MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • IND vs NED : దూబే దుమ్మురేపాడు భయ్యా.. హార్దిక్ షాక్ !

IND vs NED : దూబే దుమ్మురేపాడు భయ్యా.. హార్దిక్ షాక్ !

India vs Netherlands : అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లో శివమ్ దూబే 31 బంతుల్లో 66 పరుగులతో దుమ్మురేపాడు. నంబర్ 5 స్థానంలో భారత్ తరపున అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా దూబే రికార్డు సృష్టించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 18 2026, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శివమ్ దూబే విధ్వంసం: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర
Image Credit : X@BCCI

శివమ్ దూబే విధ్వంసం: టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ మ్యాచ్‌లో భారత యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే చెలరేగిపోయాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా దూబే చరిత్ర సృష్టించాడు. 31 బంతుల్లో 66 పరుగులు చేసిన దూబే, హార్దిక్ పాండ్యా పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్
Image Credit : Getty

హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్

గతంలో ఈ రికార్డు హార్దిక్ పాండ్యా పేరిట ఉండేది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై హార్దిక్ నంబర్ 5 స్థానంలో వచ్చి 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇప్పుడు దూబే 66 పరుగులతో ఆ రికార్డును చెరిపివేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ (58 పరుగులు), రోహిత్ శర్మ (50* పరుగులు) వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.

Related Articles

Related image1
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
Related image2
ICC T20 Rankings : అభిషేక్ శర్మ అరాచకం.. ఇషాన్ కిషన్ విధ్వంసం
35
టీ20ల్లో దూబే కెరీర్ బెస్ట్ స్కోరు
Image Credit : Getty

టీ20ల్లో దూబే కెరీర్ బెస్ట్ స్కోరు

నెదర్లాండ్స్‌పై చేసిన 66 పరుగులు శివమ్ దూబేకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు జనవరి 28, 2026న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌పై చేసిన 65 పరుగులే అతని అత్యుత్తమ స్కోరుగా ఉండేది. తాజా మ్యాచ్‌లో దూబే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే అతను తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

45
50 సిక్సర్ల మైలురాయి.. సూర్యకుమార్ సరసన దూబే
Image Credit : stockPhoto

50 సిక్సర్ల మైలురాయి.. సూర్యకుమార్ సరసన దూబే

ఈ మ్యాచ్‌లో దూబే తన రెండో సిక్సర్ బాదగానే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి అతను 553 బంతులను ఎదుర్కొన్నాడు. భారత్ తరపున అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 50 సిక్సర్లు కొట్టిన మూడవ బ్యాటర్‌గా దూబే నిలిచాడు. అభిషేక్ శర్మ (331 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (510 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు.

55
భారత్ భారీ స్కోరు
Image Credit : X@BCCI

భారత్ భారీ స్కోరు

టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఇషాన్ కిషన్ (18), తిలక్ వర్మ (31) ఆకట్టుకున్నా భారత్ ఒక దశలో 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన దూబే, సూర్యకుమార్‌తో కలిసి 41 పరుగులు, ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో (30) కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దూబే మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ తన స్పిన్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతను 19 పరుగులకే 2 వికెట్లు తీశాడు. లోగాన్ వాన్ బీక్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక దూబే తన టీ20 కెరీర్‌లో మొత్తం 197 మ్యాచ్‌లలో 3,829 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి ఓవరాల్ టీ20ల్లో 18వ అర్ధశతకం. టీ20 ప్రపంచకప్‌లో దూబేకు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Related Stories
Recommended image1
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
Recommended image2
ICC T20 Rankings : అభిషేక్ శర్మ అరాచకం.. ఇషాన్ కిషన్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved