MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి

T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి

Shree Charani Creates T20 World Cup History: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పూనమ్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసి, 21 ఏళ్ల తెలుగు యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి హిస్టరీ క్రియేట్ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 26 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మ్యాంచెస్టర్‌లో 21 ఏళ్ల స్పిన్నర్ శ్రీ చరణి తుఫాన్.. పూనమ్ యాదవ్ రికార్డును బ్రేక్ చేస్తూ హిస్టారికల్ రికార్డ్
Image Credit : X/BCCIWomen

మ్యాంచెస్టర్‌లో 21 ఏళ్ల స్పిన్నర్ శ్రీ చరణి తుఫాన్.. పూనమ్ యాదవ్ రికార్డును బ్రేక్ చేస్తూ హిస్టారికల్ రికార్డ్

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా దుమ్మురేపింది. మ్యాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ స్టేజ్ నాల్గో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 137 పరుగుల టార్గెట్‌ను టీమిండియా చివరికి చాలా ఈజీగా ఛేజ్ చేసింది.

ఈ విక్టరీతో భారత్ సెమీఫైనల్ రేసులో స్ట్రాంగ్‌గా నిలిచింది. ఇప్పుడు టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలవాల్సి ఉంటుంది, లేదా సౌతాఫ్రికా తన మ్యాచ్‌ల్లో ఒకదానిలో ఓడిపోవాలని కోరుకోవాలి. కాగా, ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుతమైన బౌలింగ్ తో బ్యాటర్లకు దడపుట్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పూనమ్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి
Image Credit : X/BCCIWomen

పూనమ్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి

ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆమె మహిళల టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లోనే శ్రీ చరణి ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.

35
ఒకే టోర్నీలో 12 వికెట్లతో టాప్
Image Credit : X/BCCIWomen

ఒకే టోర్నీలో 12 వికెట్లతో టాప్

బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 21 ఏళ్ల శ్రీ చరణి రెండు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ప్రస్తుత టోర్నమెంట్‌లో ఆమె తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 12కు చేరింది. ఈ ప్రదర్శనతో ఆమె గతంలో పూనమ్ యాదవ్ నెలకొల్పిన రికార్డును దాటేసింది. పూనమ్ యాదవ్ 2019-20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో భారత్ తరఫున 10 వికెట్లు పడగొట్టి టాప్‌లో ఉండగా.. ఇప్పుడు శ్రీ చరణి ఆ రికార్డును బద్దలు కొట్టింది.

Another feather in the cap for the No. 1⃣ ranked T20I bowler 🪶🫡

What a tournament Sree Charani is having! 💙

Updates ▶️ https://t.co/mWgNXcEkp0#TeamIndia | #T20WorldCup | #WomenInBlue | #INDvBAN pic.twitter.com/dtRmLrOaHS

— BCCI Women (@BCCIWomen) June 25, 2026

45
శ్రీ చరణి సూపర్ ఎకానమీ రేట్
Image Credit : X/BCCIWomen

శ్రీ చరణి సూపర్ ఎకానమీ రేట్

ఈ టీ20 వరల్డ్ కప్ అంతటా శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు మెయిన్ పిల్లర్‌గా మారింది. ఆమె ఈ టోర్నీలో 7.08 యావరేజ్, అలాగే 5.31 ఎకానమీ రేట్‌ను మెయింటైన్ చేసింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ 4/19 గా నమోదైంది. శ్రీ చరణి భారత తరఫున కొత్త రికార్డును క్రియేట్ చేసినప్పటికీ, టోర్నమెంట్ ఓవరాల్ రికార్డు ఇంకా కాస్త దూరంలోనే ఉంది.

55
డేంజర్‌లో ఎమిలియా కెర్ వరల్డ్ రికార్డ్
Image Credit : X/BCCIWomen

డేంజర్‌లో ఎమిలియా కెర్ వరల్డ్ రికార్డ్

శ్రీ చరణి అద్భుత ఫామ్ చూస్తుంటే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎమిలియా కెర్ వరల్డ్ రికార్డుకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎమిలియా కెర్ 2024/25 ఎడిషన్‌లో కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. టోర్నీలో భారత్ ముందడుగు వేస్తే శ్రీ చరణి ఈ వరల్డ్ రికార్డును కూడా దాటేసే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
మహిళల క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Samantha Song : థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved