Rohit Sharma: సౌరవ్ గంగూలీని బీట్ చేశాడు.. రోహిత్ శర్మ మరో రికార్డ్
Rohit Sharma: అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అతను వన్డేల్లో సౌరవ్ గంగూలీని దాటి భారత్ తరఫున మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, విరాట్ కోహ్లీని కూడా బీట్ చేశాడు.

రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు
భారత్ స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో గొప్ప మైలురాయిని అందుకున్నాడు. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో రోహిత్ శర్మ 46 పరుగులు పూర్తి చేయడంతో సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. దీంతో రోహిత్, భారత్ తరఫున వన్డేల్లో మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 73 పరుగులు తన ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ అడిలైడ్ ఓవల్ మ్యాచ్ 21వ ఓవర్‌లో ఆడమ్ జాంపా బౌలింగ్‌లో బౌండరీతో 11,221 పరుగుల మార్క్‌ను దాటాడు. గంగూలీ భారత్ తరఫున 1992 నుండి 2007 మధ్య 308 వన్డేల్లో 11,221 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ ప్రస్తుతం 275 వన్డేల్లో 11,225 పరుగులు పూర్తి చేశాడు.
ముగ్గురు భారత దిగ్గజాల జాబితాలో రోహిత్
ఇప్పుడున్న వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలోకి చేరాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు.
- సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులు
- విరాట్ కోహ్లీ 14,181*
- రోహిత్ శర్మ 11,225*
- సౌరవ్ గంగూలీ 11,221
- రాహుల్ ద్రావిడ్ 10,768
ఆస్ట్రేలియాలో మరో చారిత్రక మైలురాయిని అందుకున్న రోహిత్
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో చారిత్రక ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాలో అదే జట్టు పై వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అడిలైడ్‌లో జరుగుతున్న ఈ రెండో వన్డేలో కేవలం రెండు పరుగులు చేయగానే ఆ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో కంగారు జట్టు పై 21 వన్డేల్లో 1003* పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
రోహిత్ కెరీర్ గణాంకాలు
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 275 వన్డేల్లో 48.62 సగటుతో 11,225* పరుగులు సాధించాడు. 32 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 264 పరుగులు. ఇది వన్డే చరిత్రలో ప్రపంచ రికార్డుగా ఉంది.
రోహిత్ 2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత భారత్ కోసం 500కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతూ అనేక రికార్డులను బద్దలుకొట్టాడు.