MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!

Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రకటించింది ఇండియన్ రైల్వే.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 30 2026, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం కు డైరెక్ట్ ట్రైన్
Image Credit : Gemini AI

హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం కు డైరెక్ట్ ట్రైన్

దక్షిణ భారత యాత్రలు ఇష్టపడే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతికి నిత్యం వేలాదిమంది ప్రయాాణిస్తుంటారు… తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా వెళ్లినవారు దగ్గర్లోని అరుణాచలంకు కూడా వెళుతుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రాలను కలుపుతూ చర్లపల్లి – తిరుచిరాపల్లి మధ్య స్పెషల్ ట్రైన్ నడిచేది.. ఇప్పుడు ఈ రైలును శాశ్వత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం 17077, 17078 నంబర్లతో కూడిన ఈ రైలు జూలై 7 నుంచి రెగ్యులర్‌గా నడవనుండి.

సాధారణంగా తెలుగు ప్రజలు తిరుపతితో పాటు అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను సందర్శిస్తుంటారు. అయితే ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఈ మూడు ఆలయాలను కలుపుతూ రైలు సర్వీస్ లేదు.. దీంతో భక్తులు వివిధ రైళ్లు మారుతూ అవస్థలు పడేవారు. దీంతో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా కుటుంబాలతో వెళ్లేవారికి డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య. ఇది గుర్తించిన రైల్వే విభాగం ఈ మూడు ఆలయాలను కలిపుతూ ఓ వీక్లీ ట్రైన్ వేసింది... అంటే ఇప్పుడు ఒకే రైలు తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను చుట్టేసి వస్తుందన్నమాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్ ప్రెస్..
Image Credit : freepik

చర్లపల్లి-తిరుచిరాపల్లి ఎక్స్ ప్రెస్..

17077 నంబర్ గల చర్లపల్లి – తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఏడుకొండలస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కొత్త వీక్లీ సర్వీసు ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేస్తుంది.

ఆ తర్వాత ఈ రైలు రేణిగుంట, చిత్తూరు, కాట్పాడి, అరుణాచలం (తిరువణ్ణామలై) మీదుగా వెళ్తుంది. అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా బుధవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుచిరాపల్లి చేరుకుంటుంది. అంటే శ్రీరంగం శ్రీరంగనాథస్వామిని కూడా దర్శించుకోవచ్చు.  

Related Articles

Related image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
33
తిరుచిరాపల్లి-చర్లపల్లి రిటర్న్ జర్నీ
Image Credit : Gemini AI

తిరుచిరాపల్లి-చర్లపల్లి రిటర్న్ జర్నీ

తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీరంగం, అరుణాచలం, తిరుపతి మీదుగా ప్రయాణించి గురువారం రాత్రికి చర్లపల్లి చేరుకుంటుంది. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ సర్వీసు, కేవలం సాధారణ రైలుగానే కాకుండా దక్షిణ భారతదేశ భక్తి పర్యాటకానికి ఒక కొత్త యాత్రా మార్గంగా మారుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved