MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • U19 World Cup : 8 సిక్సర్లు, 18 ఫోర్లు.. ఒక్కడే 191 రన్స్.. బౌలర్లని ఉతికి ఆరేసిన కుర్రాడు

U19 World Cup : 8 సిక్సర్లు, 18 ఫోర్లు.. ఒక్కడే 191 రన్స్.. బౌలర్లని ఉతికి ఆరేసిన కుర్రాడు

U19 World Cup : అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ బెన్ మేయస్ స్కాట్లాండ్‌పై 191 పరుగులతో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ బాది పలు రికార్డులను సమం చేశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 21 2026, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
U19 వరల్డ్ కప్: ఇంగ్లాండ్ బ్యాటర్ విశ్వరూపం.. రికార్డుల మోత మోగించిన బెన్ మేయస్
Image Credit : X/cricketworldcup

U19 వరల్డ్ కప్: ఇంగ్లాండ్ బ్యాటర్ విశ్వరూపం.. రికార్డుల మోత మోగించిన బెన్ మేయస్

ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నుండి యూత్ వన్డేల వరకు తనదైన శైలిలో సెంచరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 

అయితే, ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో కూడా వైభవ్‌ను తలపించేలా ఒక విధ్వంసకర బ్యాటర్ తయారయ్యాడు. అతనే 18 ఏళ్ల బెన్ మేయస్. అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి, క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఆడిన తీరు చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం.. ఇంగ్లాండ్ టీమ్‌లో మరో సంచలనం !
Image Credit : X/englandcricket

వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం.. ఇంగ్లాండ్ టీమ్‌లో మరో సంచలనం !

స్కాట్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెన్ మేయస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తకాషింగా స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ పోరులో స్కాటిష్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 65 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. 

క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, మైదానం నలువైపులా షాట్లు బాదాడు. మొత్తం 117 బంతులను ఎదుర్కొన్న మేయస్, 8 భారీ సిక్సర్లు, 18 ఫోర్ల సహాయంతో ఏకంగా 191 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మేయస్ బ్యాటింగ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

35
జస్ట్ మిస్.. చేజారిన డబుల్ సెంచరీ
Image Credit : X/englandcricket

జస్ట్ మిస్.. చేజారిన డబుల్ సెంచరీ

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బెన్ మేయస్ డబుల్ సెంచరీ చేయడం ఖాయమని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు అతను నెర్వస్ నైంటీస్ ఔట్ కావడంతో ఆ అరుదైన మైలురాయిని అందుకోలేకపోయాడు. కేవలం 9 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 

అంతేకాకుండా, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టడానికి అతనికి ఇంకా 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. శ్రీలంక బ్యాటర్ విరాన్ చముదిత జనవరి 17, 2026న జపాన్‌పై 143 బంతుల్లో 192 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. మేయస్ 191 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఆ రికార్డు పదిలంగా ఉంది.

45
హసిత బోయగోడ రికార్డు సమం
Image Credit : X/englandcricket

హసిత బోయగోడ రికార్డు సమం

రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన బెన్ మేయస్, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో హసిత బోయగోడతో సమానంగా నిలిచాడు. 2018 జనవరి 23న కెన్యాపై హసిత బోయగోడ 152 బంతుల్లో 191 పరుగులు చేశాడు. 

ఇప్పుడు మేయస్ సరిగ్గా అదే స్కోరుతో అతని సరసన చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెన్ డాకిన్స్ (5) వికెట్ కోల్పోయి 12 పరుగులకే కష్టాల్లో పడింది.

55
400 పరుగులు దాటించిన భాగస్వామ్యాలు
Image Credit : X/englandcricket

400 పరుగులు దాటించిన భాగస్వామ్యాలు

తొలి వికెట్ త్వరగా పడినా, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 129 బంతుల్లో 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోసెఫ్ 65 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా మేయస్ జోరు తగ్గలేదు. కెప్టెన్ థామస్ రేవ (22)తో కలిసి 47 పరుగులు, కాలెబ్ ఫాల్క్నర్ (32)తో కలిసి నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. 

చివర్లో రాల్ఫీ ఆల్బర్ట్ (13)తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. మేయస్ 191 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన తర్వాత, ఫర్హాన్ అహ్మద్ (నాటౌట్ 15), సెబాస్టియన్ మోర్గాన్ (నాటౌట్ 24) జట్టు స్కోరును 400 దాటించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్ హౌస్ 3 వికెట్లు, ఫిన్లే జోన్స్ 2 వికెట్లు పడగొట్టారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
ICC Rankings: కోహ్లీ అవుట్.. రోహిత్ శర్మకు షాక్.. ఆ ప్లేయర్ దెబ్బకు తారుమారైన ర్యాంకింగ్స్
Recommended image2
IND vs NZ : టీమిండియా బిగ్ ప్లాన్.. కిషన్ ఈజ్ బ్యాక్, ఆ స్టార్ ప్లేయర్ ఔట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved