MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs WI: బెంగళూరులో టీమిండియా గెలవాలంటే ఈ 3 మార్పులు చేయాల్సిందే !

IND vs WI: బెంగళూరులో టీమిండియా గెలవాలంటే ఈ 3 మార్పులు చేయాల్సిందే !

IND vs WI 5th T20I: భారత్ వెస్టిండీస్ మధ్య శనివారం బెంగళూరులో ఐదో టీ20 డిసైడర్ మ్యాచ్ జరగనుంది. సిరీస్ గెలవడానికి టీమిండియా పలు మార్పులు చేయాల్సిందేనని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 16 2026, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెంళూరులో అసలు సిసలు డిసైడర్ పోరు
Image Credit : X/BCCI

బెంళూరులో అసలు సిసలు డిసైడర్ పోరు

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు అత్యంత రసవత్తరంగా మారింది. ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. దీంతో శనివారం (అక్టోబర్ 17) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.

చివరిసారిగా బెంగళూరులో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అఫ్గానిస్తాన్‌తో జరిగింది. అప్పట్లో అది డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళి టీమిండియా అద్భుత విజయాలను సాధించింది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో భారత్ బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌లు గెలుపొందగా, 3 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హైదరాబాద్ లో చివరి వరకు ఉత్కంఠ
Image Credit : bcci

హైదరాబాద్ లో చివరి వరకు ఉత్కంఠ

హైదరాబాద్‌లో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే, భారత్ 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనివల్ల వెస్టిండీస్ ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ టీ20లో మాత్రం విండీస్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో డిసైడర్ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రధానంగా మూడు కీలక విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.

36
కుల్దీప్ యాదవ్ రీఎంట్రీపై ఉత్కంఠ
Image Credit : ANI

కుల్దీప్ యాదవ్ రీఎంట్రీపై ఉత్కంఠ

కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లోని మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ మూడు, నాల్గవ మ్యాచ్‌లలో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఇప్పుడు ఆఖరి మ్యాచ్‌లో అతని రీఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇదే టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కేవలం 3 మ్యాచ్‌లలో 7 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌పై ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 54 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం అతనికి ఉంది. బెంగళూరు పిచ్‌పై రిస్ట్ స్పిన్నర్ల పాత్ర చాలా కీలకం కానుంది. అందుకే కుల్దీప్ రాక జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

46
మిడిల్ ఓవర్లలో పరుగులు వేగంగా చేయడం
Image Credit : bcci

మిడిల్ ఓవర్లలో పరుగులు వేగంగా చేయడం

ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు చాలాసార్లు మంచి ఆరంభాలనే అందుకున్నారు. కానీ మిడిల్ ఓవర్లలో మాత్రం రన్స్ చేసే వేగం తగ్గిపోతోంది. ప్రారంభంలో దక్కిన మంచి జోరును పెద్ద స్కోరుగా మలచడంలో టీమిండియా వరుసగా విఫలమవుతోంది.

చిన్నస్వామి స్టేడియంలో చిన్న బౌండరీలు, వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ బ్యాటర్లకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి గ్రౌండ్‌లో ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో కూడా రన్ రేట్ తగ్గకుండా చూడటం చాలా ముఖ్యం. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కేవలం సింగిల్స్ తీయడమే కాకుండా, చెత్త బాల్స్‌ను బౌండరీలకు తరలించాలి. డిసైడర్ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలంటే బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిందే.

56
పేసర్లు కొత్త వేరియేషన్లు ట్రై చేయాలి
Image Credit : bcci

పేసర్లు కొత్త వేరియేషన్లు ట్రై చేయాలి

ఈ సిరీస్‌లో భారత పేస్ బౌలర్లు ఎక్కువగా వేగం, సరైన లెంత్ మీదే ఆధారపడ్డారు. అయితే బెంగళూరు పిచ్ పరిస్థితులకు తగినట్లుగా బౌలర్లు తమ వ్యూహాలను మార్చుకోవడం తప్పనిసరి.

చిన్నస్వామి స్టేడియంలో కట్టర్లు వేయడం, పిచ్‌పై బంతిని గట్టిగా దించి బౌలింగ్ చేయడం చాలా ప్రభావం చూపుతుంది. పేసర్లు స్లో బాల్స్, పేస్ వేరియేషన్లను వీలైనంత ఎక్కువగా వాడాలి. అప్పుడే బ్యాటర్లు బంతి వేగాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. సిరీస్ మొత్తం పణంగా ఉన్న ఈ తరుణంలో, బెంగళూరు కండిషన్స్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం విజయానికి కీలకం.

66
సిరీస్ కైవసం చేసుకోవడానికి చివరి అవకాశం
Image Credit : BCCI/X

సిరీస్ కైవసం చేసుకోవడానికి చివరి అవకాశం

ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై లాంటి మ్యాచ్. సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ పోరులో ఏ జట్టు తప్పులు చేయకుండా ఆడుతుందో ఆ జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులకు పూర్తి వినోదం లభించడం పక్కా. మరి రోహిత్ శర్మ లేని ఈ యువ జట్టు ఒత్తిడిని తట్టుకుని సిరీస్ గెలుస్తుందా లేదా అనేది శనివారం రాత్రికి తేలిపోతుంది

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ 2nd ODI: కివీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం.. రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
Recommended image2
ఐపీఎల్‌లో ఇప్పటివరకు కోహ్లీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత?
Recommended image3
IND vs NZ 2nd ODI : కివీస్ బ్యాటర్లను క్యార్ క్యార్ మని ఏడిపించిన గుర్నూర్ బ్రార్.. 30 ఏళ్ల రికార్డ్ బ్రేక్ బౌలింగ్
Related Stories
Recommended image1
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Recommended image2
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved