MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • World Cup 2026 Final : అఫ్గాన్ ప్యాక్.. టీమిండియా షేక్ ! 10వ సారి ఫైనల్లో భారత్

World Cup 2026 Final : అఫ్గాన్ ప్యాక్.. టీమిండియా షేక్ ! 10వ సారి ఫైనల్లో భారత్

India U19 beat Afghanistan : అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఆరోన్ జార్జ్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో టీమిండియా రికార్డుస్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 04 2026, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అండర్ 19 వరల్డ్ కప్: అఫ్గాన్‌ పై భారత్ గెలుపు
Image Credit : Getty

అండర్-19 వరల్డ్ కప్: అఫ్గాన్‌ పై భారత్ గెలుపు

జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువసేన మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో టీమిండియా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రికార్డుస్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అఫ్గానిస్థాన్ భారీ స్కోరు.. టీమిండియా ధీటైన సమాధానం
Image Credit : Getty

అఫ్గానిస్థాన్ భారీ స్కోరు.. టీమిండియా ధీటైన సమాధానం

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. అండర్-19 స్థాయిలో ఇది చాలా మెరుగైన స్కోరు. అయితే, భారత బ్యాటర్ల జోరు ముందు ఈ లక్ష్యం చిన్నబోయింది. ఆరంభం నుంచే భారత ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బలమైన పునాది వేశారు.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్, సంజూకు షాక్.. భారత్ కొత్త వ్యూహం
Related image2
Vaibhav Sooryavanshi : ఊరమాస్ బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ
36
ఆరోన్ జార్జ్ క్లాసిక్ సెంచరీ.. వైభవ్ మెరుపులు
Image Credit : Getty

ఆరోన్ జార్జ్ క్లాసిక్ సెంచరీ.. వైభవ్ మెరుపులు

భారత ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 104 బంతులు ఎదుర్కొన్న జార్జ్ 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరోవైపు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అఫ్గాన్ బౌలర్లను వణికించాడు. వైభవ్ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 206.06గా నమోదవ్వడం విశేషం. జార్జ్ తన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

46
కెప్టెన్ ఆయుష్ బాధ్యతాయుత ఇన్నింగ్స్
Image Credit : X/BCCI

కెప్టెన్ ఆయుష్ బాధ్యతాయుత ఇన్నింగ్స్

తొలి వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే సైతం రాణించాడు. ఆరోన్ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 101 బంతుల్లో 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆయుష్ 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, జట్టు ప్రయోజనాల కోసం ఆడుతూ పెవిలియన్ చేరాడు. అనంతరం విహాన్ మల్హోత్రా (38 నాటౌట్), వేదాంత్ త్రివేది (5 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

56
వరల్డ్ కప్ చరిత్రలో భారత్ రికార్డు ఛేజింగ్
Image Credit : stockPhoto

వరల్డ్ కప్ చరిత్రలో భారత్ రికార్డు ఛేజింగ్

ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయం అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత భారీ ఛేజింగ్‌గా రికార్డు సృష్టించింది. 311 పరుగుల లక్ష్యాన్ని ఇంత సునాయాసంగా ఛేదించడం భారత జట్టు బలాన్ని చాటుతోంది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాల్లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే 2006, 2016, 2020, 2024లలో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 10వ సారి ఫైనల్‌కు చేరి 6వ టైటిల్‌పై కన్నేసింది.

66
ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో అమీతుమీ
Image Credit : x@BCCI

ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో అమీతుమీ

సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్‌పై అఖండ విజయం సాధించిన భారత్, ఇప్పుడు ఫైనల్ పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న టైటిల్ పోరులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. అఫ్గానిస్థాన్ జట్టు సెమీఫైనల్ చేరడం వారి చరిత్రలో ఇదే మొదటిసారి అయినప్పటికీ, భారత్ అనుభవం ముందు వారు తలవంచక తప్పలేదు. ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్‌లో కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే టీమిండియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్, సంజూకు షాక్.. భారత్ కొత్త వ్యూహం
Recommended image2
Vaibhav Sooryavanshi : ఊరమాస్ బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved