పూజ చేస్తున్నప్పుడు కన్నీళ్లు, ఆవలింత వంటివి ఎందుకు వస్తాయో తెలుసా?
మనలో చాలామంది రెగ్యులర్ గా పూజలు చేస్తుంటారు. అయితే దేవుడి పూజ చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో ఉన్నా కొన్నిసార్లు ఆవలింతలు, కన్నీళ్లు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటో.. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

దేవుడి పూజ చేసేటప్పుడు..
మనసు శుద్ధి, ఆత్మ శుద్ధి కోసం.. మనం ప్రతిరోజూ దేవుడికి పూజలు చేస్తుంటాం. భక్తి శ్రద్ధలతో అన్ని ఆచారాలను పాటిస్తుంటాం. కానీ పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం కలుగుతుంది. కొంతమందికి ఆవలింత ఎక్కువగా వస్తుంది. మరికొంతమందికి కన్నీళ్లు వస్తుంటాయి. ఇంకొంతమందికి చెడు ఆలోచనలు కూడా వస్తాయి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అయితే దీనికి అర్థం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూజ సమయంలో ఆవలింత వస్తే..
చాలామందికి పూజ సమయంలో, మంత్రం జపించేటప్పుడు పదే పదే ఆవలింతలు వస్తుంటాయి. అయితే అలా ఆవలింతలు వస్తే మీ ఆలోచనలు శుద్ధి అవుతున్నాయని అర్థమట.
పూజ టైంలో కన్నీళ్లు వస్తే..
కొంతమందికి పూజ చేసే సమయంలో లేదా దేవాలయానికి వెళ్లినప్పుడు.. అక్కడ దేవుడి విగ్రహాన్ని చూసే టైంలో కన్నీళ్లు వస్తుంటాయి. అయితే అలా కన్నీళ్లు వస్తే.. దేవుడితో మీరు బంధంలో ఉన్నారని, దేవుడు మీ ప్రార్థనను విన్నాడని అర్థమట.
రోమాలు నిక్కపొడుచుకోవడం (goosebumps)
పూజ చేస్తున్న సమయంలో చాలామందికి శరీరంపై రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇలా జరిగితే.. దైవిక శక్తి మీ శరీరాన్ని స్పృశిస్తుందని అర్థమట.
చెడు ఆలోచనలు వస్తే..
కొంతమందికి పూజ చేసేటప్పుడు లేదా మంత్రం పఠించేటప్పుడు చెడు ఆలోచనలు వస్తుంటాయి. మనసును ఎంత కంట్రోల్ చేసినా కూడా చెడు ఆలోచనలు ఆగవు. ఇలా జరిగితే.. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని అర్థమట.