MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది? అదే సీన్ !

KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఏమైంది? అదే సీన్ !

KL Rahul: గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కేఎల్ రాహల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, తీరా చూస్తే బ్యాడ్ లక్.. మళ్లీ సెంచరీ మిస్.. గాలే టెస్టులో కేఎల్ రాహుల్ ఫెయిల్యూర్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 17 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్.. కానీ మళ్ళీ సేమ్ సీన్
Image Credit : ANI

కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్.. కానీ మళ్ళీ సేమ్ సీన్

శ్రీలంకలో జరుగుతున్న గాలే టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, చివరకు సెంచరీ మిస్ అయ్యాడు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 82 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్ లో అంతా బాగానే నడిచినా, రాహుల్ అదృష్టం మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మరోసారి మూడంకెల స్కోరుని అందుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ 80s లేదా 90s లో అవుట్ అవ్వడం ఇది ఏడోసారి కావడం విశేషం. ప్రతిసారి నర్వస్ 90s లేదా 80s కి రాగానే ప్రెజర్ ఫీల్ అవుతున్న రాహుల్, చివరికి వికెట్ సమర్పించుకుంటున్నాడు. గాల్‌ టెస్టు తొలి రోజు కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద కండరాల నొప్పులు రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండో రోజు వర్షం దెబ్బ.. ఐదు పరుగులకే రాహుల్ అవుట్
Image Credit : AFP

రెండో రోజు వర్షం దెబ్బ.. ఐదు పరుగులకే రాహుల్ అవుట్

గాలే టెస్టు రెండో రోజు ఆట వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించి, రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. రెండో రోజు రిషభ్ పంత్ అవుట్ అయిన తర్వాత రాహుల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కానీ, తన వ్యక్తిగత స్కోరుకు కేవలం ఐదు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు.

ఆఫ్ స్పిన్నర్ కేశర నువానిత బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసిన రాహుల్, తన 13వ టెస్ట్ సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. ఇది కేఎల్ రాహుల్ కెరీర్‌లో 21వ అర్ధశతకం. 80 దాటాక మైండ్ గేమ్ లో రాహుల్ కింగ్‌లా ఆడలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

Related image1
IND vs SL: అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Related image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
35
80s, 90s బ్యాడ్ లక్.. రాహుల్ కెరీర్ లో రికార్డు ఇదే
Image Credit : X/BCCI

80s, 90s బ్యాడ్ లక్.. రాహుల్ కెరీర్ లో రికార్డు ఇదే

కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ లో 80s లేదా 90s మధ్యలో అవుట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ రేంజ్ లోనే పెవిలియన్ దారి పట్టాడు. ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే..

• 90 - వర్సెస్ ఆస్ట్రేలియా (బెంగళూరు, 2017)

• 85 - వర్సెస్ శ్రీలంక (పల్లెకెలె, 2017)

• 84 - వర్సెస్ ఇంగ్లాండ్ (నాటింగ్‌హామ్, 2021)

• 86 - వర్సెస్ ఇంగ్లాండ్ (హైదరాబాద్, 2024)

• 84 - వర్సెస్ ఆస్ట్రేలియా (బ్రిస్బేన్, 2024)

• 90 - వర్సెస్ ఇంగ్లాండ్ (మాంచెస్టర్, 2025)

• 82 - వర్సెస్ శ్రీలంక (గాల్, 2026)

మొదటి రోజు ఆటలో క్రాంప్స్ రావడంతో రాహుల్ బయటకు వెళ్ళినప్పుడు అభిమాానులు చాలా కంగారు పడ్డారు. కానీ రాహుల్ ఫిట్‌గానే ఉన్నాడని, క్రాంప్స్ మాత్రమే వచ్చాయని బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ వెల్లడించాడు.

45
దేవదత్ పడిక్కల్ ధనాధన్ సెంచరీ.. దిగ్గజాల రికార్డులు బద్దలు
Image Credit : ANI

దేవదత్ పడిక్కల్ ధనాధన్ సెంచరీ.. దిగ్గజాల రికార్డులు బద్దలు

ఈ మ్యాచ్‌లో అసలైన హీరో దేవదత్ పడిక్కల్. సాయి సుదర్శన్ గాయపడటంతో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్ 167 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై 2024లో పెర్త్ టెస్ట్ ఆడిన తర్వాత టీమ్‌లోకి పునరాగమనం చేసిన పడిక్కల్, తన తొలి టెస్ట్ సెంచరీని చాలా స్పెషల్‌గా మార్చుకున్నాడు.

పడిక్కల్ తన ఇన్నింగ్స్‌తో టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఛేతేశ్వర్ పుజారాల రికార్డులను బద్దలు కొట్టాడు. శ్రీలంకలో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్లలో దాదా (147), పుజారా (153)లను వెనక్కి నెట్టి పడిక్కల్ 4వ స్థానంలో నిలిచాడు. మొదటి మూడు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (203), వీరేందర్ సెహ్వాగ్ (201*), శిఖర్ ధావన్ (190) ఉన్నారు.

55
పడిక్కల్ క్లాస్ బ్యాటింగ్.. గాలేలో ఇండియా ఫుల్ కంట్రోల్
Image Credit : X/BCCI

పడిక్కల్ క్లాస్ బ్యాటింగ్.. గాలేలో ఇండియా ఫుల్ కంట్రోల్

పడిక్కల్ 134 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక ఫాస్ట్, స్పిన్ బౌలర్లను సులువుగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై స్వీప్, పంచ్ షాట్లతో విరుచుకుపడ్డాడు. గత రెండేళ్లుగా పడిక్కల్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని కోచ్ కోటక్ కొనియాడాడు.

తొలి రోజు చివరకు భారత్ 288/2తో బలమైన స్థితిలో నిలిచింది. పడిక్కల్ (131*), పంత్ (27*) తో క్రీజులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ కూడా ఉపయోగకరమైన పరుగులు చేసినప్పటికీ జయసూర్య బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై క్లారిటీ రావడం, పడిక్కల్ సెంచరీతో భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆటను భారత్ 460/9 పరుగులతో ముగించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌లో ప‌ట్టు బిగిస్తోన్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి
Recommended image2
IND vs SL: అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Recommended image3
Sri Lanka vs India: భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో శ్రీలంక మ్యాచ్‌కు ప్ర‌త్యేక స్థానం.. పంద్రాగ‌స్టు రోజు
Related Stories
Recommended image1
IND vs SL: అరంగేట్రంలోనే అదరగొట్టిన పడిక్కల్.. 24 ఏళ్ల గంగూలీ రికార్డు బ్రేక్
Recommended image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved