ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు.. బుడ్డోడా నువ్వు కేక అసలు.. నెక్స్ట్ టీమిండియాకే
Vaibhav Suryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశి తన 14 ఏళ్ల వయసులో అరుదైన రికార్డులను sరుస్తిస్తున్నాడు. 2025లో ఇప్పటివరకు మూడు టీ20 సెంచరీలు సాధించడమే కాకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయస్కుడిగా శతకం నమోదు చేశాడు.

14 ఏళ్లకే బుడ్డోడి ఊచకోత
ప్రస్తుతం స్వదేశంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జరుగుతోంది. ఇందులో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 14 ఏళ్ల యువ సంచలనం, తన వయసుకు మించిన ఆటతీరుతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగులు సాధిస్తున్నాడు.
డొమెస్టిక్ లో దుమ్ములేపుతున్నాడు
ఇటీవల మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశి 61 బంతుల్లో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీనితో వైభవ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ సెంచరీ చేసే సమయానికి వైభవ్ సూర్యవంశి వయసు 14 ఏళ్ల 250 రోజులు. ఈ రికార్డు గతంలో మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ పేరుతో ఉండేది, అతను 2013లో 18 ఏళ్ల 118 రోజుల వయసులో 63 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఒకే ఏడాది మూడు సెంచరీలు
ఈ అరుదైన ఘనతతో పాటు, వైభవ్ సూర్యవంశికి ఇది 2025 సంవత్సరంలో సాధించిన మూడవ టీ20 సెంచరీ కావడం విశేషం. అతను గతంలో ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లోనూ టీ20 శతకాలు సాధించాడు.
అరుదైన రికార్డు సొంతం
కేవలం 16 టీ20 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు సాధించి, 15 ఏళ్లు కూడా నిండకుండానే ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యధిక టీ20 సెంచరీల లిస్టులో
వైభవ్ సూర్యవంశీ తర్వాత అభిషేక్ శర్మ (34 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు), ఆయుష్ మాత్రే (10 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు), ఇషాన్ కిషన్ (16 ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు) ఈ లిస్టులో ఉన్నారు. అలాగే వైభవ్ సూర్యవంశీ డొమెస్టిక్ క్రికెట్‌లోనూ మంచి ఫామ్ కనబరుస్తుండటంతో.. భారత్ అండర్-19 జట్టు ఖుషీ చేసుకుంటోంది.

