హార్దిక్ పాండ్యా సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. డైమండ్ రింగ్ ఫోటోలు వైరల్
Hardik Pandya and Mahieka Sharma engagement : టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే రూమర్స్ వేడెక్కాయి. మహీకా శర్మ డైమండ్ రింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మహీకా డైమండ్ రింగ్ ఫోటో వైరల్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ మహీకా శర్మ రహస్య నిశ్చితార్థం చేసుకున్నారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మహీకా తన తాజా పోస్టుల్లో ఒకదానిలో మెరిసే డైమండ్ రింగ్‌ను ప్రదర్శించడంతో ఈ చర్చ మొదలైంది. వీరిద్దరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, అభిమానులు దీనిని పెద్ద హింట్ గా పేర్కొంటున్నారు.
మహీకా ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో ఆమె వేలికి వేసుకున్న డైమండ్ రింగ్ స్పష్టంగా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. “ఇది నిశ్చితార్థపు రింగేనా?”, “ హార్దిక్ పాండ్యాతో సీక్రెట్ ఎంగేజ్‌మెంటా?” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే హార్ది, మహీకా మధ్య సన్నిహిత సంబంధాలపై వచ్చిన వార్తలు ఈ తాజా ఫోటోలతో మరింత బలమైన చర్చకు దారి తీశాయి.
హార్దిక్, మహీకా జోడీ
గత నెల నుంచి హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ తరచూ చాలా కార్యక్రమాల్లో కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో పరస్పరం ఇంటరాక్షన్స్ చేయడం వల్ల వారి మధ్య డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ ప్రాక్టీస్ ఫోటోలతో పాటు తన కుమారుడు అగస్త్యతో ఉన్న చిత్రాలు, అలాగే మహీకాతో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
అదే రోజు హార్దిక్ స్టోరీల్లో మరిన్ని వివరాలు వెల్లడించాడు. హార్దిక్, మహీకా ఇద్దరూ హనుమాన్ పూజా నిర్వహించినట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో కూడా మహీక రింగ్ ధరించి కనిపించడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
ఒక సోషల్ మీడియా యూజర్ ఆ ఫోటో స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేయడంతో పోస్ట్ మరింత వైరల్ అయ్యింది. కొందరు వినియోగదారులు “ఇదిగో, నిశ్చితార్థం అయిపోయింది” అని అంటుండగా, మరికొందరు “ఇంత త్వరగా హార్దిక్ మళ్లీ ఎంగేజ్ అవడని అనుకోవడం కష్టం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ “వాళ్లు సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది”, మరో యూజర్ “ఇది నిశ్చితార్థం రింగ్‌లానే ఉంది.” అంటూ ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా మౌనంతో..
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. 2024లో అతను తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయాడు. విడాకుల తర్వాత కూడా ఇద్దరూ తమ కుమారుడు అగస్త్యను కలిసి పెంచుతామని ప్రకటించారు.
ఇదే సమయంలో హార్దిక్ తన కొత్త వివాహం బంధం గురించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహీకా కూడా రింగ్ గురించి నేరుగా వివరించకుండా స్మైలీ, వింక్ ఎమోజీలతో వ్యాఖ్యలకు స్పందించటం మరింత ఆసక్తి రేకెత్తించింది.
మోడల్, నటిగా మహీకా శర్మకు గుర్తింపు
మహీకా శర్మ 24 ఏళ్ల మోడల్, నటి. 2019లో పీఎం నరేంద్ర మోడీ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా సినిమాల్లోకి ప్రవేశించారు. మనీష్ మల్హోత్రా, అనితా డొంగ్రే వంటి ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేశారు. 2024లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో మోడల్ ఆఫ్ ది ఇయర్ (న్యూ ఏజ్) అవార్డు అందుకున్నారు.
హార్దిక్ 32 సంవత్సరాలు, ఇద్దరి మధ్య ఎనిమిది ఏళ్ల వయస్సు తేడా ఉన్నా సోషల్ మీడియాలో వారిద్దరి కెమిస్ట్రీ గురించి అభిమానుల్లో హాట్ టాపిక్ నడుస్తూనే ఉంది.
“My Big 3” పోస్టుతో హార్దిక్ రచ్చ
హార్దిక్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు “My Big 3” అని క్యాప్షన్ పెట్టాడు. ఆ ఫోటోలలో అతను క్రికెట్ ప్రాక్టీస్, తన కుమారుడు అగస్త్య, మహీకా శర్మలు ఉన్నారు. దీంతో అభిమానులు “ఈ ముగ్గురే హార్దిక్ జీవితంలో ముఖ్యమైనవారేమో” అని భావిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, డైమండ్ రింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రూమర్స్ మరింత వేడెక్కాయి. కానీ హార్దిక్, మహీకా ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారి మౌనం అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ రూమర్స్ నిజమా కాదా అన్నది త్వరలోనే వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

