MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Harmanpreet Kaur: బిగ్ షాక్.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur: బిగ్ షాక్.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బిగ్ షాక్ ఇచ్చారు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశారు. టీమ్ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయమని సోషల్ మీడియాలో తెలిపారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 06 2026, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెప్టెన్సీ పోస్ట్ వదిలేసిన హర్మన్‌‌ప్రీత్
Image Credit : ANI

కెప్టెన్సీ పోస్ట్ వదిలేసిన హర్మన్‌‌ప్రీత్

భారత మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘకాల సారథి, 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగంతో కూడిన పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతమాత్రం సులభం కాదని, ఏళ్లకు ఏళ్లు పెనవేసుకున్న జ్ఞాపకాలు, త్యాగాలు, భావోద్వేగాలు తనతోనే ఉండిపోతాయని పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీమ్ కోసం నా వ్యక్తిగత గేమ్‌ను త్యాగం చేశా
Image Credit : ANI

టీమ్ కోసం నా వ్యక్తిగత గేమ్‌ను త్యాగం చేశా

కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత క్రికెట్ కోసం తన సర్వస్వం ఇచ్చానని హర్మన్‌ప్రీత్ గుర్తుచేసుకున్నారు. "నేను ఈ టీమ్‌కి, భారత మహిళా క్రికెట్‌కు నా రక్తం, స్వేదం, సమయం ఇచ్చాను. చాలా సందర్భాల్లో నా వ్యక్తిగత రికార్డులను, నా ఆశయాలను, నా స్వంత గేమ్‌ను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది" అని రాసుకొచ్చారు. జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని భావించి, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఆ నిర్ణయాలు అందరికీ నచ్చకపోయినా, కొన్నింటికి వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించినా, జట్టును బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చానని చెప్పారు.

35
బీసీసీఐ రివ్యూ మీటింగ్ తర్వాతే ఈ నిర్ణయం
Image Credit : ANI

బీసీసీఐ రివ్యూ మీటింగ్ తర్వాతే ఈ నిర్ణయం

గౌహతిలో జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ తర్వాతే హర్మన్‌ప్రీత్ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా టీమ్ ప్రదర్శనపై చర్చించిన అనంతరం ఈ మార్పు చోటుచేసుకుంది. 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్, 2022లో వన్డేలకు, 2023లో అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యారు. దాదాపు దశాబ్ద కాలం పాటు భారత్‌ను ముందుండి నడిపించారు.

45
చరిత్ర సృష్టించిన ట్రాక్ రికార్డ్
Image Credit : ANI

చరిత్ర సృష్టించిన ట్రాక్ రికార్డ్

హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా అనేక అద్భుత విజయాలను సాధించింది. ఆమె నాయకత్వంలోనే గతేడాది నవంబర్‌లో భారత మహిళల జట్టు తన మొదటి వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడింది. అలాగే ఇటీవల ఆసియా గేమ్స్‌లో వరుసగా రెండోసారి టీ20 గోల్డ్ మెడల్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. నంబర్ల పరంగా చూస్తే.. 155 టీ20ల్లో 92 విజయాలు, 51 వన్డేల్లో 30 విజయాలు, 5 టెస్టుల్లో 4 విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 9,000 పైగా పరుగులు చేశారు.

55
కెప్టెన్సీ ముగిసింది.. ఆట ఇంకా ఉంది
Image Credit : X/BCCIWomen

కెప్టెన్సీ ముగిసింది.. ఆట ఇంకా ఉంది

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, భారత్ తరఫున ప్లేయర్‌గా కొనసాగుతానని హర్మన్ స్పష్టం చేశారు. "నా బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహించానని భావిస్తున్నా. గుండె నిండా భావోద్వేగాలు ఉన్నా, మనసులో మాత్రం ఎంతో ప్రశాంతత ఉంది. ఇప్పుడు ఈ జట్టులో మంచి టాలెంట్, నెగ్గాలనే నమ్మకం ఉన్నాయి. ఇకపై ఎలాంటి ప్రెజర్ లేకుండా కేవలం క్రికెట్‌పై ఉన్న ప్రేమ కోసమే మళ్లీ బ్యాట్ పడతా. కెప్టెన్సీ ముగిసింది కానీ నా జర్నీ ఇంకా ఉంది" అని ముగించారు. టీమ్‌మేట్స్, కోచ్‌లు, బీసీసీఐ, కుటుంబం, అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
మహిళల క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు బిగ్ షాక్.. తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా?
Recommended image2
Siraj: ఓవల్ హీరో నుంచి రిజర్వ్ బెంచ్ వరకు.. మహమ్మద్ సిరాజ్‌కు ఏమైంది?
Recommended image3
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Related Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు బిగ్ షాక్.. తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved