MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • Ishan Kishan : 6 6 6 6 6 ఇషాన్ కిషన్ కా బాప్.. సిక్సర్ల మోతతో నమీబియా పని ఖతం

Ishan Kishan : 6 6 6 6 6 ఇషాన్ కిషన్ కా బాప్.. సిక్సర్ల మోతతో నమీబియా పని ఖతం

India vs Namibia : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాపై ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. సిక్సర్ల మోత మోగిస్తూ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. భారత్‌కు భారీ పవర్‌ప్లే స్కోరును అందించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
India vs Namibia : నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్
Image Credit : Getty

India vs Namibia : నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించిన ఇషాన్

టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ విస్ఫోటక బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకున్న తన ఆటతో స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంజూ శాంసన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ, కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా బౌండరీల వర్షం కురిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒకే ఓవర్‌లో 28 పరుగులు కొట్టిన ఇషాన్ కిషన్
Image Credit : AFP

ఒకే ఓవర్‌లో 28 పరుగులు కొట్టిన ఇషాన్ కిషన్

భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఇషాన్ కిషన్ అసలైన విధ్వంసాన్ని రేపాడు. నమీబియా బౌలర్ జేజే స్మిత్ వేసిన ఈ ఓవర్‌లో కిషన్ వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. మొదటి బంతికి పరుగులేమీ రాకపోయినప్పటికీ, ఆ తర్వాతి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచి, ఆఖరి బంతిని ఫోర్‌గా కొట్టారు. మొత్తంగా ఆ ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులు పిండుకున్నారు. ఆయన 254.17 స్ట్రైక్ రేట్‌తో కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

35
రోహిత్ శర్మ రికార్డు సమం
Image Credit : Instagram/indiancricketteam

రోహిత్ శర్మ రికార్డు సమం

ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున పవర్‌ప్లే లోనే 50 పరుగులు పూర్తి చేయడం ఇషాన్ కిషన్‌కు ఇది రెండోసారి. తద్వారా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును ఆయన సమం చేశారు. ఇప్పటివరకు అభిషేక్ శర్మ అత్యధికంగా మూడుసార్లు ఈ ఘనత సాధించగా, రోహిత్, ఇషాన్ చెరో రెండుసార్లు ఈ ఫీట్ సాధించారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఒక్కోసారి ఈ ఘనతను అందుకున్నారు.

45
టీ20 వరల్డ్ కప్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు ఇవే
Image Credit : Instagram/indiancricketteam

టీ20 వరల్డ్ కప్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు ఇవే

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీలు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ కూడా చేరాడు. ఈ జాబితాలో..

  1. యువరాజ్ సింగ్ - 12 బంతులు (vs ఇంగ్లాండ్, 2007)
  2. కేఎల్ రాహుల్ - 18 బంతులు (vs స్కాట్లాండ్, 2021)
  3. రోహిత్ శర్మ - 19 బంతులు (vs ఆస్ట్రేలియా, 2024)
  4. యువరాజ్ సింగ్ - 20 బంతులు (vs ఆస్ట్రేలియా, 2007)
  5. ఇషాన్ కిషన్ - 20 బంతులు (vs నమీబియా, 2026)

ప్రస్తుత 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఇది రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. శ్రీలంకకు చెందిన దాసున్ షనక 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నారు.

55
పవర్‌ప్లేలో భారత్ సరికొత్త రికార్డు
Image Credit : Instagram/indiancricketteam

పవర్‌ప్లేలో భారత్ సరికొత్త రికార్డు

ఇషాన్ కిషన్ వీరవిహారంతో భారత్ పవర్‌ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. ఇంతకుముందు 2021లో స్కాట్లాండ్‌పై సాధించిన 82 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో అధిగమించింది. అలాగే, ఓవరాల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక పవర్‌ప్లే స్కోరు. అంతకుముందు 2025లో ఇంగ్లాండ్‌పై 95 పరుగులు, 2026లో న్యూజిలాండ్‌పై 94 పరుగులు నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. తమ మొదటి మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించిన టీమ్ ఇండియా, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Recommended image2
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు
Recommended image3
ప్రైవేట్ కోచింగ్ సెంట‌ర్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి.. సీఎం కీల‌క ఆదేశాలు
Related Stories
Recommended image1
Rohit Sharma: కేవలం ఆడటం కాదు.. గెలవడానికే వస్తున్నా.. రోహిత్ శర్మ మాస్ వార్నింగ్
Recommended image2
IND vs PAK : ఒకేసారి ఇద్దరు భారత ఓపెనర్లకు గాయాలు.. గంభీర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved