MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఆడపిల్లలు ఉన్న తండ్రి ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఆడపిల్లలు ఉన్న తండ్రి ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, రాజకీయ వ్యూహకర్త. ఆయన తన నీతి సూత్రాల్లో కుటుంబ బంధాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ముఖ్యంగా ఆడపిల్లల తండ్రి, తన కూతురితో ఎలా ఉండాలి? ఎలాంటి తప్పులు పొరపాటున కూడా చేయకూడదు వంటి విషయాలు బోధించాడు. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 20 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆడపిల్లల తండ్రులకు చాణక్యుడి సలహాలు
Image Credit : Asianet News

ఆడపిల్లల తండ్రులకు చాణక్యుడి సలహాలు

భారత రాజకీయ చరిత్రలో చాణక్యుడిది ప్రత్యేక స్థానం. ఆయన గొప్ప పండితుడు. మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో సూత్రాలను చెప్పారు. ఆయన రాసిన 'నీతి శాస్త్రం'లో కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బాధ్యతల గురించి లోతైన సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా కూతుళ్లు ఉన్న తండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు సూచించారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
ఇతరుల ముందు అవమానించకూడదు
Image Credit : Pinterest

ఇతరుల ముందు అవమానించకూడదు

చాణక్యుడి ప్రకారం, ఒక తండ్రి తన కూతురిని ఇతరుల ముందు ఎప్పుడూ అవమానించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. కూతురి గౌరవాన్ని కాపాడటమే తండ్రి మొదటి కర్తవ్యం. తండ్రి మాటలు కూతురి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్న తప్పు చేసినా, ఆమె గురించి నెగిటివ్‌గా మాట్లాడితే అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కూతురి వైఫల్యాలను పదేపదే విమర్శిస్తే, ఆమెలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. అందుకే తండ్రి ఎప్పుడూ ప్రోత్సాహకరంగానే మాట్లాడాలి.

Related Articles

Related image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Related image2
Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!
36
వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం వద్దు
Image Credit : Pinterest

వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం వద్దు

కూతురు తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలను తండ్రి గౌరవించాలని చాణక్యుడు బోధించాడు. పెళ్లి, కెరీర్, చదువు వంటి విషయాల్లో సలహా ఇవ్వడం తండ్రి బాధ్యతే అయినా, ఆమె ఇష్టానికి విరుద్ధంగా తన అభిప్రాయాలను కూతురిపై రుద్దడం తప్పు. కూతురి వ్యక్తిత్వాన్ని, ఆమె ఆశయాలను అర్థం చేసుకొని, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఆమెకు ఇవ్వాలి. కూతురు తనకు నచ్చిన కెరీర్‌ను ఎంచుకున్నప్పుడు, తండ్రి అడ్డుపడకుండా, ఆమె ఆసక్తిని, నైపుణ్యాన్ని గౌరవించాలి.

46
లింగ వివక్ష చూపకూడదు
Image Credit : Pinterest

లింగ వివక్ష చూపకూడదు

కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని చాణక్యుడు స్పష్టం చేశారు. కొడుకులకు ఇచ్చే ప్రేమ, గౌరవాన్ని కూతుళ్లకు కూడా సమానంగా ఇవ్వాలి. ఆడ, మగ అని తేడా చూపడం పెద్ద తప్పు. కొడుకుకు అందించే విద్య, ప్రేమ, అవకాశాలు అన్నీ కూతురికి కూడా సమానంగా దక్కాలి. కూతురిని నిర్లక్ష్యం చేయడం లేదా మరో రకంగా చూడటం మహా పాపం అంటాడు చాణక్యుడు. కొడుకు ఉన్నత చదువుకు ప్రాధాన్యం ఇచ్చి, కూతురికి పెళ్లి మాత్రమే ముఖ్యమని భావిస్తే అది పెద్ద పాపమని చాణక్యుడు తేల్చిచెప్పారు.

56
భద్రత కల్పించడం
Image Credit : Pinterest

భద్రత కల్పించడం

కూతురికి భద్రత కల్పించడం తండ్రి ప్రాథమిక బాధ్యత అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. ఆమెకు శారీరక, మానసిక, భావోద్వేగ భద్రతను కల్పించాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఆమెను ఒంటరిగా వదిలివేయకూడదు. ఆమె చుట్టూ ఉన్న పరిసరాల గురించి తండ్రి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. 

66
పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు
Image Credit : AI Generated

పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు

పెళ్లి అనేది జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం. ఈ విషయంలో తండ్రి అస్సలు తొందరపడకూడదని చాణక్యుడు సూచించారు. అబ్బాయి కుటుంబం, వారి నేపథ్యం, ఇద్దరి మధ్య పొంతన, అన్నింటికన్నా ముఖ్యంగా కూతురి ఇష్టం తెలుసుకోవాలి. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, కూతురి సంతోషానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చాణక్యుడు సూచించాడు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Akshaya Tritiya 2026:అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? డోన్ట్ వర్రీ.. ఇవి కొన్నా అదృష్టమే!
Recommended image3
Vastu Tips: గుడి పక్కన ఇల్లు కట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Vastu Plants: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవే!
Recommended image2
Ketu Effects: కేతువు చెడు దృష్టి.. ఈ 4 రాశులవారికి కష్టకాలం మొదలైనట్లే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved