MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే

Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే

Team India Semifinal Scenario: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమితో గ్రూప్-A సెమీస్ రేస్ రసవత్తరంగా మారింది. టీమిండియా సెమీఫైనల్ చేరడానికి ఉన్న అవకాశాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 22 2026, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షాకింగ్ ఓటమి.. వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుండి ఇండియా అవుట్ అయినట్లేనా? అసలు లెక్కలు ఇవే
Image Credit : Chatgpt

షాకింగ్ ఓటమి.. వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుండి ఇండియా అవుట్ అయినట్లేనా? అసలు లెక్కలు ఇవే

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఆదివారం రాత్రి జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

టోర్నీని పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై అదిరిపోయే విజయాలతో ప్రారంభించిన భారత్‌కు ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఒక్క ఓటమితో గ్రూప్-A సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలా 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. దీంతో సెమీఫైనల్ చేరే టాప్-2 స్థానాల కోసం పోటీ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెట్ రన్ రేట్ కీలకం.. ఇండియా ఎక్కడ ఉందంటే?
Image Credit : X/ICC

నెట్ రన్ రేట్ కీలకం.. ఇండియా ఎక్కడ ఉందంటే?

గ్రూప్‌లో మూడు జట్లు సమాన పాయింట్లతో ఉండటంతో ఇకపై నెట్ రన్ రేట్, విజయాల మార్జిన్ అత్యంత కీలకంగా మారాయి. భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్‌లలో 4 పాయింట్లు సాధించి, +2.511 మెరుగైన నెట్ రన్ రేట్‌తో టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ విజయాలు భారత్‌కు ఈ భారీ రన్ రేట్ ను అందించాయి.

ఇదే రన్ రేట్ ప్రస్తుతం భారత్‌ను రేసులో ముందుంచింది. అయితే, సౌతాఫ్రికా గెలిచినప్పటికీ వారి రన్ రేట్ -0.546 గా ఉంది. బంగ్లాదేశ్ రన్ రేట్ -0.641 గా ఉంది. ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌లలో 3 విజయాలు, +4.391 రన్ రేట్‌తో 6 పాయింట్లు సాధించి దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు అధికారికంగా సెమీస్ రేస్ నుండి అవుట్ అయ్యాయి.

35
టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి?
Image Credit : X/ICC

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి?

భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాలంటే ఇకపై తదుపరి రెండు మ్యాచ్‌లలోనూ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో తలపడనుంది. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే, మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సులభంగా సెమీస్ చేరుకుంటుంది.

ఒకవేళ భారత్ వచ్చే రెండు మ్యాచ్‌లలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిస్తే టీమిండియా టోర్నీ నుండి అవుట్ అవుతుంది. కాబట్టి హర్మన్‌ప్రీత్ సేనకు ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే.

45
మిగిలిన జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

మిగిలిన జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయి?

సౌతాఫ్రికా జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా, ఆ తర్వాత పాకిస్తాన్, భారత్‌లపై గెలిచి రేసులోకి వచ్చింది. వారు తమ తదుపరి మ్యాచ్‌లలో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లతో ఆడనున్నారు. వారు 8 పాయింట్లు సాధించే అవకాశం ఉన్నా, వారి మైనస్ రన్ రేట్ వల్ల మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

మరోవైపు బంగ్లాదేశ్ జట్టు నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లపై గెలిచినా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో వారి రన్ రేట్ దెబ్బతింది. బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్‌లలో ఇండియా, సౌతాఫ్రికాలతో ఆడాల్సి ఉంది. కాబట్టి వారి సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి.

55
ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకం.. షెడ్యూల్ ఇదే
Image Credit : X/BCCIWomen

ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకం.. షెడ్యూల్ ఇదే

గ్రూప్-A లో సెమీస్ చేరే జట్లు ఏవో తేలడానికి జూన్ 28న జరిగే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్-A లో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్:

  • జూన్ 23: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్
  • జూన్ 25: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
  • జూన్ 25: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్
  • జూన్ 27: పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్
  • జూన్ 28: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
  • జూన్ 28: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

గత రికార్డులను పరిశీలిస్తే టీమిండియా 2018, 2023లలో సెమీఫైనల్ చేరగా, 2020లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ 2024 లో సెమీస్ చేరడంలో విఫలమైంది. ఈసారి ఎలాగైనా నాకౌట్ చేరాలని కసితో ఉన్న భారత్‌కు బంగ్లాదేశ్‌ను ఓడించడం సులువే అయినా, బలమైన ఆస్ట్రేలియాను లార్డ్స్ లో జరిగే లీగ్ చివరి మ్యాచ్‌లో ఢీకొట్టడం అతిపెద్ద సవాలుగా మారనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
మహిళల క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
WPL 2027: రూ. 1.1 కోట్లతో సోఫీ మోలినెక్స్ రికార్డు.. వేలంలో అదరగొట్టిన యూపీ వారియర్స్, ఆర్సీబీ
Recommended image2
CSK: మూడేళ్లుగా ప్లేఆఫ్స్ మిస్.. ఆరో ఐపీఎల్ ట్రోఫీ కోసం సీఎస్కే బిగ్ స్కెచ్
Recommended image3
ICC T20 Rankings: టీ20ల్లో నంబర్ 1.. అభిషేక్ శర్మ దెబ్బకు రికార్డులు షేక్
Related Stories
Recommended image1
Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్‌ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Recommended image2
T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved