MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup : టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి.. టీమిండియా వైఫల్యానికి టాప్ 5 రీజన్స్

T20 World Cup : టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి.. టీమిండియా వైఫల్యానికి టాప్ 5 రీజన్స్

మహిళల T20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం గ్రూప్ స్టేజ్‌లోనే ముగిసింది. ఆస్ట్రేలియాతో ఓటమితో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి, కీలక మ్యాచ్‌లలో వరుస వైఫల్యాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 29 2026, 09:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియన్ ఉమెన్స్ టీం ఖేల్ ఖతం దుకాణం బంద్
Image Credit : Getty

ఇండియన్ ఉమెన్స్ టీం ఖేల్ ఖతం దుకాణం బంద్

ICC Women's T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీ సాధించాలన్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది మన ఉమెన్స్ టీం. అంతకుముందు బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా గెలవడంతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆస్ట్రేలియాపై భారీ తేడాతో గెలిస్తేనే నెట్ రన్ రేట్ పరంగా అవకాశం ఉండేది. కానీ ఆసీస్ 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో, మన అమ్మాయిల టోర్నీ ప్రయాణం ముగిసింది. గతేడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన 'విమెన్ ఇన్ బ్లూ'.. ఈసారి అంచనాలను అందుకోలేకపోయింది. మరి టీమిండియా గ్రూప్ స్టేజ్‌లోనే ఎందుకు వెనుదిరిగింది? కీలక కారణాలేంటో ఓసారి చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. పెద్దజట్లను ఓడించలేక చతికిలపడిన ఇండియా
Image Credit : Getty

1. పెద్దజట్లను ఓడించలేక చతికిలపడిన ఇండియా

పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌పై గెలిచినా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లతో జరిగిన కీలక మ్యాచ్‌లలో మన అమ్మాయిలు తేలిపోయారు. ఈ రెండు జట్లపైనా మంచి స్కోర్లు చేసినా, వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. మరిజాన్ కాప్ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లు జారవిడచడంతో మ్యాచ్ మన చేతుల్లోంచి వెళ్లిపోయింది. ఇంగ్లండ్‌తోనూ 170 పరుగుల టార్గెట్‌ను ఫీల్డింగ్ తప్పిదాల వల్ల కాపాడుకోలేకపోయారు. ఈ వైఫల్యాలు సెమీస్ ఆశలను దెబ్బతీశాయి. 

Related Articles

Related image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Related image2
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
36
2. విఫలమైన టీమిండియా మిడిల్ ఆర్డర్
Image Credit : Getty

2. విఫలమైన టీమిండియా మిడిల్ ఆర్డర్

టోర్నీ అంతటా టీమిండియా టాప్-ఆర్డర్‌పై, ముఖ్యంగా ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మపైనే ఎక్కువగా ఆధారపడింది. వాళ్లు విఫలమైన ప్రతీసారి మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. దీంతో రన్ రేట్ పడిపోయి, భారీ స్కోర్లు చేయలేకపోయింది. నెదర్లాండ్స్‌పై 209/5, బంగ్లాదేశ్‌పై 139 పరుగుల లక్ష్య ఛేదన మినహా.. మిగతా మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ రాణించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా బౌండరీలు కొట్టలేకపోయారు. జెమీమాను 3, 4 స్థానాల్లో మార్చడం, ఫామ్‌లో లేని యస్తికా భాటియాను నెం.3లో ఆడించడం వంటి వ్యూహాత్మక తప్పిదాలు జట్టును దెబ్బతీశాయి.
46
3. చెత్త ఫీల్డింగ్ కు భారీ మూల్యం
Image Credit : Getty

3. చెత్త ఫీల్డింగ్ కు భారీ మూల్యం

టీమిండియా ఓటమికి మరో ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్, జారవిడిచిన క్యాచ్‌లు. ఈ టోర్నీలో మన అమ్మాయిలు మొత్తం 11 క్యాచ్‌లు వదిలేశారు. క్యాచ్‌ల సక్సెస్ రేటు కేవలం 71% మాత్రమే. ఇది టోర్నీలోనే అత్యంత తక్కువ. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రాధా యాదవ్.. మరిజాన్ కాప్ క్యాచ్‌ను వదిలేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఐదు ఓవర్లలోనే నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఒక్క క్యాచ్ కూడా వదలకపోయినా ఓటమి తప్పలేదు. గత ఏడాది కాలంలో ఆడిన 25 T20I మ్యాచ్‌లలో టీమిండియా ఏకంగా 46 క్యాచ్‌లు వదిలేసిందంటే ఫీల్డింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
56
4. ఆ బౌలర్లకు ఏమయ్యింది?
Image Credit : Getty

4. ఆ బౌలర్లకు ఏమయ్యింది?

స్పిన్నర్లపై అతిగా ఆధారపడటం, సరైన పేస్ బౌలర్లు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై మన బౌలింగ్ తేలిపోయింది. గ్రూప్ స్టేజ్‌లో టీమిండియా మొత్తం 34 వికెట్లు తీస్తే, అందులో 29 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. శ్రీ చరణి 12, దీప్తి శర్మ 7, షఫాలీ వర్మ 5, రాధా యాదవ్ 3 వికెట్లు తీశారు. దీన్నిబట్టి స్పిన్‌పై ఎంతలా ఆధారపడ్డారో తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై పేసర్లు వికెట్లు తీయలేకపోయారు. దీంతో పవర్ ప్లే, డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయలేకపోయారు.  

66
5. సీనియర్లపై అతిగా ఆధారపడటం..
Image Credit : Getty

5. సీనియర్లపై అతిగా ఆధారపడటం..

చివరిగా కొందరు స్టార్ బ్యాటర్ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే జట్టు ఆధారపడింది. వాళ్లు విఫలమైనప్పుడు మిడిల్ ఆర్డర్ నుంచి సపోర్ట్ కరువైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 56 పరుగులు చేసింది. స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34), జెమీమా రోడ్రిగ్స్ (34) కూడా రాణించారు. కానీ లోయర్-మిడిల్ ఆర్డర్ నుంచి సరైన ఫినిషింగ్ లభించలేదు. 

గ్రూప్ స్టేజ్‌లో జట్టు చేసిన మొత్తం 846 పరుగులలో.. స్మృతి మంధాన (205), షఫాలీ వర్మ (179), హర్మన్‌ప్రీత్ (141) ముగ్గురే కలిసి 525 పరుగులు చేశారు. అంటే, జట్టు మొత్తం పరుగుల్లో 62.1% వీరివే. ఇది కొందరు సీనియర్లపై జట్టు ఎంతగా ఆధారపడిందో చూపిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
FIFA World Cup: మెస్సీ సేనకు షాక్.. రొనాల్డోనే కింగ్ ! ఘనా మంత్రగాడి మైండ్ బ్లోయింగ్ జోస్యం
Recommended image2
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Recommended image3
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved