MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే

IND vs PAK : టీమిండియా ప్లేయింగ్ 11లో 3 భారీ మార్పులు.. కొత్త స్కెచ్ ఇదే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, పాకిస్థాన్ మధ్య బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. కొలంబో పిచ్ పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే, పాక్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IND vs PAK: భారత్, పాక్ పోరు.. టీమిండియాలో భారీ మార్పులు
Image Credit : X@ICC

IND vs PAK: భారత్, పాక్ పోరు.. టీమిండియాలో భారీ మార్పులు

క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘట్టం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ కీలక పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టేందుకు టీమిండియా తన తుది జట్టులో మూడు ప్రధాన మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ.. అర్షదీప్‌పై వేటు?
Image Credit : ANI

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ.. అర్షదీప్‌పై వేటు?

టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా విశ్లేషణ ప్రకారం, కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. గత కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇక్కడ స్పిన్ మ్యాజిక్ పని చేస్తోందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కుల్దీప్ కోసం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. కుల్దీప్‌కు పాకిస్థాన్‌పై మంచి రికార్డు ఉండటం కూడా ఇందుకు ఒక కారణం.

Related Articles

Related image1
IND vs PAK : కొలంబోలో రచ్చ రంబోలా.. పాకిస్థాన్ కు మైండ్ బ్లాకే !
Related image2
IND vs PAK: ‘అభిషేక్ బ్యాట్‌ను గాలికి ఊపుతాడంతే’.. హ‌ర్భ‌జ‌న్ దిమ్మ‌తిరిగే కౌంటర్
36
ఓపెనర్‌గా అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్ అవుట్
Image Credit : ANI

ఓపెనర్‌గా అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్ అవుట్

గత మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అభిషేక్ రాకపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. అభిషేక్ తుది జట్టులోకి వస్తే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కడం కష్టమే. ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతారు కాబట్టి, ఓపెనింగ్‌లో అభిషేక్ తన దూకుడును ప్రదర్శించనున్నాడు.

46
రింకూ సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్?
Image Credit : Getty

రింకూ సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్?

ఆకాష్ చోప్రా అంచనా ప్రకారం మూడో మార్పు రింకూ సింగ్ రూపంలో ఉండవచ్చు. ఫినిషర్‌గా రింకూ అద్భుతమైన ఆటగాడైనప్పటికీ, కొలంబో పిచ్‌పై అదనపు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. సుందర్ బ్యాటింగ్‌తో పాటు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. పాక్ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో సుందర్ ఆఫ్-స్పిన్ కీలకం కానుంది.

56
పాకిస్థాన్ వ్యూహం.. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు
Image Credit : Getty

పాకిస్థాన్ వ్యూహం.. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు

మరోవైపు పాకిస్థాన్ కూడా భారత్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఇద్దరు స్పిన్నర్లు (అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్), ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు (షాహీన్ ఆఫ్రిది, సల్మాన్ మీర్జా) తుది జట్టులో ఉండటం దాదాపు ఖాయం. ఆల్‌రౌండర్లలో షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్‌లలో ఒకరికి మాత్రమే చోటు దక్కవచ్చు.

66
IND vs PAK: వర్షం గండం.. అభిమానుల్లో ఆందోళన
Image Credit : Getty

IND vs PAK: వర్షం గండం.. అభిమానుల్లో ఆందోళన

ఈ మెగా ఫైట్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. కొలంబోలో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయిస్తారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

భారత్ అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
IND vs PAK : కొలంబోలో రచ్చ రంబోలా.. పాకిస్థాన్ కు మైండ్ బ్లాకే !
Recommended image2
IND vs PAK: ‘అభిషేక్ బ్యాట్‌ను గాలికి ఊపుతాడంతే’.. హ‌ర్భ‌జ‌న్ దిమ్మ‌తిరిగే కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved