MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు

T20 World Cup 2026 లో తొలి సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్ తో పాతుమ్ నిస్సంక 5 రికార్డులు

Pathum Nissanka Century : 2026 టీ20 ప్రపంచకప్‌లో పాతుమ్ నిస్సంక తొలి సెంచరీతో చెలరేగాడు. అతని సునామీ నాక్ తో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలిచి శ్రీలంక సూపర్-8కు దూసుకెళ్లింది. నిస్సంక తన ఇన్నింగ్స్ రికార్డుల మోత మోగించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 16 2026, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిస్సంక వీరబాదుడు.. ఆసీస్ బౌలర్లు బేజారు
Image Credit : ANI

నిస్సంక వీరబాదుడు.. ఆసీస్ బౌలర్లు బేజారు

శ్రీలంక లో జరుగుతున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే 100 పరుగులు చేసి, ఈ టోర్నీలో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నిస్సంక అద్భుత ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అతని ధాటికి ఆస్ట్రేలియా నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో శ్రీలంక అధికారికంగా సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రికార్డుల వేటలో శ్రీలంక ఓపెనర్
Image Credit : Getty

రికార్డుల వేటలో శ్రీలంక ఓపెనర్

నిస్సంక తన ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులను తిరగరాశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా అతను నిలిచాడు. అంతకుముందు 2014లో ఉమర్ అక్మల్ చేసిన 94 పరుగులే అత్యధికం. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా మహేల జయవర్ధనే (100) రికార్డును నిస్సంక అధిగమించాడు. ఇది నిస్సంకకు అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ. ఈ క్రమంలోనే అతను టీ20ల్లో 2,500 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. కుశాల్ మెండిస్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత ఐసీసీ టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ప్లేయర్ నిస్సంక. 

Related Articles

Related image1
SL vs AUS : టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి ఆస్ట్రేలియా ఔట్
Related image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
35
కుప్పకూలిన ఆసీస్ బ్యాటింగ్
Image Credit : X/OfficialSLC

కుప్పకూలిన ఆసీస్ బ్యాటింగ్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కేవలం 8.3 ఓవర్లలోనే 104 పరుగులు జోడించడంతో ఆసీస్ 200 పైచిలుకు స్కోరు చేస్తుందనిపించింది. కానీ, శ్రీలంక లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంత (3/37) అద్భుత బౌలింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేశాడు. ఒకానొక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియా, చివరికి 181 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి నాలుగు వికెట్లను ఆసీస్ కేవలం ఆరు పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం.

45
సూపర్-8 చేరిన లంక.. ఆసీస్ గండం
Image Credit : X/OfficialSLC

సూపర్-8 చేరిన లంక.. ఆసీస్ గండం

ఈ విజయంతో శ్రీలంక గ్రూప్-బి నుండి సూపర్-8 కు దూసుకెళ్లింది. మరోవైపు ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వారు టోర్నీ నుండి నిష్క్రమించే ప్రమాదంలో పడ్డారు. జింబాబ్వే తన తదుపరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడిస్తే, ఆస్ట్రేలియా సెమీస్ రేసు నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (51), పవన్ రత్నాయకే (28*) నిస్సంకకు చక్కని సహకారం అందించారు. నిస్సంక-మెండిస్ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించగా, నిస్సంక-రత్నాయకే జోడీ కేవలం 34 బంతుల్లోనే 79 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

55
సూపర్-8 లో శ్రీలంక ఏ టీమ్స్ తో తలపడనుంది?
Image Credit : X/OfficialSLC

సూపర్-8 లో శ్రీలంక ఏ టీమ్స్ తో తలపడనుంది?

శ్రీలంక తన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. అనంతరం సూపర్-8 గ్రూప్-2లో ఇంగ్లాండ్, పాకిస్థాన్/USA/నెదర్లాండ్స్‌లో ఒకటి, అలాగే న్యూజిలాండ్/అఫ్గానిస్థాన్/UAE లలో ఒక జట్టుతో శ్రీలంక తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన నిస్సంక మాట్లాడుతూ.. "వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుంది, నా సహజ సిద్ధమైన ఆట ఆడాను. జట్టును గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ
Recommended image2
Vaibhav Sooryavanshi: సంజూ, అభిషేక్‌లలో ఒకరికి షాక్.. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లోకి వైభవ్ సూర్యవంశీ
Recommended image3
IND vs AFG Test: ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ సెంచరీల వర్షం.. కెప్టెన్ గిల్‌ ఖాతాలో వరల్డ్ రికార్డ్
Related Stories
Recommended image1
SL vs AUS : టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి ఆస్ట్రేలియా ఔట్
Recommended image2
T20 World Cup 2026: ఆస్ట్రేలియా పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved