MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • India vs USA : వాంఖడేలో సూర్య ప్రతాపం.. అమెరికా ఖేల్ ఖతం.. భారత్ సంచలన విజయం

India vs USA : వాంఖడేలో సూర్య ప్రతాపం.. అమెరికా ఖేల్ ఖతం.. భారత్ సంచలన విజయం

India vs USA : ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 07 2026, 11:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ముంబైలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ .. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాను చిత్తు చేసిన భారత్
Image Credit : Getty

ముంబైలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ .. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాను చిత్తు చేసిన భారత్

ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-ఏ మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శుభారంభం చేసింది. పసికూన అమెరికాతో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచిన భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అద్భుత బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టాస్ గెలిచిన అమెరికా.. భారత్‌కు ఆరంభంలోనే షాక్
Image Credit : ANI

టాస్ గెలిచిన అమెరికా.. భారత్‌కు ఆరంభంలోనే షాక్

అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనారోగ్యం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. భారత్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ రూపంలో కొత్త ఓపెనింగ్ జోడీని బరిలోకి దింపింది. అయితే, మ్యాచ్ ఆరంభంలోనే అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. అలీ ఖాన్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడంతో వాంఖడే స్టేడియం నిశ్శబ్దమైపోయింది.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఇండియాను కొట్టకుండా కప్పు కొట్టలేరు బాసూ !
Related image2
IND vs USA : సూర్య భాయ్ విధ్వంసం.. అమెరికా బౌలర్లు ఖల్లాస్
37
పవర్‌ప్లేలో కుప్పకూలిన టాప్ ఆర్డర్
Image Credit : Getty

పవర్‌ప్లేలో కుప్పకూలిన టాప్ ఆర్డర్

పవర్‌ప్లేలో అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ అద్భుత ప్రదర్శన చేశాడు. 6వ ఓవర్లో అతను ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివం దూబే (0)లను వరుసగా అవుట్ చేయడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో, 13 ఓవర్లకు భారత్ 77/6 వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది.

47
ఆదుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Image Credit : Getty

ఆదుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్లాస్ చూపించాడు. తన హోమ్ గ్రౌండ్‌లో చెలరేగి ఆడిన స్కై, 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ సహకారంతో భారత స్కోరును గౌరవప్రదమైన స్థాయికి చేర్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమెరికా బౌలర్లలో వాన్ షాల్క్‌విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

57
అమెరికా పోరాటం.. భారత బౌలర్ల దెబ్బ
Image Credit : Getty

అమెరికా పోరాటం.. భారత బౌలర్ల దెబ్బ

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాకు భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాక్ ఇచ్చారు. సిరాజ్ తన మొదటి ఓవర్లోనే ఆండ్రీస్ గౌస్‌ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్‌ను డకౌట్‌గా పంపాడు. దీంతో అమెరికా 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజయ్ కృష్ణమూర్తి (37), మిలింద్ కుమార్ (34) భారత స్పిన్నర్లను ఎదుర్కుంటూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఒకానొక సమయంలో అమెరికా 89/4 వద్ద పటిష్ఠంగా కనిపించి సంచలనం సృష్టించేలా కనిపించింది.

67
చివరలో భారత బౌలర్ల పంజా
Image Credit : Getty

చివరలో భారత బౌలర్ల పంజా

చివరి ఓవర్లలో భారత బౌలర్ల అనుభవం అమెరికాను కట్టడి చేసింది. అక్షర్ పటేల్ 16వ ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి అమెరికా ఆశలపై నీళ్లు చల్లాడు. శుభమ్ రంజనే 37 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ, భారత్ లక్ష్యం అమెరికాకు అందనంత దూరంలో నిలిచింది. అర్ష్‌దీప్ సింగ్ (2/18), మహమ్మద్ సిరాజ్ (2/28) పొదుపుగా బౌలింగ్ చేయడంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది.

77
IND vs USA : మ్యాచ్ ముఖ్యమైన గణాంకాలు
Image Credit : ANI

IND vs USA : మ్యాచ్ ముఖ్యమైన గణాంకాలు

  • టాస్: అమెరికా (ఫీల్డింగ్)
  • భారత్ స్కోరు: 161/9 (20 ఓవర్లు)
  • అమెరికా స్కోరు: 132/8 (20 ఓవర్లు)
  • టాప్ స్కోరర్ (IND): సూర్యకుమార్ యాదవ్ (84*)
  • టాప్ స్కోరర్ (USA): సంజయ్ కృష్ణమూర్తి (37)
  • బెస్ట్ బౌలింగ్ (USA): షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (4/25)
  • బెస్ట్ బౌలింగ్ (IND): అక్షర్ పటేల్ (2/24), మహమ్మద్ సిరాజ్ (2/28)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Recommended image2
జాతీయ క్రీడా పురస్క‌రాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈసారి ఊహించ‌ని ట్విస్ట్
Recommended image3
Ayush Shetty: బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్ 1 కు షాకిచ్చిన భారత ప్లేయర్
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఇండియాను కొట్టకుండా కప్పు కొట్టలేరు బాసూ !
Recommended image2
IND vs USA : సూర్య భాయ్ విధ్వంసం.. అమెరికా బౌలర్లు ఖల్లాస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved