MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IND vs NAM: హార్దిక్, ఇషాన్ మెరుపులు.. నమీబియాకు షాక్.. నెక్స్ట్ పాకిస్థానే !

IND vs NAM: హార్దిక్, ఇషాన్ మెరుపులు.. నమీబియాకు షాక్.. నెక్స్ట్ పాకిస్థానే !

India vs Pakistan : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 8 దిశగా అడుగులు వేసింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత మోగించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2026, 11:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నమీబియాను నలిపేసిన భారత్.. హార్దిక్, ఇషాన్ వీరవిహారం!
Image Credit : X@BCCI

నమీబియాను నలిపేసిన భారత్.. హార్దిక్, ఇషాన్ వీరవిహారం!

ఢిల్లీలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన పోరులో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సూర్యకుమార్ సేన, సూపర్ 8 దశకు మరింత చేరువైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాస్ ఓడినా భారీ స్కోరు సాధించిన భారత్
Image Credit : Getty+AI Generated

టాస్ ఓడినా భారీ స్కోరు సాధించిన భారత్

ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అనారోగ్యం కారణంగా అభిషేక్ శర్మ దూరం కావడంతో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. శాంసన్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినా, ఆ తర్వాత వెంటనే వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (25), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

36
ఇషాన్, హార్దిక్ విధ్వంసం
Image Credit : Getty

ఇషాన్, హార్దిక్ విధ్వంసం

మధ్య ఓవర్లలో ఇషాన్ కిషన్ నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 61 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫామ్‌ను కొనసాగిస్తూ 28 బంతుల్లోనే 52 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి ధాటికి భారత్ తొలి 10 ఓవర్లలోనే 112 పరుగులు చేసింది. ఒక దశలో స్కోరు 250 దాటుతుందని అనిపించినా, చివరి 10 ఓవర్లలో భారత్ కేవలం 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లతో భారత పరుగుల వర్షానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు.

46
వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్
Image Credit : AFP

వరుణ్ చక్రవర్తి స్పిన్ మ్యాజిక్

207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు శుభారంభం దక్కింది. పవర్‌ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రంగంలోకి దిగడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వరుణ్ కేవలం రెండు ఓవర్లలోనే 7 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.

56
ఆరంభం అదిరింది కానీ.. కుప్పకూలిన నమీబియా
Image Credit : AFP

ఆరంభం అదిరింది కానీ.. కుప్పకూలిన నమీబియా

వరుణ్ చక్రవర్తి ధాటికి తోడు, హార్దిక్ పాండ్యా (2 వికెట్లు), అక్షర్ పటేల్ (2 వికెట్లు) కూడా రాణించడంతో నమీబియా వరుసగా వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. దీంతో నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 విజయాలు సాధించిన జట్టుగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.

66
పాకిస్థాన్‌తో భారత్ బిగ్ ఫైట్
Image Credit : X@BCCI

పాకిస్థాన్‌తో భారత్ బిగ్ ఫైట్

వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్న టీమ్ ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది. ఫిబ్రవరి 15న కొలంబో లో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అమెరికా, నమీబియాలపై గెలిచినా, బ్యాటింగ్ విభాగంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ వంటి బలమైన జట్టుతో తలపడే ముందు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం జట్టుకు అత్యవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఇప్పుడు కొలంబో పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Ishan Kishan : 6 6 6 6 6 ఇషాన్ కిషన్ కా బాప్.. సిక్సర్ల మోతతో నమీబియా పని ఖతం
Recommended image2
IND vs NAM : టీమిండియా పై నమీబియా దెబ్బ.. 4 పరుగులకే 5 వికెట్లు ఫటాఫట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved