MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Amavasya: ఆదివారం అమావాస్య... అరుదైన రోజున కచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

Amavasya: ఆదివారం అమావాస్య... అరుదైన రోజున కచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

Amavasya: పితృ పక్షం సమయంలో మన పూర్వీకుల ఆత్మలు భూమి మీదకు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో శ్రాద్ధకర్మలు, తర్పణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ఈ అమావాస్య రోజున చేయకూడని పనులు కూడా ఉంటాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 18 2025, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆదివారం అమావాస్య
Image Credit : Getty

ఆదివారం అమావాస్య

భారతీయ సంప్రదాయాల్లో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పితృ పక్షాలలో వచ్చే అమావాస్యను మరింత పవిత్రమైనదిగా పేర్కొంటారు. ఈసారి అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రానుంది. అమావాస్య ఆదివారం రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే, దీనిని అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 పితృ పక్షాల ప్రాధాన్యత...
Image Credit : Getty

పితృ పక్షాల ప్రాధాన్యత...

పితృ పక్షం సమయంలో మన పూర్వీకుల ఆత్మలు భూమి మీదకు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో శ్రాద్ధకర్మలు, తర్పణాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని, పితృ దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజున చేసే దానధర్మాలు, శ్రాద్ధాలకు రెట్టింపు ఫలితాలు వస్తాయని నమ్ముతారు.

సర్వపితృ అమావాస్య – అరుదైన సమయం

ఈసారి అమావాస్య రోజు సర్వపితృ అమావాస్య కూడా వస్తోంది. ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రోజున శ్రద్ధతో పూజలు చేస్తే కుటుంబానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం. అదనంగా ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించబోతోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దాని ప్రభావం మన దేశంలో కనిపించదు అని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం... ఈ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే..!
Related image2
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం... ఈ రాశులకు ఇబ్బందులు తప్పవు..!
35
ఆర్థిక సమస్యలకు పరిహారాలు
Image Credit : Getty

ఆర్థిక సమస్యలకు పరిహారాలు

జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అమావాస్య రోజున కొన్ని సులభమైన పరిహారాలు చేస్తే సమస్యలు క్రమంగా తగ్గుతాయని పండితులు సూచిస్తున్నారు:

ఇంట్లో కర్పూరాన్ని తీసుకుని, దాన్ని మొత్తం ఇంటి చుట్టూ తిప్పి బయట కాల్చేయాలి.

ఎర్ర మిరపకాయలు, నల్ల నువ్వులు తీసుకుని ఇంటి చుట్టూ తిప్పి, వాటిని ప్రవహించే నీటిలో వదలాలి.

ఈ ప్రక్రియతో ఇంటి ఆర్థిక దోషాలు తొలగి, శుభప్రవాహం మొదలవుతుందని నమ్మకం.

45
పిల్లల భయానికి నివారణ
Image Credit : Perplexity

పిల్లల భయానికి నివారణ

చిన్నారులు తరచూ భయపడటం, రాత్రిళ్లు నిద్రలేవడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజున వెంట్రుకలతో తాయేత్తు కట్టుకుంటే అమావాస్య దోషప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

55
చేయకూడని పనులు
Image Credit : Getty

చేయకూడని పనులు

అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్యమైన ఒప్పందాలు చేయడం, దూర ప్రయాణాలు చేయడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం... ఈ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే..!
Recommended image2
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం... ఈ రాశులకు ఇబ్బందులు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved