MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !

IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !

IND vs PAK : టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ సమరానికి ముందు పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ చర్చనీయాంశమైంది. అతనిని ఫుల్ స్లీవ్స్‌తో బౌలింగ్ చేయనివ్వద్దని ఇర్ఫాన్ పఠాన్ ఐసీసీని కోరారు. అసలు ఏం జరిగింది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ వేస్తున్నాడా లేక బంతిని విసురుతున్నాడా?
Image Credit : Getty

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ వేస్తున్నాడా లేక బంతిని విసురుతున్నాడా?

శ్రీలంకలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తారిఖ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు ఒక విజ్ఞప్తి చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫుల్ స్లీవ్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ అభ్యంతరం
Image Credit : Getty

ఫుల్ స్లీవ్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ అభ్యంతరం

ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్‌లో మోచేయిని వంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. "బౌలర్ యాక్షన్‌పై కొద్దిపాటి సందేహం ఉన్నా, అతనిని ఫుల్ స్లీవ్స్ ధరించి బౌలింగ్ చేయనివ్వకండి" అని ఐసీసీని కోరారు. బౌలర్లు హాఫ్ స్లీవ్స్ ధరిస్తే మోచేయి ఎంతవరకు వంగుతుందో స్పష్టంగా తెలుస్తుందని, గతంలో యాక్షన్ సరిగా లేని బౌలర్లు కావాలనే ఫుల్ స్లీవ్స్ వాడేవారని పఠాన్ గుర్తు చేశారు.

Related Articles

Related image1
IND vs PAK : రికార్డుల వేటలో భారత్.. పరువు కోసం పాక్ ! ఇదేంది భయ్యా ఇలా మొదలెట్టారు !
Related image2
IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే
36
ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌లో పాజ్.. వేగం
Image Credit : Getty

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌లో పాజ్.. వేగం

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చేసేటప్పుడు కొద్దిసేపు ఆగి బంతిని విసురుతారు. సాధారణ బంతులు వేసేటప్పుడు బాగానే ఉన్నా, వేగవంతమైన బంతులు వేసేటప్పుడు ఆయన చేయి వంగుతుందేమో గమనించాలని పఠాన్ హెచ్చరించారు. లెజెండ్స్ లీగ్ అంపైర్ అజయ్ వర్మ ఇచ్చిన సలహాను కూడా ఆయన ప్రస్తావించారు. అంపైర్లు కొద్దిగా వంగి నిలబడితే, బౌలర్ చేయి సైట్ స్క్రీన్ ముందు కనిపిస్తుందని, తద్వారా యాక్షన్‌ను స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.

46
ఉస్మాన్ తారిఖ్ యాక్షన్ చట్టబద్ధమేనా?
Image Credit : Getty

ఉస్మాన్ తారిఖ్ యాక్షన్ చట్టబద్ధమేనా?

28 ఏళ్ల ఉస్మాన్ తారిఖ్ తన యాక్షన్ గురించి స్పందిస్తూ, తన చేతికి రెండు మోచేతులు ఉన్నాయని, అది ఒక జీవసంబంధమైన సమస్య అని వివరించారు. తన యాక్షన్‌ను ఇప్పటికే రెండుసార్లు పరీక్షించారని, అది చట్టబద్ధమని తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతిని విసిరే సమయంలో చేయి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగకూడదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, లాహోర్‌లోని టెస్టింగ్ సెంటర్‌లో తారిఖ్ యాక్షన్ క్లీన్ అని తేలింది.

56
అశ్విన్, అనిల్ చౌదరి ఏమన్నారంటే?
Image Credit : X/@LindaRods

అశ్విన్, అనిల్ చౌదరి ఏమన్నారంటే?

భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తారిఖ్‌కు బౌలింగ్ పై స్పందించారు. బౌలింగ్ యాక్షన్ అనేది ఒక గందరగోళమైన అంశమని, మైదానంలోని అంపైర్లు 15 డిగ్రీల వంపును కంటితో గుర్తించడం అసాధ్యమని అశ్విన్ అభిప్రాయపడ్డారు. దీనికి రియల్ టైమ్ టెస్టింగ్ టూల్' ఒక్కటే పరిష్కారం చూపుతుందని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. అలాగే, ప్రముఖ అంపైర్ అనిల్ చౌదరి స్పందిస్తూ.. తారిఖ్ ప్రతి బంతిని ఒకే పద్ధతిలో వేస్తున్నాడని, అతని యాక్షన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం చేశారు.

66
భారత్-పాక్ పోరులో ట్రంప్ కార్డ్
Image Credit : Getty

భారత్-పాక్ పోరులో ట్రంప్ కార్డ్

గ్రూప్-A లో ఇరు జట్లు ఇప్పటివరకు అజేయంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటుంది. ఉస్మాన్ తారిఖ్ ఇప్పటివరకు ఆడిన 4 టీ20ల్లో 11 వికెట్లు తీసి పాకిస్థాన్‌కు కీలక బౌలర్‌గా మారారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లపై ఆయన అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఆయన బౌలింగ్ చేసేటప్పుడు తీసుకునే పాజ్ బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఈ మిస్టరీ స్పిన్నర్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
IND vs PAK : రికార్డుల వేటలో భారత్.. పరువు కోసం పాక్ ! ఇదేంది భయ్యా ఇలా మొదలెట్టారు !
Recommended image2
IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved