MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Sports
  • IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !

IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !

No Handshake Policy : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. సైనికుల త్యాగాలకు గౌరవంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నో షేక్ హ్యాండ్.. సూర్య దెబ్బకు కొలంబో స్టేడియంలో హై టెన్షన్
Image Credit : Getty

నో షేక్ హ్యాండ్.. సూర్య దెబ్బకు కొలంబో స్టేడియంలో హై టెన్షన్

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ టీ20 వరల్డ్ కప్ 2026 పోరులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పుకున్నారు. గతేడాది ఆసియా కప్ 2025 నుండి కొనసాగుతున్న నో షేక్ హ్యాండ్ పాలసీని టీమ్ ఇండియా ఈ మెగా టోర్నీలోనూ కొనసాగిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆసియా కప్ నుండి కొనసాగుతున్న కఠిన నిర్ణయం
Image Credit : Getty

ఆసియా కప్ నుండి కొనసాగుతున్న కఠిన నిర్ణయం

భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడుతున్నప్పటికీ, మైదానంలో స్నేహపూర్వక కరచాలనాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ వివాదం 2025 ఆసియా కప్ సమయంలో మొదలైంది. అప్పట్లో పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు, భారత సైన్యానికి సంఘీభావంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి నుండి పురుషుల జట్టుతో పాటు జూనియర్, మహిళా జట్లు కూడా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదు.

Related Articles

Related image1
IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !
Related image2
IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే
35
ఆపరేషన్ సింధూర్.. అమరవీరులకు నివాళి
Image Credit : Getty

ఆపరేషన్ సింధూర్.. అమరవీరులకు నివాళి

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భావోద్వేగాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు గౌరవంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో కనీస స్నేహపూర్వక సంజ్ఞలు కూడా చేయకూడదని బీసీసీఐ, భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు కనీసం ఒకరినొకరు చూసుకోకపోవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం కూడా ఆటగాళ్లు లేదా సపోర్ట్ స్టాఫ్ ఎవరూ హ్యాండ్ షేక్ చేసుకోరని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు.

45
టీమ్ ఇండియాలో రెండు కీలక మార్పులు
Image Credit : Getty

టీమ్ ఇండియాలో రెండు కీలక మార్పులు

ఈ కీలక మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయం నుండి కోలుకున్న అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. అతను సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అలాగే, పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేసర్ అర్షదీప్ సింగ్ స్థానంలో స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

55
గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ హవా
Image Credit : Getty

గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ హవా

ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, నమీబియాపై) విజయం సాధించి +3.050 నెట్ రన్ రేట్‌తో ఉంది. పాకిస్థాన్ కూడా రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. వరల్డ్ కప్ చరిత్రను పరిశీలిస్తే, ఇప్పటివరకు జరిగిన 8 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ 7 సార్లు గెలవగా, పాక్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. మొత్తం 16 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI

భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !
Recommended image2
IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved