రో-కో జోలికొస్తే కెరీర్‌లు కూడా ఉండవ్.. గంభీర్, అగార్కర్‌లకు గట్టి అల్టిమేటం
Rohit Sharma - Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనను హర్భజన్ సింగ్ సమర్థించాడు. గంభీర్, అగార్కర్ నాయకత్వంలోని టీం మేనేజ్‌మెంట్ జట్టు ఎంపిక, వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

అంచనాల భారాన్ని మోస్తూ..
క్రికెట్ అభిమానులు టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నుంచి ఎప్పుడూ భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తుంటారు. ఈ సీనియర్ ఆటగాళ్లు ఆ అంచనాల భారాన్ని మోస్తూ, నిరంతరం తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో రోహిత్ అర్ధసెంచరీ, విరాట్ రెండు శతకాలతో అద్భుతంగా రాణించారు.
రోహిత్, కోహ్లీలకు గట్టి మద్దతు
అయితే, టీం మేనేజ్‌మెంట్ సీనియర్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం మాజీ క్రికెటర్ల ఆందోళనకు దారితీసింది. ఏళ్లుగా సేవలు అందిస్తున్న ప్లేయర్లకు కనీస గౌరవం దక్కడం లేదని వారు వాపోతున్నారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రోహిత్, కోహ్లీలకు గట్టి మద్దతు పలికాడు. వారు ఎప్పటికీ గొప్ప ఆటగాళ్లే అని ప్రశంసించాడు.
గంభీర్ కెరీర్‌లో నాలుగు సార్లు గోల్డెన్ డక్..
కెప్టెన్లుగా, బ్యాటర్లుగా ఎంతో సేవ చేశారని, యువ క్రికెటర్లకు రోల్ మోడల్స్‌గా నిలుస్తున్నారని గుర్తు చేశాడు. ఆటలో పెద్దగా విజయాలు సాధించని వ్యక్తులు రోహిత్, కోహ్లీల కెరీర్‌ను నిర్ణయించడం దురదృష్టకరమంటూ, పరోక్షంగా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను విమర్శించాడు. గంభీర్ తన కెరీర్‌లో నాలుగు సార్లు గోల్డెన్ డక్ అయిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో..
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ సైతం రోహిత్, కోహ్లీలకు మద్దతుగా నిలిచాడు. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, వారిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నందున ఆడినంత కాలం జట్టులో కొనసాగించాలని సూచించాడు. మాజీ క్రికెటర్ శ్రీకాంత్ కూడా టాప్ క్లాస్ ప్లేయర్లు అయిన వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
రోకోలకు మద్దతు.. గంభీర్ కు విమర్శలు..
ఒకవైపు రోహిత్, కోహ్లీల ఆటతీరుతో మద్దతు పెంచుకుంటుండగా, మరోవైపు గంభీర్, అగార్కర్ బ్యాచ్ మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల రాయ్‌పూర్‌లో టీమిండియా 359 పరుగులను డిఫెండ్ చేసుకోలేక ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ ప్లాన్ వరకు సరిగా లేదని విమర్శకులు నిలదీస్తున్నారు.

