MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!

Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!

ఇల్లు, ఇంటి పరిసరాలు వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడంతోపాటు డబ్బుకు లోటుండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 18 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు
Image Credit : Freepik

వాస్తు ప్రకారం ఇంట్లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది స్థిరమైన ఆదాయం, ప్రశాంతమైన జీవితం. దానికోసం కొందరు ఎంత కష్టపడి పనిచేసినా, కొన్నిసార్లు డబ్బు నిలవదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం ద్వారా మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఆ మొక్కలు డబ్బు రాకను పెంచి, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయని చెబుతున్నారు. ఆ మొక్కలేంటో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్కీ బాంబూ
Image Credit : Getty

లక్కీ బాంబూ

లక్కీ బాంబూ.. మంచి అదృష్టాన్ని, కొత్త అవకాశాలను ఆకర్షిస్తుందని నమ్మకం. దీన్ని పెంచడం కూడా చాలా సులభం. ఇంట్లో హాల్‌లో లేదా ఆఫీస్ టేబుల్‌పై పెడితే, అభివృద్ధి, ఆర్థిక వృద్ధి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

మల్లె

మల్లెపూలు వాటి సువాసనతో మనసును ప్రశాంతపరుస్తాయి. వాస్తు ప్రకారం మల్లె చెట్టు డబ్బును ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. అయితే, దీన్ని పెంచడానికి కొంచెం శ్రద్ధ అవసరం. మంచి వెలుతురు, సరైన నీరు అందిస్తే బాగా పెరుగుతుంది.

Related Articles

Related image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Related image2
Astrology: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం అనకూలంగా ఉన్నా చాలు.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు!
35
తులసి
Image Credit : our own

తులసి

హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. తులసిని కిటికీ దగ్గర లేదా ఎక్కువ వెలుతురు వచ్చే చోట పెట్టడం మంచిది. ఇది కుటుంబంలో శాంతిని, ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్మకం.

స్నేక్ ప్లాంట్‌

స్నేక్ ప్లాంట్‌కు గాలిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. వాస్తు ప్రకారం, ఇది నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఇంటి మూలల్లో లేదా ప్రవేశ ద్వారం దగ్గర పెడితే మంచి శక్తి నిలిచి ఉంటుంది.

45
మనీ ప్లాంట్
Image Credit : Getty

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ పేరులోనే దాని ప్రత్యేకత తెలుస్తుంది. ఇది ఇంట్లో డబ్బు రాకను పెంచే మొక్కగా చాలా ఫేమస్. వాస్తు ప్రకారం, దీన్ని ఇంటి ఆగ్నేయ మూలలో పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు, ఇది గాలిని కూడా శుద్ధి చేస్తుంది.

పీస్ లిల్లీ

పీస్ లిల్లీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి, జీవితంలో సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతుంది.

55
జెడ్ ప్లాంట్
Image Credit : Getty

జెడ్ ప్లాంట్

జెడ్ ప్లాంట్ చిన్న, మందపాటి ఆకులను కలిగి ఉంటుంది. ఇది ఆర్థిక వృద్ధికి, వ్యాపార పురోగతికి సహాయపడుతుందని నమ్మకం. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పెడితే కొత్త ఆదాయ అవకాశాలు పెరుగుతాయి.

ఇంట్లో మొక్కలు పెంచడం కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది జీవనశైలిని మార్చే ఒక మార్గం కూడా. వాస్తు శాస్త్రం చెప్పిన ఈ మొక్కలను సరైన స్థలంలో పెట్టి, జాగ్రత్తగా చూసుకుంటే.. డబ్బు రాక, అదృష్టం, మనశ్శాంతి నెమ్మదిగా పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Car Colours: ఈ రంగు కార్లకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ.. మీ కారు ఏ కలర్?
Recommended image2
Astrology: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం అనకూలంగా ఉన్నా చాలు.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved