భర్తలను భార్యలు ఎందుకు చంపుతున్నారు? సమరం చెప్పిన కఠోర వాస్తవాలు
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఇటీవల ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఈ మహిళలకు ఏం జరిగింది.? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారన్న చర్చ మొదలైంది.

వివాహేతర సంబధాలే కారణం
భర్తలను చంపుతోన్న కేసుల్లో ఎక్కువ శాతం వివాహేతర సంబంధాలే కారణమని నివేదికలు చెబుతున్నాయి. కట్టుకున్న భర్తను హతమార్చడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళలు సైతం తమ భర్తను అత్యంత కీరతకంగా చంపుతున్నారు. భర్తను చంపి శవాన్ని డ్రమ్ములో పెట్టిందో ఓ మహిళ, హనీమూన్‌కి తీసుకెళ్లి కిరాయి గుండాలతో భర్తను చంపించిందో భార్య, కూరలో విషం కలిపి కట్టుకున్న వాడిని కడతెర్చింది మరో మహిళ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయానక సంఘటనలు. అప్పటి వరకు అన్యోన్యంగా సాగుతోన్న భార్యభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. అయితే అసలు ఈ వివాహేతర సంబంధాలకు అసలు కారణం ఏంటన్న విషయాన్ని తెలుసుకుందాం.
KNOW
బంధం బలంగా లేకపోవడం.
ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే కచ్చితంగా వారి మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉండాలి. కానీ కొందరు జంటల మధ్య మాత్రం అలాంటి భావోద్వేగాలు ఉండవు. ఏదో భార్య, భర్తలం కదా కలిసి ఉండక తప్పదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు. దీంతో వీరి మధ్య శారీరక బంధం కూడా బలంగా ఉండలేకపోతోంది. ఇలాంటి కారణాలతో మహిళలు పరాయి పురుషులకు, అలాగే మగవారు ఇతర మహిళలకు ఆకర్షితులవుతున్నారు.
శారీరక సంబంధానికి మించి
సాధారణంగా భార్య, భర్తల మధ్య శారీరక సంబంధానికి మించిన బంధం ఉండాలి. కానీ కొందరిలో అది కొరవడుతుంది. భార్య తలనొప్పిగా ఉందంటే.. అవునా..! ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి బయటకు వెళ్లిపోతాడు భర్త. అదే పరాయి మగాడు అయితే తనను ఇంప్రెస్ చేయడానికి దగ్గరుండి మరీ ట్యాబ్లెట్ వేస్తాడు. ఇలాంటి చర్యలు కూడా మహిళలు ఇతరులకు ఆకర్షితులవ్వడానికి కారణంగా చెప్పొచ్చు.
ఆకర్షణ
పరాయి స్త్రీలను ఇష్టపడే వాడు ఎలాగైనా తనను ఆకర్షించాలని చూస్తాడు. కామంతో ఆలోచించే వాడు పరాయి స్త్రీ అందాన్ని పొగుడుతాడు. సహజంగా రోజూ కలిసి ఉండే భార్యభర్తలు ఒకరిని ఒకరు పొగుడుకోరు. అలాంటి సమయంలో మరో పరాయి మగాడు తనను ఆకాశానికి ఎత్తడంతో మహిళ సంతోషిస్తుంది. కేవలం సంతోషించడమే కాకుండా అతనిపై అభిమానాన్ని పెంచుకుంటుంది. ఇది కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది.
బహుమతులు
కొన్ని సందర్భాల్లో పరాయి మగాళ్లు ఇచ్చే బహుమతులకు కూడా స్త్రీలు ఆకర్షితులవుతుంటారు. ముఖ్యంగా నగలు, చీరలు వంటి వాటికి కూడా అట్రాక్ట్ అవుతారు. కేవలం డబ్బు పరంగానే కాకుండా తనకు ఓ వ్యక్తి బహుమతి ఇచ్చాడంటే తన దృష్టిలో ఎంత ప్రాముఖ్యత ఉందన్న అంశం స్త్రీని ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందుకే భార్య,భర్తలు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఎంతో గొప్పదైన భార్యభర్తల అనుబంధాన్ని సరైన అవగాహన లేకుండా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటితరం యువత ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధాల్లో చిన్నచిన్న గొడవలు వచ్చినా దాంపత్య జీవితంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానించడం వల్ల కష్టాలు తప్పవు.
వివాహేతర సంబంధాలకు అసలు కారణాలు పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)