస్తే, అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

గతంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్ల ట్రయల్స్‌లో కూడా ఆయుష్ పాల్గొన్నాడు. కానీ, ఇప్పుడు సీఎస్కే ఇచ్చే అవకాశం అతని కెరీర్‌ను మలుపు తిప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇతను జట్టులోకి వస్తే, సీఎస్కే మిడిల్ ఆర్డర్ మరింత బలంగా మారే అవకాశం ఉంది.

CSK have been very diligent with their scouting during the season to build a good core for the future.

Upgrading in between auctions through such smart recruitments and trades is the best way to realign squads.

Young talented Ayush Vartak from Maharashtra. pic.twitter.com/9P0YzJOgdi

— Ashwin 🇮🇳 (@ashwinravi99) April 27, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Related Stories
Recommended image1
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!
Recommended image2
RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved