MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Abhishek Sharma : సిక్సర్లే సిక్సర్లు.. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ! షో అదిరింది బ్రో !

Abhishek Sharma : సిక్సర్లే సిక్సర్లు.. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ! షో అదిరింది బ్రో !

Abhishek Sharma : నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో అభిషేక్ శర్మ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 84 పరుగులతో టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2026, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొడితే బంతి గ్రౌండ్ బయటే.. అందరినీ వణికించాడు.. అభిషేక్ శర్మ మాస్ బ్యాటింగ్!
Image Credit : X@BCCI

కొడితే బంతి గ్రౌండ్ బయటే.. అందరినీ వణికించాడు.. అభిషేక్ శర్మ మాస్ బ్యాటింగ్!

నాగ్‌పూర్ లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్, తన హోదాకు తగ్గట్టుగానే మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న అభిషేక్.. ఆ తర్వాత కివీస్ బౌలర్లను హడలెత్తించాడు.

టీ20 వరల్డ్ కప్ 2026 సమీపిస్తున్న తరుణంలో, ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకమైనది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ప్రదర్శన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా, అభిషేక్ శర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవర్ ప్లేలో సిక్సర్ల మోత మోగించిన అభిషేక్ శర్మ
Image Credit : X/BCCI

పవర్ ప్లేలో సిక్సర్ల మోత మోగించిన అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం నుంచే పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. నాగ్‌పూర్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్.. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసే సమయానికి భారత్ 68/2 స్కోరు సాధించగా, అందులో 31 పరుగులు కేవలం 15 బంతుల్లో అభిషేక్ సాధించినవే కావడం విశేషం.

గణాంకాల ప్రకారం, అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో కొట్టిన సిక్సర్లలో 60 శాతానికి పైగా పవర్ ప్లేలోనే వచ్చాయి. ఈ విషయంలో ప్రపంచంలోని మరే ఇతర బ్యాటర్ కూడా అతనికి దరిదాపుల్లో లేరు. పవర్ ప్లేలో అభిషేక్ ఇప్పటివరకు 49 సిక్సర్లు కొట్టగా, తర్వాతి స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 28 సిక్సర్లతో చాలా దూరంలో ఉన్నాడు. ఇది తొలి ఆరు ఓవర్లలో అభిషేక్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

35
సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
Image Credit : X@BCCI

సూర్యకుమార్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా అభిషేక్ శర్మ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 25 బంతుల కంటే తక్కువ వ్యవధిలో ఎక్కువసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.

ఇది అతనికి ఎనిమిదోసారి (25 బంతుల్లోపు 50 పరుగులు చేయడం). తద్వారా ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్, వెస్టిండీస్ విధ్వంసకరుడు ఎవిన్ లూయిస్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును (వీరందరూ 7 సార్లు సాధించారు) అభిషేక్ అధిగమించాడు. 200కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించడం అభిషేక్ ప్రత్యేకత.

45
విఫలమైన సంజూ, ఇషాన్.. ఆదుకున్న సూర్య-అభిషేక్ జోడి
Image Credit : X@BCCI

విఫలమైన సంజూ, ఇషాన్.. ఆదుకున్న సూర్య-అభిషేక్ జోడి

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 1.5 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి కైల్ జేమిసన్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 2.5 ఓవర్లలో ఇషాన్ కిషన్ (8 పరుగులు) జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దాదాపు 785 రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 99 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

55
35 బంతుల్లో 84 పరుగులు.. భారీ స్కోరు దిశగా భారత్
Image Credit : AFP

35 బంతుల్లో 84 పరుగులు.. భారీ స్కోరు దిశగా భారత్

సూర్య ఔటైనప్పటికీ అభిషేక్ తన జోరును తగ్గించలేదు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఇష్ సోధీ బౌలింగ్‌లో జేమిసన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ ఔటయ్యాడు. అతను ఔటయ్యే సమయానికి (11.6 ఓవర్లు) భారత్ స్కోరు 149/4 చేరింది.

రెండో టీ20 ఎప్పుడు?

భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం నాగ్‌పూర్‌లో మొదటి మ్యాచ్ జరగగా, మిగిలిన షెడ్యూల్ ఇలా ఉంది..

• రెండో టీ20: జనవరి 23 (రాయ్‌పూర్)

• మూడో టీ20: జనవరి 25 (గౌహతి)

• నాలుగో టీ20: జనవరి 28 (విశాఖపట్నం)

• ఐదో టీ20: జనవరి 31 (తిరువనంతపురం)

హెడ్ టు హెడ్ రికార్డ్: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 25 టీ20లు జరగగా, భారత్ 12, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 3 మ్యాచ్‌లు టై అయ్యాయి.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
ICC Rankings: కోహ్లీ అవుట్.. రోహిత్ శర్మకు షాక్.. ఆ ప్లేయర్ దెబ్బకు తారుమారైన ర్యాంకింగ్స్
Recommended image2
U19 World Cup : 8 సిక్సర్లు, 18 ఫోర్లు.. ఒక్కడే 191 రన్స్.. బౌలర్లని ఉతికి ఆరేసిన కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved