- Home
- Astrology
- Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం... ఈ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే..!
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం... ఈ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరుచుకున్నట్లే..!
Solar Eclipse: ఈ గ్రహణ సమయంలో బుధుడు హస్త నక్షత్రంలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. రాహువు పూర్వాభాద్రపద నక్షత్రంలో, చంద్రుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు.

Solar Eclipse
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో సూర్య గ్రహణం ఇది. సెప్టెంబర్ 21న రాత్రి 10:59న గ్రహణ కాలం మొదలౌతుండగా... తెల్లవారుజామున 3: 23 వరకు ముగియనుంది. ఈ గ్రహణం భారత్ లో కనిపించనప్పటికీ... గ్రహాల ప్రభావం మాత్రం... మనపై చాలా ఎక్కువగానే ఉండనుంది.
ఈ గ్రహణ సమయంలో బుధుడు హస్త నక్షత్రంలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. రాహువు పూర్వాభాద్రపద నక్షత్రంలో, చంద్రుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. గ్రహణ సమయంలోనే ఈ నక్షత్ర మార్పులు జరుగుతుండటం... మూడు రాశులకు చాలా మంచి ప్రయోజనాలను కలిగించనుంది. ముఖ్యంగా ఆ మూడు రాశుల అదృష్టానికి తలుపులు తెరచుకోనున్నాయి. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా...
1.మేష రాశి...
సెప్టెంబర్ 21న సూర్య గ్రహణం రోజున, చంద్రుడు, బుధుడు, రాహువు.. తమ నక్షత్రాలను మార్చుకుంటున్నాయి. ఈ నక్షత్ర మార్పులు.. మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మేష రాశివారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపడతారు. వ్యాపారంలో చాలా బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో స్నేహితుల మద్దతు బాగా లభిస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. అవి ఈ సమయంలో తగ్గే అవకాశం ఉంది. కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు.
2.మిథున రాశి...
చంద్రుడు, బుధుడు, రాహు గ్రహాల అనుగ్రహం కారణంగా, మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు సమాజంలో తమకంటూ ఒక కొత్త పేరును పొందుతారు. అలాగే, ఈ కొత్త సంబంధాల కారణంగా, మీరు సామాజిక జీవితంలో అందరితో బాగా కలిసిపోతారు. అలాంటి పని చేసే మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కాలంలో తమ శత్రువులను వదిలించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయం పెట్టుబడులు పెట్టాలనుకునే మిథున రాశి వారికి చాలా మంచిది. దీనితో, సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. మిథున రాశి వారికి మాటల్లో చాలా సౌమ్యత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి....
మేష, మిథున రాశి తర్వాత అంతటి ప్రయోజనం వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. ఈ నక్షత్రాల మార్పులు.. వృశ్చిక రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు తీసుకురానుంది. కెరీర్ లో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మాత్రం ఎలాంటి గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కళకు సంబంధించిన రంగంలో పనిచేసే వృశ్చిక రాశి యువకులు సమాజంలో తమకు మంచి పేరు తెచ్చుకుంటారు.