Aashada Masam: ఆషాఢ మాసంలో ఈ వస్తువులను దానం చేస్తే ఎంత మంచిదో తెలుసా?
హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో శుభకార్యాలు చేయనప్పటికీ.. పూజలు, వ్రతాలు మాత్రం విరివిగా చేస్తుంటారు. ఆషాఢ మాసంలో కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఆషాఢ మాసంలో ఏం దానం చేస్తే మంచిది?
ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. కానీ తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. ఈ నెలలోనే తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, బోనాల ఉత్సవాలను జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం.. ఈ కాలంలో మహా విష్ణువు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమట. కానీ ఈ మాసంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వేటిని దానం చేయాలో ఇక్కడ చూద్దాం.
తెల్లటి దుస్తులు, పాలు, పెరుగు..
ఆషాఢ మాసంలో తెల్లటి దుస్తులను దానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటు పాలు, పెరుగు, తెల్లని రంగు వస్తువులు దానం చేయడం మంచిదట. తద్వారా మానసిక ప్రశాంతత, దేవుని అనుగ్రహం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చెప్పులు, బూట్లు
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఆషాఢ మాసంలో చెప్పులు, బూట్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యంగా పేదవారికి ఈ వస్తువులు దానం చేయడం వల్ల ఇరువురికి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
జల దానం
ఈ మాసంలో నీటిని దానం చేయడం మంచిదట. ఈ దానాన్ని మానవత్వానికి చిహ్నంగా భావిస్తారట.
గో దానం
ఆషాఢ మాసంలో గోవును దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అన్న దానం
జ్యోతిష్యం ప్రకారం ఆషాఢ మాసంలో పేదవారికి అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారట.
గొడుగు దానం..
ఈ మాసంలో గొడుగు దానం చేయడం వల్ల అదృష్టం కలిసివస్తుందని పండితులు చెబుతున్నారు.
బెడ్ షీట్లు, దిండ్లు..
పురణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు ఆషాఢ మాసంలో విశ్రాంతిలో ఉంటాడు. ఈ సమయంలో అవసరమైన వారికి బెడ్ షీట్లు, దిండ్లు దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఆషాఢ మాసంలో చేసే ఏ దానమైనా నమ్మకం, విశ్వాసంతో చేస్తే పుణ్య ఫలితాలు దక్కుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.