Zodiac Signs: ఈ 5 రాశులపై శివుడి అనుగ్రహం ఎక్కువ.. వీరిని ఆయనే కాపాడుతాడు!
శివుడిని.. చాలామంది భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి సోమవారం శివారాధన చేస్తే తమ జీవితంలో కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడు తన భక్తులను అన్ని విధాలా కాపాడుతాడు. కానీ కొన్ని రాశులపై ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దానివల్ల సంపద, అదృష్టం వారి వెంటే ఉంటాయి. మరి శివుడికి ఇష్టమైన ఆ రాశులెంటో ఓసారి తెలుసుకుందామా...

జ్యోతిష్యం ప్రకారం శివుడిని నమ్మకంతో పూజించేవారికి ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. 12 రాశుల్లో కొన్ని రాశులవారికి మహాదేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ అదృష్ట రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
జ్యోతిష్యం ప్రకారం మేష రాశి వారిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. శివుడి కృపతో ఈ రాశివారు కష్టాల నుంచి త్వరగా బయటపడి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లోనూ శివుడి కృపతో మేష రాశివారు విజయం పొందుతారు.
వృషభ రాశి
శివుడికి ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ రాశివారిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉండటం వల్ల వీరి జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుందని నమ్మకం. వీరికి ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు శివుడిని ఆరాధిస్తే గౌరవం, కీర్తి లభిస్తుందని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు సంతోషం వెల్లివిరుస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.
కుంభ రాశి
శివుడికి ఇష్టమైన రాశుల్లో కుంభ రాశి కూడా ఉంది. కుంభ రాశి అధిపతి శనిదేవుడు. ఈ రాశివారు శివుడికి కూడా ప్రియమైనవారు. కుంభ రాశివారు సత్యవంతులు, నిజాయితీపరులు, ఇతరులకు మంచి చేసేవారు. అందువల్ల శివుడు వారి వల్ల సంతోషిస్తాడు. వారు జీవితంలో గౌరవం, సంతోషం, ఐశ్వర్యం అనుభవిస్తారు. మంచి ఉద్యోగం, ప్రతిష్ట, వ్యాపారంలో లాభాలు పొందుతారు.
మకర రాశి
మకర రాశి అధిపతి శని మహారాజు. శని శివుడిని తన ఆరాధ్య దైవంగా భావిస్తాడు. శివుడిని పూజించేవారికి శని కూడా హాని చేయలేడని నమ్మకం. ఈ రాశివారిని కష్టకాలంలో శివుడే కాపాడుతాడని జ్యోతిష్యం చెబుతోంది.