MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్‌వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?

CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్‌వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?

Inspiring Journey of Sarvesh Kushare: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో సర్వేష్ కుషారే హైజంప్‌లో సిల్వర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు. 2.25 మీటర్లు దూకి భారత్‌కు తొలి రజతం అందించారు.అసలు ఎవరీ సర్వేష్ కుషారే?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
CWG 2026: కామన్‌వెల్త్ గేమ్స్‌లో హైజంప్‌లో భారత్‌కు తొలిసారి సిల్వర్ మెడల్.. ఎవరీ సర్వేష్ కుషారే?
Image Credit : instagram/sarveshkushare_hj

CWG 2026: కామన్‌వెల్త్ గేమ్స్‌లో హైజంప్‌లో భారత్‌కు తొలిసారి సిల్వర్ మెడల్.. ఎవరీ సర్వేష్ కుషారే?

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 10 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. గ్లాస్గోలో జరిగిన పురుషుల హైజంప్ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన సర్వేష్ కుషారే అద్భుత ప్రదర్శన చేశారు. 

2.25 మీటర్ల ఎత్తును అధిగమించి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే పురుషుల హైజంప్ విభాగంలో భారత్‌కు సిల్వర్ మెడల్ రావడం ఇదే తొలిసారి. ఈ చరిత్రాత్మక విజయంతో సర్వేష్ తన గ్రామానికి, దేశానికి ఎంతగానో పేరు తెచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టైట్ కాంపిటీషన్.. కౌంట్‌బ్యాక్ రూల్‌తో చేజారిన గోల్డ్
Image Credit : instagram/sarveshkushare_hj

టైట్ కాంపిటీషన్.. కౌంట్‌బ్యాక్ రూల్‌తో చేజారిన గోల్డ్

31 ఏళ్ల నేషనల్ రికార్డ్ హోల్డర్ సర్వేష్ కుషారే, జమైకాకు చెందిన రోమైన్ బెక్‌ఫోర్డ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు అథ్లెట్లు 2.25 మీటర్ల ఎత్తును సులువుగా దాటేశారు. ఆ తర్వాత ఇద్దరూ 2.28 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలమయ్యారు. అయితే, తక్కువ ప్రయత్నాల్లో మునుపటి ఎత్తులను దాటిన ప్రాతిపదికన కౌంట్‌బ్యాక్ నియమం ప్రకారం జమైకా అథ్లెట్ రోమైన్ బెక్‌ఫోర్డ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. 

దాంతో సర్వేష్ కుషారే రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ కిమానీ 2.20 మీటర్ల జంప్‌తో కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలో పాల్గొన్న మరో భారత క్రీడాకారుడు ఆదర్శ్ రామ్ 2.15 మీటర్లు దూకి 5వ స్థానంలో నిలిచాడు.

Related Articles

Related image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Related image2
CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !
35
తేజస్విన్ శంకర్ రికార్డును బ్రేక్ చేసిన సర్వేష్
Image Credit : instagram/sarveshkushare_hj

తేజస్విన్ శంకర్ రికార్డును బ్రేక్ చేసిన సర్వేష్

ఈ విజయంతో సర్వేష్, భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ రికార్డును తిరగరాశారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించడమే ఇప్పటివరకు హైజంప్‌లో భారత్‌కు ఉన్న ఏకైక మెడల్. ఇప్పుడు సర్వేష్ రజతం సాధించి ఆ రికార్డును మరింత మెరుగుపరిచారు. ఇక సోమవారం నాటి పోటీల్లో తేజస్విన్ శంకర్ కూడా పాల్గొన్నారు. 

అయితే తొలి ప్రయత్నంలో 2.05 మీటర్ల ఎత్తును దాటలేకపోయిన తర్వాత ఆయన పోటీ నుండి తప్పుకున్నారు. గురువారం నుండి ప్రారంభం కానున్న పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉన్నందున, ముందుజాగ్రత్త చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 27 ఏళ్ల తేజస్విన్ వ్యక్తిగత ఉత్తమ రికార్డు 2.29 మీటర్లు కాగా, గత రెండేళ్లుగా ఆయన ప్రధానంగా డెకాథ్లాన్‌పైనే దృష్టి పెట్టారు.

45
మొక్కజొన్న పొట్టు, దూదితో ప్రాక్టీస్ చేసిన రైతు బిడ్డ
Image Credit : instagram/sarveshkushare_hj

మొక్కజొన్న పొట్టు, దూదితో ప్రాక్టీస్ చేసిన రైతు బిడ్డ

సర్వేష్ కుషారే ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకమైనది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దేవర్‌గావ్ అనే గ్రామానికి చెందిన ఉల్లిపాయల రైతు కుమారుడే ఈ సర్వేష్. చిన్నతనంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో, ఆయన తండ్రి స్వయంగా అమర్చిన తాత్కాలిక ల్యాండింగ్ పిట్స్‌పైనే శిక్షణ తీసుకునేవాడు. మొక్కజొన్న పొట్టు, దూది, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన పిట్స్‌పై దుముకుతూ సర్వేష్ ప్రాక్టీస్ చేసేవాడు.

దాదాపు 20 ఏళ్ల వయస్సులో 2014 జూనియర్ ఛాంపియన్‌షిప్‌తో జాతీయ స్థాయిలోకి అడుగుపెట్టాడు. 2018 ఇండియన్ ఓపెన్‌లో 2.24 మీటర్ల జంప్‌తో తొలి జాతీయ స్వర్ణం సాధించాడు. 2019లో 2.26 మీటర్లు, 2022 గుజరాత్ నేషనల్ గేమ్స్‌లో 2.27 మీటర్ల రికార్డు నెలకొల్పాడు. 2025 టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 2.18 మీటర్లతో 6వ స్థానంలో నిలిచి, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

55
డైమండ్ లీగ్‌లోనూ సరికొత్త చరిత్ర
Image Credit : instagram/sarveshkushare_hj

డైమండ్ లీగ్‌లోనూ సరికొత్త చరిత్ర

సర్వేష్ కుషారే ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో సంచలన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో మొనాకోలో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో మూడో స్థానంలో నిలిచి, డైమండ్ లీగ్ పోడియంపై నిలిచిన తొలి భారతీయ హైజంపర్‌గా చరిత్ర సృష్టించాడు. అక్కడ ఆయన 2.26 మీటర్ల ఎత్తును దాటారు. 

గతంలో నీరజ్ చోప్రా, మురళీ శ్రీశంకర్, వికాస్ గౌడ తర్వాత డైమండ్ లీగ్‌లో టాప్-3లో నిలిచిన నాల్గవ భారత అథ్లెట్‌గా నిలిచాడు. అంతేకాకుండా, గతనెల భువనేశ్వర్‌లో జరిగిన నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్ల జంప్‌తో సరికొత్త జాతీయ రికార్డును కూడా క్రియేట్ చేశాడు. కష్టాలను జయించి కామన్‌వెల్త్ పీఠంపై రజతం సాధించిన సర్వేష్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
CWG 2026: ఒక్క పంచ్‌తో పాక్ కథ ఖతం.. గోల్డే టార్గెట్ అంటున్న జాదుమణి సింగ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved